Wednesday, September 17, 2014

మైక్రో మాక్స్ డివైస్ ల పై ఉచిత ఇంటర్నెట్


Monday, September 15, 2014

కాశ్మీరు వరద బాధితులకు బి యస్ యన్ యల్ ఉద్యోగుల వితరణ

కనీ విని ఎరుగని రీతిలో ప్రకృతి ప్రకోపానికి గురైన కాశ్మీరు వరద బాధితులకు బి యస్ యన్ యల్ ఉద్యోగులు తమ వంతు సహయంగా ఒక రోజు జీతాన్ని (మూలవేతనం) వితరణ గా ప్రకటించాలని బియస్ యన్ యల్ ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి.

"శర్మగారి బ్లాగు లో చోరి" - టపా లోని విషయం గూర్చి

"శర్మగారి బ్లాగు లో చోరి" టపా చదివిన తరువాత, నా బ్లాగులో "శర్మగారు ఇక బ్లాగులు రాయను" అని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించడానికి తోటి బ్లాగర్లు చేస్తున్న ప్రయత్నాలు చూసి నా వంతు కర్తవ్యంగా ఆయన్ని శాంతిప జేయాలనే సదుద్దేశంతో నేను ఈ నెల 10 వ తేదీన వ్రాసిన టపా ( ఇక్కడ నొక్కండి) ఆయనను శాంతింప చేయక పోగా మరింత ఆగ్రహం కలిగించింది అని భావించి ఆ టపా యిెక్క ఉద్దేశ్యము తెలుపుతూ వివరణ (వాదన కాదు).

నా మొదటి పేరాలో నే మిమ్మల్ని శాంతింప చేయడమే నా ప్రయత్నము అని స్పష్ఠంగా చెప్పాను.  మీకు సుద్దులు చెప్పాలనే సంకల్సము నాకు ఎ కోశానా లేదు మరియు అంతటి అనుభవము లేదు. 

సమాచారం తీసుకున్నవారు ఆ విష యాన్ని వ్యక్తపరచడం సభ్యత అని వ్రాశాను.   వ్యక్త పరచలేదంటే సభ్యత సంస్కారములు లేని వారనే గా అర్ధం .  అది తప్పు అని కూడా తెలుస్తోంది.  కాని ఎదుటి వాడిని దూషించడం సభ్యత కాదనిపించి సూటిగా వ్రాయలేదు.  

నా బ్లాగులో చిల్లి ముంత కూడా లేదు ఎత్తుకు పోవడానికి అని పరిహసమాడారు మీరే.  దీని బట్టి మీ బ్లాగులో మంచి విషయం ఉందనే కదా అర్దం.  అందుకు మీరు గర్వపడాలి కదా.  నేను వ్రాసినది కూడా అదే కదా.  ఆఖరుకు ఎమీ లేని నా బ్లాగులోని కంటెంట్ కూడా అపహరణకు గురైంది.  తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ఒక ఛానెల్ రానుంది అనే సమాచారం.  ఆ కంటెంట్ ని వెబ్సైట్ (బ్లాగు కాదు) లో యధాతధంగా (కాపి పేస్టు) ఉంచారు.    

ఇక నా బ్లాగు విషయానికొస్తే నేను రచయితను కాను.  మంచి విషయాలు తెలుసుకోవడానికి బ్లాగులు చదుపు తుంటాను నాకు తెలిసిన కొత్త విషయాలు అందరితో పంచుకుందామనే ఉద్దేశ్యంతో నాకు చేతనైనంత వీలైనప్పడు రాస్తున్నాను. అప్పుడప్పుడు నా ఆక్రోశం వెళ్ల గక్కడానికి కూడా రాస్తుంటాను.  బ్లాగింగు నా ప్రొఫెషను కాదు, హబీ మాత్రమే.  

