Tuesday, August 28, 2012

 Alert - Earn money by seeing Mails -Follow the below link for full story.

Click here

Tuesday, July 10, 2012

దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ....



అవినీతి నిందారోపణలు ఎదుర్కుంటున్న మంత్రులకు న్యాయ సహాయం ప్రజా ధనం తో అందించడం సిగ్గు మాలిన పని.  ప్రజా ధనం దుర్వినియోగం చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు కు ప్రజా ధనం తో న్యాయ సహాయం అందిస్తూ మళ్లీ ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరుస్తున్నారు.  మంత్రులకు న్యాయ సహాయం ప్రభుత్వ పరంగా అందించాలని తీసుకున్న నిర్ణయమే చెబుతోంది ప్రభుత్వం కూడా ముద్దయే నని. ఇక ఈ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు వుందా?  ప్రజా ప్రతినిదులేమైన ప్రజా సమస్యల మీద పోరాడి ఆరోపణలు ఎదుర్కున్ టున్నారా? లేక వారేమైనా కాదు నిరుపేదల?  అందరు అ తానులో ముక్కలే అందుకే ప్రధాన ప్రతిపక్షం నుంచి కూడా పెద్ద వ్యతిరేకత కనపడడం లేదు.  కనీసం కోర్టులైన జ్యోక్యం చేసుకుని ఈ అక్రమాన్ని అరికట్టాలని ఆసిస్తూ...

Friday, June 22, 2012

సిగ్గు సిగ్గు ...

సిగ్గు సిగ్గు ...

భారత టెన్నిస్ సమాఖ్య లండన్ లో జరిగే ఒలింపిక్స్ కు రెండు జట్లు మహేష్ మరియు బోపన్న, పేస్ మరియు విష్ణు వర్ధన్ లను  ఎంపిక చేసి తమ చేత కానీ తనాన్ని బయట పెట్టుకుంది.  పేస్ తో జతకట్టేది లేదని మొండికేసిన మహేష్ మరియు బోపన్న ల మీద క్రమశిక్షణ చర్య కూడా తీసుకోలేని స్థితి లో వున్నాము అని బహిరంగంగానే ఒప్పుకున్నారు.   అలా ప్రకటించి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చారు.  దేశ ప్రయోజనాలు గాలికి వదిలేసారు.  బోర్డులను క్రీడాకారులు శాసించే స్థితిలో వున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు మన వ్యవస్థలు ఎంత  దిగజరిపోయయో.   దేశ ప్రయోజనాలకన్న తన ఈగో నే  ముఖ్యమనుకుని తను చెడింది కాకా వర్ధమాన క్రీడ కరుడిని సహితం చెడగొట్టిన మహేష్ క్షమార్హుడు కాదు మరియు చరిత్ర హినుడిగా మిగిలి పోతాడు.  తన స్వ ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మహేష్ అసలు  క్రీడ కారుడే కాదు.  డర్టీ ......  

Saturday, June 16, 2012

ప్రజాస్వామ్యమా? లేక మతస్వామ్యమా ?

హైదరాబాదు నగరంలో ఒక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న లేడి హోం గార్డ్ తన విధులకు స్టేషన్ లో మరియు బందోబస్తు విధులకు కూడా  నేను బురఖా వేసుకుంటాను అనుమతినిమ్మని ఆడిగితే చిత్తం మీకు  నచ్చినట్లుగా నే చేయండి అని అనుమతినిచ్చారుట పోలీసు బాసులు.  

Thursday, June 14, 2012

తల పండిన వయసులో లింగ మార్పిడి ఆపరేషన్ ?

చైనా లో క్వియన్ జిన్ఫాన్ అనే  84  సంవత్సరాల వృద్ధుడు స్త్రీ గ మారేందుకు లింగ మార్పిడి చేయించుకో వలని అభిలషిస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా అతను వక్ష సంపద పెరుగుదల కోసం  హార్మోన్ల ఇంజెక్ష నలు కూడా తీసుకుంటున్నాడు మరియు స్త్రీ ల వస్త్ర ధారణ ను అనుకరిస్తున్నాడు.  అతనికి పెళ్లి అయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.  తనకి చిన్నతనం నుంచి అమ్మాయిలాగా వుండట మంటే చాల ఇష్టమని తనకు తానుగా మహిళా గ పేరు మార్చుకున్న అతడు నాలుగు సంవత్సరముల క్రితం తన రహస్య కోరికను వెల్లడి చేసాడు.   తన 14 వ ఏట నుంచి ఆడవారిలాగా నడవాలని వుండేది కానీ నేను ఒంటరిగా ఉన్నపుడు మాత్రమే అల చేసే వాడిని అని "నన్ఫంగ్" అను దిన పత్రిక కు తెలిపాడు.  వ్రుత్తి రీత్యా కలిగ్రాఫెర్ అయిన అతడు ఇంత కాలం తనలో ని ఈ కోరికను  తన తల్లి తండ్రులకు, భార్య కు కుమారినికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. 

Tuesday, June 12, 2012

ఇదేనా ప్రజాస్వామ్యం ?


ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజి లోక్ సభ స్తానానికి అ రాష్ట్ర ముఖ్య మంత్రి అఖిలేష్  భార్య డింపుల్  ఏక గ్రివంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రజా స్వామ్యం అంటే  ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకో బడడమే అని నిర్వచనం ?  మరి డింపుల్  యాదవ్ ఎన్నికలో ప్రజల ప్రమేయం ఏముంది.  నిజంగా అ రాష్ట్ర ము లోని పార్టిలు ప్రధాన ప్రతి పక్షము మరియు జాతీయ పార్టీలతో సహా అభ్యర్ధిని నిలబెట్టక పోవడం సిగ్గుచేటు.  దేశం లోని రాజకీయ నాయకులందరూ ప్రాంతాల వారిగా పంచుకుంటూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.  ఇక్కడ అధికారమే ఆయుధం అని విస్పష్టంగా తెలుస్తోంది.  ఆమె 2009 లో జరిగిన  లోక్ సభ ఎన్నికలలో పోటి చేసి ఓటమి పాలయింది.  ఇప్పుడు వాళ్ళాయన ముఖ్యమంత్రి కావడం తో ఇల్లాలి ముచ్చట ని ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టి తీర్చాడు.

