Wednesday, March 28, 2012

టీ కాలు ఇన్ జెక్ష్ న్ రూపంలో నే ఎందుకు వుంటాయి?

టీ కాలు ఇన్ జెక్ష్ న్ రూపంలో నే ఎందుకు వుంటాయి? టాబ్లెట్ లేదా కాప్సూల్ రూపంలో ఎందుకు ఉండవు? అని మా అమ్మాయి మొన్న టీ కా కోసం హాస్పిటల్ కు వెల్లినప్పుడు అడిగింది.  నిజమే కదా, అనిపించింది.  కారణం చెప్పలేకపోయాను.  మీ కేమైనా తెలుసా?

2 comments:

  1. భలే అడిగిందండీ మీ పాప. టీకాలు వైరస్ లను చంపడం ద్వారా కానీ ( Killed Vaccine ), వైరస్ లకు ఉన్న రోగ కారక శక్తిని తగ్గించడం వలన( live attenuated vaccine ) గానీ తయారు చేస్తారు. మన శరీరం లోకి వేసే ప్రతి టీకా వైరస్ తో తయారు చేయబడినదే...!!!( కొన్ని ఇతర రకాలు ఉన్నాయి కానీ అవి అప్రస్థుతం ). మాత్రలు తయారు చేయు ప్రక్రియలో Wet granulation ,dry granulation , granule lubrication , tablet pressing operation అని రక రకాల ప్రక్రియలు ఉంటాయి. ఈ ప్రక్రియలలో వాడే రసాయనాలు వైరస్ ని ప్రభావితం చేసి నిరుపయోగం చేస్తాయి. అందుకే టీకాలు మాత్ర రూపంలో తయారు చేయరు. మరొక కారణం కూడా ఉందండోయ్...!!! మాత్ర రూపంలో తయారు చేస్తే తప్పనిసరిగా నోటి ద్వారానే తీసుకోవలసి ఉంటుంది. అయితే అన్ని వైరస్ లకి మన ఉదరకోశం ( Gastro intestinal tract ) లో పునరుత్పత్తి అయ్యే సామర్ధ్యం ఉండదు. [ఒక్క పోలియో వైరస్ కి మాత్రమే ( మనం తీసుకునే టీకాలలో) ఉంది. అందుకే అది నోటిలో వేస్తారు]. అదే టీకా రూపం లో ఉంటే నేరుగా కండకి లేక, చర్మం కింద కానీ చేయవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ రెండు కారణాలు మాత్రమే ఉన్నాయండి.

    ReplyDelete
  2. సవివర సమాచారమునకు మీకు క్రుతజ్నతలు

    ReplyDelete