తప్పు ఎప్పుడూ తప్పే అందులో సందేహం లేదు.  తప్ప చేసినవాడి కి ఎప్పుడూ అపరాధభావం ఉంటుంది.  ధైర్యంగా ముందుకు రాలేడు.   చౌర్యం అనేది తప్పే. అందులో రెండవ వాదన లేదు. తప్పచేసినవాడిని ఎవరూ అభినందించరు.  వాడి ఎదుట ఎమీ చేయలేక పోయినా మనస్సులో మాత్రం వ్యతిరేకత ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.  నా పోస్టులో  నేను తప్పు చేసిన వాడిని సమర్ధించ లేదు.  చౌర్యం అనేది సహజం అని వ్యక్తపరిచాను (సిని పరిశ్రమ చౌర్యాన్ని గురించి ప్రస్తావించి) మిమ్మల్ని పాసిఫై చేయాలనే ఉద్దేశ్యంతో.  ఫలానా బ్లాగరు కాపీ చేస్తాడు అని తెలిస్తే ఎవరు ఆ బ్లాగును చూడడానికి కూడా ఇష్టపడరు.  మీరు ఆ బ్లాగుల వివరాలు ఆధారాలతో సహ  ఈ రోజు ప్రకటించి మంచి పని చేశారు.  మచ్చుకు ఒకటి చూశాను.  దిగ్ర్బాంతి చెందాను అనడంలో సందేహ లేదు.  ఇప్పటి వరకు స్పూర్తిగా తీసుకున్నాం అంటుంటారు కదా అలా నేమో అనుకున్నాను.  మక్కి కి మక్కి అంటే మనసెలా ఒప్పిందో మరి.  

కోడి కుంపటి కధ ద్వారా నన్ను నేనే విమర్శించున్నాను అన్నారు.  ముందే చెప్పాను నేను మిమ్మల్ని శాంతింప చేయడాని కి వ్రాస్తు మిమ్మల్ని విమర్శించే సాహసం ఎందుకు చేస్తాను.  మీ కధ లో ని భావం (Time & Tide waits for None) నచ్చి ఉదహరించాను.  

నాలక్ష్యం ఆ పోస్టు మొదటి పేరాలో సుస్పష్టంగా రాసినప్పటికీ,  మీరు ఇంతగా అపార్ధం చేసుకున్నారు అంటే నేను నా భావాలను వ్యక్త పరచటంలో ఫెయిలయ్యాననిపిస్తోంది. చెప్పాను కదా నేను రచయితని కానని  నా వివరణ చూసిన తరువాత కూడా మీరు అదే ఉద్దేశ్యంతో ఉంటే మనః స్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను.

Sunday, September 14, 2014

బ్లాగుల్లో పోస్టు లకి కామెంట్లు ఎందుకు రావట్లేదు ?



మొన్న బ్లాగిల్లు వారి బ్లాగులో కామెంట్లు చేయండి బ్లాగులను బతికించండి అని ఒక పోస్టు చూశాను. అది చదివిన తరువాత నా మదిలో మెదిలిన విషయాలు మీ తో పంచుకుందామని ఈ పోస్టు.  కామెంట్లు (మంచి వి మరియు అర్ధవంతమైనవి) బ్లాగు రాసేవారికి టానిక్ లాంటివి.  అవి ఎంతో ప్రేరణ నిస్తాయనడంలో ఎటు వంటి సందేహం లేదు.  అదే సమయంలో అవాంఛిత కామెంట్లు మనస్సు నొప్పిస్తాయి.  కాని కామెంటు, కామెంటు చేసే వారి వ్యక్తిక్త్వాన్ని బయడ పెటుతుంది.  పిచ్చి కామెంటు చేస్తే అది బ్లాగు రాసే వారి మనస్సునొప్పించినా చూసే వారికి మాత్రం ఖచ్చితంగా కామెంటు చేసిన వారి తెంపరితనం లేక వారి కుత్సిత స్వభావామే కనబడుతుంది, కాబట్టి బ్లాగు రాసేవారు అటు వంటి కామెంట్లను పెద్దగ పట్టించుకోనవసరం లేదు అని నా భావన.   సరే ఇక కామెంట్ల విషయానికొస్తే, కామెంట్లు చేయకపోవడానికి నాకు ఈ క్రింది కారణాలు కనిపిస్తున్నాయి.