Monday, June 11, 2012

ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన నోబెల్ బహుమతి ప్రైజ్ మని తగ్గింపు.

విజ్ఞాన శాస్త్రము, సాహిత్యము మరియు శాంతి రంగాలలో ప్రతి సంవత్సరము ఇచ్చే నోబెల్ బహుమతి విలువను అయిదవ వంతు కు తగ్గించి నట్లుగా నోబెల్ ఫౌండేషన్ తెలిపింది.  డైనమైట్ ను కనుగొన్న అల్ఫ్రెడ్ నోబెల్ చే సమకుర్చబడిన మూలధనం తో 1900 వ సంవత్సరము లో  ఏర్పాటు చేయబడిన ఫౌండేషన్   ప్రతియేటా వివిధ  రంగాలలో అసమాన్య ప్రతిభ కనపరచిన వారికి నోబెల్ బహుమతి ప్రకటిస్తూ వుంది.  గడచిన దశాబ్ద కాలంగా ఖర్చులు మూలధనం మీద వచ్చే వడ్డీ కన్నా అధికమవడం మరియు నిర్వహణ భారం కూడా పెరిగిపోవడంతో ప్రైజ్ మనీ ని 10 మిలియన్ క్రౌన్ ల నుంచి 1 .12  మిలియన్ క్రౌన్ లకు తగ్గించారు.

Tuesday, June 5, 2012

డీజిల్ లేదా గాస్ తో నడిచే బైక్స్ ?

పెట్రొల్ ధరలు ప్రభుత్వ నియంత్రణ లేమి కారణంగా రోజు రోజు కూ పెరిగిపోతున్నాయి.  ఈ మధ్య కాలంలో  డీజిల్ లేదా గాస్ తో నడిచే కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మరి డీజిల్ లేదా గాస్ తో నడిచే బైక్స్ ఎందుకు రావట్లేదు?  కారణం ఏమిటి? టెక్నాలజీ సమస్య లేక ఫైనన్సియల్ వయబిలిటీ లేకపోవడమా?

Saturday, June 2, 2012

ఈ క్రింది పోస్ట్ మీద నాస్పందన.
వాల్లు ఏడుస్తుంటే

మొదటగా వాళ్ళ ఏడుపుకు కారణం స్వయంక్రుతాపరాధం.  అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్ల గొట్టారు.  దానికి ఫలితం అనుభవిస్తున్నారు.

ఇక రాజశేఖర్ రెడ్డిగారు ప్రవేశ పెట్టిన అన్ని schemes ప్రజలకు తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే కలుగ జేస్తాయి, అవి కూడా కొద్ది మంది కి మాత్రమే.  ఆ schemes క్రింద పెట్టిన ఖర్చు వలన private వ్యక్తులు (corporate) మాత్రం బాగా లాభ పడ్డారు.  చాలామంది అర్హత లేని వ్యక్తులు అక్రమ రేషన్ కార్డులు, దొడ్డి దారిలో అవసరమున్న లేకున్నా పధకాల ముసుగులో దోచుకున్నారు.  ఆ సొమ్మును దీర్ఘకాలంగా ప్రయొజనలను ఇచ్చే కళాశాలలు, ఆసుపత్రులు మొదలయిన infrastructure మీద ఖర్చు చేసి వుంటే  వాటి ఫలాలు కొన్ని తరాలు వారు అనుభవించే వారు.  నిజంగా అభివ్రుధ్ధి ఆంటే అది, అంతే కాని ఓట్ల కోసం, తన స్వప్రొయొజనాల కోసం ప్రజల కష్టార్జితాన్ని నీళ్ళ పాలు చేయడం కాదు.  అటువంటి వాల్లు మనకు నాయకులు.  దయచేసి మీ అజ్నానాన్ని వీడండి.  వాల్లు schemes పేరుతో మనల్ని దోచుకుంటున్నారు, వాస్తవాన్ని గ్రహించండి.  చివరగా ఒక్క మాట, ఫలనా వ్యక్తి నిర్మించిన కాలేజీ ఇది అని కొన్ని దశాబ్దాల తరువాత కూడా జనం చెప్పుకుంటారు అంటే చూడండి, అది మనకు తరతరాలు చేకూర్చే ప్రయొజనం.

Thursday, April 12, 2012

కొత్తగా ఆలోచించు


బాగుంది కదా కొత్త లాజిక్.

Saturday, April 7, 2012

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

"ఆరోగ్యమే మహా భాగ్యం" అన్నది నానుడి.  ఇది అక్షర సత్యం అన్నది నేడు నిరూ పితమవుతున్నది. ప్రజల కోసం ప్రజలచేత నిర్మితమైన మన ప్రభుత్వం "ప్రజారోగ్యాన్ని" గాలికి వదిలేసింది.  లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లు అని  ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు.  ప్రజల రక్తం పిండి మరి పన్నులు వాసులు చేస్తున్నారు.  వారి ని మద్యం మత్తు లో ముంచి వారి  ఆరోగ్య "సంపద"ని దోచేస్తున్నారు. కానీ ప్రాధమిక సదుపయాలైన విద్య, వైద్యం, మంచినీటి వసతి మొదలగునవి కల్పించటం లో విఫలమైనాయి.  ఇప్పటికి చాల గ్రామాలలో వైద్య సదుపాయం మృగ్యం.  ఏజన్సీ ప్రానతలైతే చెప్పనవసరం లేదు.  అడవి తల్లి బిడ్డలు దోమ కాటుకి కూడా బలైపోతున్నారు.  ప్రభుత్వ వైద్యశాలలు ని నిర్వీర్యం చేస్తున్నారు మరియు బడా కార్పొరేటు సంస్థలకు తాయిలలిచ్చి మరి మేపుతున్నారు.  నైతిక విలువలు హరించి పోతున్నాయి.  వైద్య వృత్తి కి సంపాదనే పరమావధి గా మారింది.  పాలకులరా కళ్ళు తెరవండి.  ప్రజలు  మిమ్మల్ని ఏమి అడగట్లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి దారి చూపించండి. వాళ్ళని బిచ్చగాళ్ళని చేయకండి. వారికి కనీస వసతులు (వారి చేతిలో లేనివి ) కలిపించండి చాలు అదే పదివేలు. సర్వే జనా సుఖినోభవంతు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని అతిచిన్న గ్రామం వేలం లో అమ్మకం !

పేరు తెలపడానికి ఇష్టపడని వియాత్నం జాతీయుడు అమెరికా లో ఒకే ఒక వ్యక్తి నివసిస్తున్న గ్రామం "బ్యుఫోర్డ్" 9 ,00 ,000 US డాలర్లకు వేలం లో కొనుక్కున్నాడు.   ఇప్పటివరకు ఈ గ్రామంలో   61 సంవత్సరముల వయస్సు గల  వ్యక్తి  డాన్ సమ్మోన్స్ నివసిస్తున్నాడు.  రైల్ రోడ్డు వసతి గల ఈ గ్రామం లో  ఒకప్పుడు  2000 మంది నివసించేవారు.  ఈ గ్రామమానికి రైల్వే  సదుపాయం  రద్దు చేసిన తరువాత గ్రామంలో ని వారంతా ఒక్కొక్కరుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వేలం అన్ లైన్ మరియు అన్ సైట్ లో నిర్వహించారు.  1,00 ,000 డాలర్ల వద్ద మొదలైన  వేలం లో  హంగ్ కాంగ్ , న్యూ యార్క్ , ఫ్లోరిడా, కాన్సాస్ మరియు వ్యోమింగ్ ల నుంచి పోటి దారులు పాల్గొన్నారు.  అన్ సైట్ లో 20  మంది పాల్గొనగా కొంత మంది ఫోన్ లో కూడా బిడ్ చేసారుట.  కొనుగోలుదారునకు 10 ఎకరముల స్థలం, ఇల్లు, గారేజ్ లతో పాటు సెల్ టవర్ మరియు పార్కింగ్ లాట్ కూడా లభిస్తాయిట.

Friday, April 6, 2012

హనుమజ్జయంతి ఎప్పుడు?

ఈ రోజు హనుమజ్జయంతి అని హైదరాబాదులో చాలా దేవాలయాలలో వేడుకలు నిర్సహించారు.  కాని కాలెండరు లో మే నెల 15 వ తేది అని ఉంది.  ప్రతి సంవత్సరము మే నెలలో వస్తుంది.  కాని మరి ఈ రోజు నిర్వహించిన వేడుకలు ఎమిటి? జయంతి రెండుసార్లు వచ్చే అవకాశం లేదు కదా?

నవ గ్రహాలు కాదుట?

పరీక్షల కాలం, మా అమ్మాయిని గ్రహాలు ఎన్ని అని అడిగితే ఎనిమిది అని సమాధానం చెప్పింది, కాదు తప్పు తొమ్మిది అని నేను చెబితే కాదు ఎనిమిది అని మాటీచర్ చెప్పారు అని అంది. కాని మన సౌరవ్యవస్తలోని గ్రహాలు తొమ్మిది అవి మార్స్, వీనస్, ఎర్త్, మెర్యురీ, జూపిటర్, సాటరన్, యురేనస్, నెప్ల్యూన్ మరియు ప్లూటో అని చిన్నప్పుడు చదుపుకున్నట్లు బాగా గుర్తు. వెంటనే పుస్తకం తిరగేసాను అప్పుడు తెలిసింది ఇప్పుడు గ్రహాలు ఎనిమిదిగానే పరిగణిస్తున్నారని.  అగస్టు 2006 లో జరిగిన సమావేశంలో అంతర్జాతీయ ఖగోళ సమితి ప్లూటో ని ఈ మధ్య కనుగొన్న ఇతర ఖగోళ వస్తువులను (సెరస్ 2003, UB313) లను మరుగుజ్జు గ్రహాలుగా పరిగణించాలని నిర్ణయించారుట.  ఇంక అప్పటి నుండి గ్రహాలు ఎనిమిది అని పాఠ్యాంశాలలో కూడా మార్పు చేశారు. 

Thursday, April 5, 2012

కాఫీ తో మరో ప్రయోజనం

ప్రతీ రోజూ వ్యాయామం తరువాత ఒక కప్పు కాఫీ త్రాగడం మరువకండి.  ఎందుకంటే వ్యాయామం చేసిన తరువాత కాఫీ త్రాగితే చర్మ కాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ.  ఈ రెంటి కలయిక వలన కాన్సర్ కారక ఎలుకలలో చర్మ వ్రణాలు 62% వరకూ తగ్గినట్లు న్యూజెర్సీ లోని రట్గర్స్ ఎర్నెస్ట్ మారియో స్కూల్ ఆఫ్ ఫార్మసీ కనుగొంది.  ఈ రెంటి కలయిక సూర్యరస్మి వలన కలిగే కాన్యర్ ను ఎలుకలలో గణనీయంగా తగ్గించినట్లు డా. యావో పింగ్-లూ చెపుతున్నారు. మనుష్యులలో కూడా ఇవే ఫలితాలు కలుగుతాయని నమ్మకంగా తెలియచేస్తున్నారు. కెఫీన్ మరియు వ్యాయామం రెండూ మనకు మేలు చేస్తాయి అయితే రెండిటి కలయిక మరింత మంచి ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు.  కాబట్టి వ్యాయమంతో బాటు ఒక కప్పు కాఫీ మర్చిపోకండే.

Tuesday, April 3, 2012

మిస్ యూనివర్స్ కెనడా పోటిలలో లింగ మార్పిడి మహిళ కు అవకాశం ?

వచ్చే మే నెలలో జరిగే 61 వ మిస్ యూనివర్స్ కెనడా పోటిలకు ఫైనలిస్ట్ గా ఎంపిక అయిన లింగ మార్పిడి  మహిళ ను పోటిలకు అనర్హురాలిగా నిర్వాహకులు గతనెలలో ప్రకటించారు. పోటి నియమ నిబంధనల ప్రకారం పోటిదారులు జన్మతః మహిళ అయి వుండాలి. కాగా సోమవారం తమనిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా మిస్ యూనివర్స్ సంస్థ ప్రకటించింది. 23 సంవత్సరాల  జెన్న తలకోవ జన్మతః మహిళ కాదు.  ఆమె 4 సంవత్సరాల క్రితం లింగ మార్పిడి శస్త్ర చికిత్స ద్వార మహిళ గా మారింది.