  1. సమయా భావం .  చాలా మంది చదువరులు తమకున్న తక్కువ సమయంలో కొన్ని ముఖ్యము లేక ఆసక్తి కలిగిన బ్లాగులు ఎంచుకుని చదువు తుంటారు.  అంతే గాక కొన్ని బ్లాగులలో సమాచారం/విషయం చాలా పెద్దదిగా ఉంటే బ్లాగు కూడా పూర్తి గా చదువరు.  అటువంటి వారు కామెంట్లు చేయురు.
  2. కొన్ని బ్లాగులలో ని విషయం కామెంటు చేసేలా ఉండక పోవడం .  ఉదాహరణకు, Good English, Punch pataka బ్లాగులలో కామెంట్ల అవసరం ఉండదు.
  3. బ్లాగులలో విషయం  ఒక వర్గం, ప్రాంతం, కులం, మతం లేదా జాతి వారికి వ్యతిరేకంగా లేదా  అనుకూలంగా ఉండటం .
  4. బ్లాగులోని సమాచారం సమస్యాత్మకమయితే (సైబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఉంటే) కామెంట్ చేయడానికి వెనుకాడతారు.
  5. భాషాపరమయిన సమస్య - కామెంటు తెలుగులో చేద్దామని పిస్తుంది, కాని మనం చూసే పి.సి లో తెలుగు సాఫ్ట్ వేర్ అందుబాటులో లేక పోవడం.
  6. తెలుగు సాఫ్ట్ వేర్ ఉన్నా తెలుగులో టైపు చేయడం కష్టమనిపించడం .
  7. కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వ వలసి రావడం .
  8. అజ్ఞాత గా కామెంట్ చేసే అవకాశం లేకపోవడం .
  9. మన కామెంటుకి విలువ ఉండదని భావించినపుడు.
  10. మన కామెంటు మోడరేషన్ కి గురి అవుతుందని భావించినపుడు.
  11. మన కామెంటు వాస్తవమయినప్పటికీ అది ఎదుటివారిని బాధిస్తుందని భావించినపుడు.
  12. కొన్ని బ్లాగులలో మొత్తానికి కామెంట్లు డిసేబుల్ చేసి ఉండడం .

స్ధూలంగా నాకు కనిపించిన కొన్ని కారణాలు.  ఇంకా చాలానే ఉండి ఉండవచ్చు.  అయితే ఎతా వాతా చెప్పోచ్చేది ఎమిటంటే కామెంట్ చేసే వారు బ్లాగు రాసే వారు ఇద్దరూ కూడా పరస్పర గౌరవాలకు భంగం వాటిల్ల కుండా చూసుకుంటే కామెంట్లు పెరుగుతాయి.  బ్లాగులు కూడా మూడు పోస్టులు ఆరు కామెంట్లగా వర్ధిల్లుతాయి.