Saturday, March 31, 2012

తమిళంలో విడుదల కానున్న శ్రీరామరాజ్యం

నయనతార యెక్క రీఎంట్రీని కోలిపుడ్ సొమ్ముచేసుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.  ఆమె చివరి సినిమా శ్రీరామరాజ్యం యెక్క అనువాద హక్కులను పంపిణీదారుడైన కిరణ్ కొనుక్కున్నారు.  తమిళ అనువాదం ఎప్రిల్ రెండవవారంలో విడుదలకు సన్నాహలు చేస్తున్నారుట.  కాగా ప్రస్తుతం నయనతార అజిత్ కి కధానాయకిగా ఒక తమిళ సినిమాలో నటిస్తోంది.

Wednesday, March 28, 2012

టీ కాలు ఇన్ జెక్ష్ న్ రూపంలో నే ఎందుకు వుంటాయి?

టీ కాలు ఇన్ జెక్ష్ న్ రూపంలో నే ఎందుకు వుంటాయి? టాబ్లెట్ లేదా కాప్సూల్ రూపంలో ఎందుకు ఉండవు? అని మా అమ్మాయి మొన్న టీ కా కోసం హాస్పిటల్ కు వెల్లినప్పుడు అడిగింది.  నిజమే కదా, అనిపించింది.  కారణం చెప్పలేకపోయాను.  మీ కేమైనా తెలుసా?

Saturday, March 10, 2012

తెలుగులోనే టైపు ఛేయడం ఎలా?

తెలుగులో టైపు చేయడానికి అనేక ఉపకరణాలు గూగుల్ ఐఎమ్ఇ, బరహ, లేఖిని, హంసలేఖ, అక్షరమాల మొదలైనవి ఉన్నాయి.  అయితే అవి అన్నీ ఫోనెటిక్ లేక ఇన్ స్క్రిప్ట్ పద్ధతిలో టైపు చేయడానికి మాత్రమే సహయ పడతాయి. ఇవన్నీ తెలుగు టైపింగ్ రాని వారు సులభంగా టైపు చేయడానికి ఎంతో ఉపయోగ పడతాయి కాని తెలుగు టైపింగ్ గోద్రేజ్, రెమింగ్టన్ టైపురైటర్ల మీద నేర్చుకున్న వారు పైన పేర్కొన్న పద్ధతులు ఉపయోగిస్తే వారు నేర్చుకున్న విద్య మర్చిపోయే అవకాశం పుంది.  వారికోసమే ఇప్పుడు నేను ఒక ఉచిత సాప్ట్ వేర్ ను పరిచయం చేయబోతున్నాను.  ఇది C-DAC వారు అభివృద్ధి పరిచారు.  ఇది పూర్తిగా ఉచితం.  మీరు ఈ క్రింది లింక్ ద్వారా తెలుగు యూనికోడ్ ఫాంట్స్ మరియు కీ బోర్డ్ డ్రైవరును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  లేదా అభ్యర్ధన మీద CD పొందవచ్చు.  ఈ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి మీరు పైన పేర్కొన్న మూడు పద్ధతుల లోనూ టైపు చేయవచ్చు.  తెలుగు భాష మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల సాఫ్ట్ వేర్ లను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.  లైనక్స్ సాఫ్ట్ వేర్ కోసం ఫాంట్స్ ను ఇచ్చారు కాని కీబోర్డ్ డ్రైవర్ ను ప్రొవైడ్ చేయలేదు.  మీకు తెలిసిన ఇలాంటి సాఫ్ట్ వేర్ ఉంటే తెలియ చేయండి.  

ఇక్కడ క్లిక్ చేయండి

Friday, March 9, 2012

హేట్ స్టోరీ గోడ పత్రిక లో ని హీరోయిన్?

సంచలనం శ్రుష్టించిన విక్రమ భట్ సినిమా "హేట్ స్టోరీ" గోడ పత్రిక లో ని హీరోయిన్ "పావోలి దామ్"ట.  ఈమె బంగ్లా లో వివాదాస్పద పాత్రల కు పేరోందిన సినీ నాయిక. 
ఫోటో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Thursday, March 8, 2012

గీతారెడ్డికి నారాయణ లేఖ

గీతారెడ్డిని విమర్శించి నాలుక కరుచుకున్న నారాయణ ఆమెకు క్షమాపణ కోరుతూ ఉత్తరం రాశారు.  బహుశా ఈ వివాదం ఇక్కడి తో ముగిసిపోవచ్చు.   ఈ విషయం మీద ప్రజలు, ప్రముఖులు లేదా విమర్శకులు వెంటనే స్పందించారు. మరికొందరు ఎస్.సి/ఎస్.టి అట్రాసిటీ కేసు కూడా పెట్టారు.  అయితే ఈ మధ్య కాలంలో బహుశా చాలా కాలంగా కూడా కావచ్చు, ఒక విచిత్రమైన పోకడని గమనిస్తున్నాం.  అది ఏమిటంటే, "మహిళ అని చూడాకుండా ఆరోపించారు" లేదా "నేను బలహీన వర్గానికి చెందినవాడిని, కాబట్టి నా మీద ఆరోపణలు చేశారు" అంతే కాకుండా ఎస్.సి, ఎస్.టి కి చెందినవరు అయితే చెప్పనక్కరలేదు వెంటనే ఎస్.సి/ఎస్.టి అట్రాసిటీ కేసు అంటున్నారు.  ఇక్కడ నేను చెప్పొచ్చేదేమిటి అంటే, ఒక ఆరోపణ వచ్చినపుడు అందులోని నిజా నిజాలు చూడ కుండా, లేదా ఆ ఆరోపణ తప్పు అని చెప్ప కుండా పై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు.  ఇక్కడా ప్రాముఖ్యత ఇవ్వవలసింది ఆరోపణ ఏమిటీ అనే దాని మీద కాని, అది మహిళల మీద చేశారా లేక ఎస్.సి/ఎస్.టి ల మీద చేసారా అని కాదు అని నా అభిప్రాయం.  పత్రికలలో నూ ఇటువంటి శీర్షికలే చూస్తున్నాము. "బలహీన వర్గాల మీద దాడి" లేక "బలహీన వర్గానికి చెందిన మహిళ మీద అత్యాచార ప్రయత్నం".  ఏదైనా దాడి లేక అక్రుత్యం ఎవరిమీద జరిగినా దాని ఫలితం ఒక్కటే. ఎస్.సి/ఎస్.టి, బలహీన వర్గాల మీద ఒక లాగా లేక సాధారణ ప్రజలమీద ఒక లాగా వుండదు. అలాగే మహిళల మీద ఒకలాగా పురుషుల మీద ఒకలాగా ఉండదు.  కష్టం నష్టం అందరికీ ఒకే లాగా వుంటాయి.  సమస్యలు, ఆరోపణలు అనేవి జండర్, కాస్ట్ & క్రీడ్ ఆధారంగా వుండకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు?

Wednesday, March 7, 2012

మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం ఎలా అయింది?

    1907 లో న్యూయార్క్ లోని వస్త్ర పరిశ్రమలలోని స్ధితి గతులపై విసుగెత్తిన మహిళలు పనిగంటలు తగ్గింపు, వేతనాల పెంపు, ఓటు హక్కు కోసం నినదిస్తూ దాదాపు 15000 మంది సమ్మె చేశారు.  సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగింది.  మరోకధనం ప్రకారం 1857 మార్చి 8 వ  తేదీన న్యూయార్క్ లోని వస్త్ర పరిశ్రమలలో జరిగిన సమ్మె 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అదే స్ధితిగతులు కొనసాగుతున్నందున 1907 లో ఈ సమ్మె జరిగింది.  సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలోనే ఫిబ్రవరి నెల ఆఖరి  ఆదివారం 1909 నుండి 1913 దాకా అమెరికా అంతటా 'ఉమెన్స్ డే' జరిగింది.  అయితే జర్మనీ లోని కోపెన్ హగ్ లో 1910 లో అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ జరిగింది.  ఈ సమావేశానికి 17 దేశాల నుండి 100 మందికి పైగా హజరయ్యారు.  ఈ సమావేశాన్ని 'క్లారా జెట్కిన్' నిర్వహించారు.  ఆమె ప్రదిపాదన మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలన్న విషయమై అంగీకారం కుదిరింది.  అనేక దేశాలలో ఫిబ్రవరి ఆఖరి ఆదివారాన్ని మహిళా దినోత్సవంగా జరుపుకునే వారు.  మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 2 లక్షల మంది రష్యన్ సైనికుల మృతికి నిరసనగా రష్యాలో 'బ్రెడ్, పీస్ & రైట్ టు ఓట్' అన్న నినాదంతో సమ్మె ప్రారంభమైంది.  రష్యాలో పాటించే జ్యూలియన్ కాలెండర్ ప్రకారం 23 ఫిబ్రవరి 1917 న ఈ సమ్మె ప్రారంభమైంది.  అయితే గ్రెగరియన్ ప్రకారం ఈ సమ్మె మార్చి 8 న ప్రారంభమైనట్లు లెఖ్క.  అప్పటినుండి మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటించే సంప్రదాయం అనేక దేశాలు పాటిస్తున్నాయి.  1911 మార్చి 8 న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మొదటగా డెన్మార్క్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లాంటి అనేక దేశాలు పాటించాయి.  అలా 2011 నాటికి అంతర్జాతీయ మహిళాదినోత్సవం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గే కేసు నమోదు


సుప్రీంకోర్టు లో కేంద్రపభుత్వం స్వలింగ సంపర్కం అనైతికం అని తరువాత తన వాదనను మార్చుకున్నప్పటికీ, దేశంలో నే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు లో గత డిసెంబరు నెలలో ఐ.పి.సి 377 సెక్షను కింద మొదటి కేసు నమోదు అయింది.    ఈ విషయం డిసెంబరు లో జరిగినప్పటికీ గే కమ్యూనిటి లోని సభ్యులు ఇటువంటి కేసులను ఎదుర్కొనడానికి తమ సభ్యులను చైతన్య పరిచేందుకు నిర్వహించిన సదస్సుల వలన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐ.పి.సి సెక్షను 377 స్వలింగ సంపర్కాన్ని నిరోధిస్తోంది.  ఐ.పి.సి సెక్షను 377 స్పష్టంగా స్వలింగ సంపర్కాన్ని నిరోధిస్తున్నా ఈ సెక్షను మీద కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి.  ఈ కేసులో ఓంగోలు పోలీసులు ముగ్గురిని డిసెంబరు 28  అరెస్టు చేసారు.  వీరిలో ఇద్దరు అసహజ లైంగిక చర్యకు పాలుపడుతుండగా మరొకరు గది బయట వేచియున్నాడుట.  జనవరి నెలలో ఇటువంటి దే మరో కేసు ఓంగోలులోనే నమోదు కావడం విశేషం.  ఐ.పి.సి. సెక్షను 377 కింద నిందితులకు 6 నెలల నుంచి 10 సంవత్సరములు జైలు శిక్ష పడే అవకాశం వుంది.  కాగా స్వలింగ సంపర్కం జరిగినట్లు డాక్టరు నిర్ధారిస్తే తప్ప పోలీసులు ఆరెస్టు చేయకూడదని గే కమ్యూనిటీ సభ్యులు తమ సభ్యులను జాగ్రుత పరుస్తున్నారుట.