Friday, September 12, 2014

హమ్మయ్య మా ఊరి పేరు చెప్పుకునే అవకాశం వచ్చింది

హమ్మయ్య మా ఊరి పేరు చెప్పుకునే అవకాశం వచ్చింది.  మాది ఏలూరు, నాకు చిన్నప్పటి నుంచి ఒక అసంతృప్తి ఉండేది.  అదేమిటి అంటే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైనప్పటికిని మా ఊరి పేరు పెద్దగా వార్తలలో కనిపించేది కాదు.  కనీసం న్యూస్  పేపరులో వాతావరణం కాలమ్ లోనైనా కనిపించేది కాదు.  ఎందుకో ఏలూరు లో ఉష్ణోగ్రత ఏ పేపరులో నూ కనిపించదు.  చాళుక్యులు ఏలూరు కు దగ్గరలోని పెదవేగి ని రాజధాని గా చేసుకుని పరిపాలించారు అని చరిత్ర చెబుతోంది.  ఏలూరు లో సి ఆర్ ఆర్ కళాశాలలో నే మన సూపర్ స్టార్ కృష్ణ చదువు కున్నాడు.  ఏలూరు ను ఆనుకుని ఉన్న చేటపర్రు గ్రామంనుంచి సిల్క్ స్మిత మరియు మురళీ మెాహన్ వంటి వారు సిని రంగంలో ఒక వెలుగు వెలిగారు.  ఏలూరు కు 40 కి మీ దూరంలో నున్న ద్వారాకా తిరుమల చిన్న తరుపతి గా ప్రఖ్యాతి చెందింది.  ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  మరిన్ని నా తదుపరి టపాలలో పొందు పరుస్తాను.  ఇంతకీ విషయమేమిటి అంటే ఏలూరు లో పుట్టిన ఒక యువకుడు సిని కధానాయకుడు గా ఎదిగాడు. ఈ వార్త విన్న నాటినుంచి భలే సంతోషంగా ఉంది.  ఆ సంతోషాన్ని మీతో పంచుకో వాలనే  ఈ  చిరు ప్రయత్నం . ఇంతకీ ఎవరా కధానాయుకుడు అనుకుంటున్నారా?  ఊహలు గుస గుస లాడే ఫేమ్ నాగ శౌర్య .  అతనికి మరిన్ని అవకాశాలొచ్చి మంచి కధానాయకుడుగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ .....




శ్రీనగర్ లో పది రోజుల పాటు ఉచిత (లోకల్ & యస్ టి డి) కాల్స్

జమ్ము & కాశ్మీర్  వరదలలో చిక్కుకున్న  బి యస్ యన్ ఎల్ వినియోగ దారులకు తన వంతు సహయంగా బి యస్ యన్ ఎల్ శ్రీనగర్ వాసులకు పది రోజుల పాటు ఉచిత కాల్స్ (లోకల్ & యస్ టి డి) మరియు ఎస్ ఎమ్ ఎస్ ల ను అందిస్తోంది.  

మరింత సమాచారం కోసం క్రింది లింక్ ను నొక్కండి.

ఇక్కడ నొక్కండి

ఏది స్వదేశీ ఏది విదేశీ ?


ఈ మధ్య సోషల్ నెట్ వర్క్ లలో ఒక విషయం చాలా ప్రచారం జరుగుతోంది.  అది ఎమిటంటే స్వదేశీ వస్తువు లే కొనండి, దాని వలన మూడు మాసాలలో మన రూపాయి విలువ డాలర్ ను మించి పోతుంది అని.  నిజంగా అలా జరిగే అవకాశం  వుందా?  దాని వెనుక ఉన్న లాజిక్ ఎమిటి?  పెట్రోలియం ఉత్పత్తులు కొనడం తగ్గించండి అంటే అర్ధం ఉంది.  ఎందుకంటే మనం పెట్రోలియం ఉత్పత్తులకై ఎక్కువగా దిగుమతుల మీద ఆధార పడి ఉన్నాము.  దిగుమతులు ఎక్కువైతే అంతర్జాతీయ ద్రవ్యనిది నిలవలు తగ్గపోతాయి  ప్రభుత్వం మీద సబ్సిడీ భారం పెరిగిపోతుంది.  విదేశీ వస్తువులు అంటున్నాం కాని మనం కొనేవన్నీ (చాలా మటుకు) విదేశీ కంపెనీల చేత మనదేశంలో తయారయినవే.   మనదేశంలో తయారు చేస్తున్నారు కాబట్టి ఆ యా ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.  అంతే కాక మన ప్రభుత్వానికి పన్నులు మరియ లైసెన్సు ఫీజులు కూడా చెల్లిస్తున్నారు.  మరి మనం ఎరకంగా నష్టపోతున్నాము.  దీని వలన మన ప్రాంతీయ వస్తువుల ప్రాభావన్ని కోల్పోతున్నాం .  మరియు ఆ యా కళలమీద ఆధార పడి బతికే వారు తమ బతుకు తెరవు కోల్పో తున్నారు.  ఉదాహరణకు చేనేత, హస్తకళలు మొదలైనవి.  కానీ డాలర్ విలువను మించిపోయేంతగా ఎం జరుగుతుందో తెలియట్లేదు.  మీకే మైన తెలిస్తే కాస్త చెబుదురు.    ఎదేమైనా స్వదేశీ అభిమాన పరంగా చూస్తే ఆది ఖచ్చితంగా ఆచరణీయమే.  మరిక మొదలు పెట్టండి స్వదేశీ వస్తువులు వాడకం.  స్వదేశీ వస్తువు లేవి విదేశీ వస్తువు లేవో తెలియడం లేదు కదా.  అందుకే స్వదేశీ విదేశీ వస్తువుల జాబితాను క్రింద ఇచ్చాను.  ఈ జాబితా  నాకు ఒక మీటింగ్ లో దొరికింది,  ఇతర వివరములు తెలియరాలేదు.  