Tuesday, March 6, 2012

టాలిపుడ్ నుంచి రానున్న తెలుగు ఛానల్ "చిత్రసీమ"

తెలుగు చిత్రపరిశ్రమ త్వరలో తన సొంత ఛానల్ "చిత్రసీమ" ను ప్రారంభిస్తోంది.  అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చేనెలలో "చిత్రసీమ" ప్రసారాలను మనంచూడవచ్చు.  "చిత్రసీమ" ఛానల్ యెక్క ప్రత్యేకత ఏమిటంటే ఇ ఛానల్ ఏ ఒక్కరికో చెందినది కాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమ యెక్క కోపరేటివ్ వెంచర్ గా పుండబోతోంది.  అంటే ఇది ప్రతిఒక్కరి ఛానల్. చిత్రపరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామే.  కోపరేటివ్ ఛానల్ అనేది ఒక  దేశంలోనే ఒక కొత్త ఐడియా, ఇంతవరకూ ఏచిత్ర పరిశ్రమ ఇటువంటి ఆలోచన చేయలేదు.  అమూల్ కోపరేటివ్ ఛానల్ యెక్క సక్సస్ ఈ ఛానల్ రూపకల్పనకు ప్రేరణ అని ఏ.పి ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ దగ్గుబాటి సురేష్ తెలియచేసారు.

ఓటర్లను ఆకట్టుకోలేకపోయాము - ఉత్తర్ ప్రదే్శ్ లో ఒటమిపై రాహుల్ వాఖ్య:

ఉత్తర ప్రదేశ్ లో ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు గా మరియు ఓటర్లను ఆకట్టుకో లేకపోయామని రాహుల్
వ్యాఖ్యానించాడు.   టి.వి. లలో ఉదయంనుంచి అనేక విశ్లేషణలు చూస్తున్నాము.  కాని సగటు మాగపుడు తన కేం కావాలో మరోసారి విస్పష్టంగా ప్రకటించాడు.  అదే అవినీతి రహిత పాలన.  జాతీయ పార్టీ అయిన కాంగ్రెసు అసమర్ధపాలన లో సామాన్యుడి పరిస్తితి నానాటికి దిగజారి పోతోంది.  2జి కుంభకోణం, కామన్వెల్త్ క్రీడ ల నిర్వహణ, ధరల అదుపులో వైఫల్యం, పాలనా యంత్రాంగం/అలయన్స్ మీద ప్రధానికి అదుపు లేకపోవడం,  సమర్ధమైన లోక్ పాల్ బిల్ తేలేకపోవడం, నానాటికి పెరుగుతున్న పెట్రోలు ధర మొదలైనవి ఎన్నో పున్నాయి.  ఇకనైనా వీటి పైన శ్రద్ధ చూపకపోతే 2014 లో జరగబోయే ఎన్నికల ఫలితాలు తరువాత కూడా రాహుల్ ఇదే వాఖ్యలు మరోమారు చేయవలిసి ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.

త్వరలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి

ఈ రోజు వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తు దేశంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం వుందని బిజెపి పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ ఎన్ డి టీ వి కిచ్చిన ఇంటర్వ్యూ లో  తెలియచేశారు.  ఉత్తరప్రదేశ్ లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచగల సమాజ్ వాది పార్టీ ఇక కాంగ్రెస్ మీద ఆధారపడనవసరం లేదు, పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బిల్లులకు మద్దతు ఇవ్వకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు.

రెండవ ఫైనల్ లో శ్రీలంక విజయం

ఆస్ట్రేలియా లో జరునుతున్న ముక్కోణపు సీరీస్ లో భాగంగా ఈ రోజు జరిగిన రెండవ ఫైనల్ మాచ్ లో శ్రీలంక ఆస్ట్రేలియ పై 8 వికెట్ల ఘనవిజయం సాధించి బెస్ట్ ఆఫ్ త్రీ ని సమం చేసింది. కాగా, మొదట పైనల్ లో ఆస్ట్రేలియా గెలుపొందింది.  అడిలైడ్ లో 8 వ తేదీన జరగబోయే మూడవ ఫైనల్ ఫలితాన్ని తేల్చనుంది.  ఆస్ట్రేలియా నించి డేవిడ్ వార్న్ ర్ మరియు మైఖేల్ క్లర్క్ సెంచిరీ లు సాధించగా శ్రీలంక నుంచి తిలక్ రత్నే సెంచరీ సాధించాడు.

Sunday, March 4, 2012

రోడ్ల మీదకు రానున్న చోదకరహత కార్లు

అతిత్వరలో చోదక రహిత కార్లు రోడ్ల మీద షికార్లు చేయనున్నాయి.  మానవ ప్రమేయం లేకుండా నే ఈ కార్లు ఎర్ర దీపముల వద్ద ఆగుతాయి, పాదచారులకు రోడ్డు దాటడానికి దారినిస్తాయి, తమ డ్రైవింగ్ లైన్ లో ప్రయాణం చేస్తాయి, ఇతర వాహనములకు దారినిస్తాయి మరియు తమంట తాముగా ఇతర వాహనములను అధిగమిస్తాయి.  తనంతట తానుగా చోదన చేయగల కార్లు ను తయారు చేయడం లో ముందంజలో గల ఈ కంపెనీ కి గతంలో ఎటువంటి కార్లు తయారు చేసిన అనుభవం లేదు. అదే గూగుల్.  ఈ కార్ల సృష్టి కర్త సెబాష్టియన్ త్రూన్.  ఇతను ౧8 సంవత్సరముల వయస్సులో తన స్నేహితుడును రోడ్డు ప్రమాదంలో కోల్సోయాడు.   అప్పటి నుండి తన జీవితాన్ని ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో ప్రాణం కోల్పోతున్న ఒక మిలియన్ ప్రజల కు అంకితం చేయాడానికి నిశ్చయించుకున్నాడు.  అతని ఆశయం చోదక రహిత కార్లు తయారు చేసేలా అతనిని ప్రేరేపించింది.  2004 వ సంవత్సరములో అమెరికా అత్యున్నత మిలిటరీ పరిశోధనా సంస్ధ DARPA నిర్వహించిన పోటీలో ఇతను తయారు చేసిన చోదక రహిత కారు 11 మెళ్లు ప్రయాణించి ప్రధమ స్ధానాన్ని పొందింది.  తదుపరి సంవత్సరంలో 7 గంటల్లో నే 212 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన లక్ష్యన్ని చేరుకుంది.  సరిగ్గా ఇటువంటి ఆలోచన వచ్చిన గూగల్ సంస్ధ సెబాస్టియన్ ని తమ కంపెనీ ముఖ్యాలయం మౌంటెన్ వ్యూ కి చోదక రహిత కార్ల ను అభివృద్ధి చేయడానికి ఆహ్వనించింది.     సెబాస్టియన్ మరియు DARPA లో పోటీ పడిన మరో ఇంజనీర్ క్రిస్ అర్మసన్ తో కూడిన గూగుల్ ఇంజనీర్ల సముదాయం యెక్క కృషి ఫలితంగా చోదక రహిత టయోటా ప్రియుస్ కార్లు శాన్ ఫ్రాన్సిస్కో మరియు మౌంటైన్ వ్యూ ప్రాంతాలలో ప్రయాణించాయి.  ఈ కార్లు ప్రతీరోజు ట్రాఫిక్ లో తమంతట తాము గా చోదకుల సహయం లేకుండా ఎటువంటి ప్రమాదాకి గురి కాకుండా ప్రయాణించ గాలిగాయి.    అయితే ఈ కార్లు మార్కెట్ లోకి రావడానిరి కొన్ని సంవత్సరాలు (దశాబ్దములు కాదు) పట్టే అవకాశం ఉందని గూగల్ సంస్ధ తెలియ చేస్తోంది.  అయితే భారతదేశంలో ఈ కార్లు షికారు చేయడానికి మాత్రం  దశబ్దాలు పట్టే అవకాశం ఉందిట. ఈ కార్ల వలన ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహంచాలి అనే న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. వీటిని పరిష్కరించవలసి ఉన్నది.

Saturday, March 3, 2012

మెదడు చురుకుగా పనిచేయడానికి పాలు త్రాగండి

మెదడు చురుకుగా పనిచేయడం లో పాలు కీలక పాత్ర పోషిస్తుంది అని మైన్ యూనివర్సిటీ పరిసోధకులు తెలియచేసారు.  వీరు 23 నుంచి 90 సంవత్సరముల వయసు గల 900 మంది స్త్రీ మరియు పురుషులకు వివిధ రకాల మెదడు సంబంధిత పరీక్షలు పెట్టి పరీక్షించి చూశారు.  వీరిలో రోజు పాలు త్రాగేవారు, అసలు పాలు త్రాగనివారు లేదా అసలు త్రాగనివారి కంటే ఎక్కువ మార్కులను పొందారు.  రోజూ పాలు త్రాగే వయస్కులు ఎక్కువ మార్కులు పొందారు.  పాలు రోజు త్రాగడం వలన శారీరక పెరుగుదలే కాక, మెదడు కూడా చురుకుగా పనిచేస్తుందని "ఇంట్ర్నేషనల్ డైరీ జర్నల్" లో ప్రచురించారు.

Friday, March 2, 2012

శ్రీలంక గెలుపు, భారత్ ఇంటికి

ఈ రోజు జరిగిన కీలక ఆస్ట్రేలియా - శ్రీలంక  క్రికెట్ మాచ్ లో శ్రీలంక 10 పరుగుల తేడా తో ఆస్ట్రేలియ పై గెలిచి ఫైనల్ లో అడుగు పెట్టింది.  హస్సీ పోరాటం వృధా అయ్యింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో వున్న భారత్ ఇంటి బాట పట్టింది.

Wednesday, February 29, 2012

వేలానికి రానున్న గోల్కొండ వజ్రం

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గోల్కొండ వజ్రాల గనుల  నుంచి వచ్చిన 'బ్యూ-శాన్సి' వజ్రం మే నెలలో జెనీవాలోని సోధ్బీ లో వేలానికి రానుంది.  1610 లో ఈ వజ్రాన్ని  ఫ్రెంచ్ చక్రవర్తి హెన్రీ-VI భార్య రాణీ మారీ డి మెడిసి పట్టాభిషేక సమయంలో కిరీటంలో అలంకరించుకుంది.  ఈ వజ్రం 34.98 కారెట్ల బరువు కలిగియుంది.  2 మిలియన్ డాలర్ల నుంచి 4 మిలియన్ డాలర్ల వరకు పలక వచ్చునని అంచనా.  16 వ శతాబ్ది మధ్యలో ఈ వజ్రాన్ని పొందిన లార్డ్ ఆఫ్ శాన్సీ నికోలస్ డి హర్లే  పేరు మీద నామకరణం చేయబడి వంశ పారంపర్యంగా ఫాన్స్, ఇంగ్లాండ్, పర్షియా మరియు నెదర్లాండు యెక్క ఆరెంజ్-నాసా దేశ రాజ వంశస్తుల చేతులు మారింది.  గోల్కొండ వజ్రాల గనులు నుంచి వచ్చిన వజ్రాలు పారదర్శకత, స్వచ్ఛత మరియు తెలుపు దనానికి పెట్టింది పేరు.  ఈ లక్షణాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అరుదుగా లభించే టైవు-2 వజ్రాలలో మాత్రమే ఉంటాయి. 
    గోల్కొండ నుంచి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మరికొన్ని వజ్రాలు కోహినూర్, రీజెంట్ మరియు హోప్.  కోహినూర్ వజ్రం 186 కారెట్ల బరుమ కలిగి ప్రస్తుతం బ్రిటీషు రాణి కిరీట సంపదలో వుంది. అతిపెద్ద గోల్కొండ వజ్రం రీజెంట్.  దీని బరువు 410 కారెట్లు.  ఇది ప్రస్తుతం పారీస్ లోని లారే మ్యూజియం లో వుంది.  మరొక వజ్రం హోప్, ఇది ౪0 కారెట్ల బరువు కలిగి ప్రస్తుతం వాషింగ్టన్ లోని స్మిత్సోనియన్ మ్యూజియం లో వుంది. 

సచిన్ కి ఇంకా ఆడాలని వుందా?

ఈ రోజు ఆసియ కప్ కి సెలక్షన్స్ జరుగనున్నాయి.  అయితే సచిన్ కి విశ్రాంతిని ఇస్తారా? లేదా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది.  25 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్ లో సచిన్ అందుకోని మైలు రాయి లేదు.  ప్రపంచ కప్ ని కూడా ఆశ్వాదించాడు.  ఇంకా సచిన్ ఏం కోరుకుంటున్నాడు.  ఏం ఆశించి ఇంకా అన్ని ఫార్మాట్ల లో ను ఆడాలనుకుంటున్నాడు.  100 సెంచరీల కోసమైతే టెస్టు లలో కొనసాగవచ్చు. తన కోరిక నెరవేర్చుకోవచ్చు.  దేశం లో అనేక మంది యువ  క్రికెటర్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.  సెలక్షన్ కమిటీ సాగనంపే వరకు వేచి చూడడం సచిన్ లాంటి వ్యక్తికి ఇచ్చే గౌరవం కాదు. సచిన్ తనకు తానుగా నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమయింది అనిపిస్తోంది. కాదంటారా?

Tuesday, February 28, 2012

మహిళా డ్రైవర్లు జర భద్రం

హైదరాబాదు నగర పోలీసు లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా మహిళా డ్రైవర్లను కూడా శోధించ నున్నారు. ఇందు కోసం మహిళా ఎస్సై ల సేవలను వినియోగించు కోనున్నారు.   వీకెండ్ మహిళా పార్టీల కు వెళ్లేవారు మరియు మహిళా రాత్రులయిన బుధ, గురు మరియు శుక్ర వారము లలో కూడా  శోధన చేయడానికి ఎర్పాట్లు చేశారు.  గత వారం 40 మంది మహిళలను శోధించగా ఒక కేశు కూడా నమోదు అయిందిట.  కాగా హైదరాబాదు ట్రాఫిక్ విభాగాము యొక్క చర్య ను మహిళలు స్వాగతిస్తున్నారు.  ఎదో ఒకటి రెండు రోజులు కు పరిమితం కాకుండా శోథన దీర్ఝకాలం కొనసాగించాలని కోరుకుటున్నారు.  సో.. మహిళలు బహుపరాక్.

Sunday, February 26, 2012

లవ్ హార్మొన్

మీ సంబంధం ఎంత కాలం నిలుస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ రక్తం లో 'ఆక్సిటోన్' లెవెల్ ఎంత వుందో తెలుసుకో మంటున్నారు శాస్త్రవేత్తలు.  ఇజ్రాయెల్ లోని బార్-ఇలాన్ యూనివర్సిటీ వారి పరిశోధన లో ఎక్కువ స్థాయి లో 'ఆక్సిటోన్' కలిగిన జంటలు తక్కువ స్థాయిలో 'ఆక్శిటోన్' కలిగిన జంటలు కన్న ఎక్కువ రోజులు కలసి ఉంటున్నారుట.  వీరి పరిశోధన కోసం కొత్తగా జీవితం ప్రారంభించిన వారిని ఎంపిక చేసుకున్నారు.  ఆరు మాసముల వ్యవధి తరువాత, ఎక్కువ స్థాయి లో 'ఆక్సిటోన్' కలిగిన జంటలు వారి సంబంధాన్ని ఇంకా కొనసగిస్తున్నారు లేదా కొనసాగించడానికి ఆసక్తిని కనవరిచారు కాగా తక్కువ స్థాయి లో 'ఆక్సిటోన్' కలిగిన జంటలు విడిపోవడం జరిగిందిట.  ఈ ఆక్సిటోన్ హార్మోన్ తల్లి శిశువుల బంధం లో కూడా కీలక పాత్ర వహిస్తుందిట.  ఇంతకు ముందు జరిగిన పరిసోధన లో నాశికా రంధ్రాల వద్ద ఆక్సిటోన్ పిచికారి వలన జంటల మధ్య ఆకర్షణ పెరిగినట్లుగా నిర్ధారణ జరిగింది.

Saturday, February 25, 2012

రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమణ లో 36 కాదు 60 ఎకరాల ప్రభుత్వ భూమి

రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమణలో 60 ఎకరములు ప్రభుత్వ భూమి ఉన్నట్లు గా రంగారెడ్డి జిల్లా జేసి ఎలక్ట్రానిక్ టోటల్ సర్వే ఆధారంగా నిర్ధారించారు. కాగా ఈ రోజు ఈనాడు దినపత్రికలో రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రభుత్వ భూములు ఏవి లేవని వార్త వచింది.

ప్రపంచ శాంతి

When there is righteousness in the heart
There is beauty in the character
When there is beauty in the Character
There is harmony in the home
When there is harmony in the home
There is order in the Nation
When there is Order in the Nation
There is peace in the World.

Friday, February 24, 2012

భారత దేశ అమ్ముల పొదిలో మరొక అస్త్రం

అగ్ని క్షిపణి - V ప్రయోగానికి సిద్ధం. మార్చి/ఎప్రిల్ నెల లో ఓరిస్సా నుంచి పరీక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  5000 వేల కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి చైనా మరియు రష్యా లొ కొంత భాగము లోని లక్ష్యాలను కూడా చేదించగలదు.  ఇప్పటి వరకు ఇటువంటి సామర్ధ్యం us,uk, france, Russia మరియు chaina లకు మాత్రమే వుంది.  కాని మనం చైనా కు చాలా దూరం లో ఉన్నాము.  china ఇప్పటికే 11200 కి.మీ. లక్ష్యాలను చేదించగల సామర్ధ్యాన్ని కలిగిన క్షిపణులను కలిగి ఉంది.  భారత్ కూడా త్వరలొ నే ఇటు వంటి పరిజ్నానాన్ని సొంతం చేసుకుంటుందని ఆశిద్దాం.

Thursday, February 23, 2012

భగత్ సింగ్ బొమ్మ తో 5 రూపాయల నాణెం విడుదల

భగత్ సింగ్ బొమ్మ తో 5 రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు గా రిజర్వు బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది.  ఇనుము మరియు క్రోమియం ల మిశ్రమము లతో తయారు చేయబడే నాణెము నకు ఒక వైపు భగత్ సింగ్ బొమ్మ మరియు షాహిద్ భగత్ సింగ్ జన్మ శతాబ్ది 1997-2007  అను అక్షరములు పొందుపొరచ బడి వుంటాయి.  మరొక వైపు నాలుగు సింహాల ముద్ర 5 అనే అంకె ముద్రించబడి వుంటాయి.