Thursday, September 11, 2014

భళా బి యస్ యన్ ఎల్ ..

పకృతి విపత్తు బారిన పడిన కాశ్మీర్ కు బాసట గా నిలిచింది బి యస్ యన్ ఎల్.  టెలికామ్ సర్వీసులను మొదటిగా పునరుద్ధరించి వరద బాధితులకు తన వంతు సహయం చేసింది.  అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.  పూర్తి సమచారం కోసం క్రింది లింక్ ని నొక్కండి.

కాశ్మీర్ లో మొదటగా బి యస్ యన్ ఎల్ సర్వీసులు పునరుద్ధరణ.

తెర వెనుక ......



సుమారు గత మూడు మాసములుగా  టివి9 మరియు ఆంధ్రాజ్యోతి ఛానెల్ ల ప్రసారాలు తెలంగాణా రాష్ట్రంలో ఎంఎస్ వో లు  నిలుపుదల చేశారు మాకేం తెలీదు అంటూ వచ్చారు.  కాని దానివెనుక ఉన్నదెవరో నిన్న కెసిఆర్ కామెంట్ తర్వాత సుస్పష్ఠంగా ప్రపంచానికి తెలిసింది.   కెసిఅర్ ఇంకా విజయం పొందిన కిక్ లోనే ఉన్నట్లున్నారు.  అందుకే ఆయన కాళ్లు భూమి మీద నిలవడం లేదు.  కాని కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదన్నది జగమెరిగిన సత్యం .  ఒడలు బళ్లు కావడం కూడా మనకెరుకే.  టివి9 మరియు ఆంధ్రజ్యోతి వారు క్షమాపణలు చెప్పిన తరువాత కూడా స్పందించడం లేదంటే తెగేవరకూ లాగుతున్నారనిపిస్తోంది.

దానిని పక్కన బెడితే, మన దేశం ఒక అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకుంటున్నాం . అయితే  మరి ఇంత నియంతలా ప్రవర్తిస్తున్న  అది కెసిఆర్ కావచ్చు లేక ఎం ఎస్ ఒో లు కావచ్చు, వారిని అదుపు చేసే యంత్రాంగమేమీ లేదా లేక ఉన్నా చేతులు ముడుచుకుని కూర్చున్నారా అన్న సందేహం కలుగుతోంది.  ఎందుకంటే మాకు నచ్చిన ఛానెల్స్ మాత్రమే ప్రసారం చేస్తాం అంటే ఇంకా ప్రజాస్వామ్యమెక్కడ?  మనకి వ్యతిరేకంగా మాట్లడితే అంతే గతి అంటే ఎలా?  అంటే మన ప్రజాస్వామ్యం ఒటి కుండేనా?  

అది అలా ఉంటే జర్నలిష్టులు పోరాటం చేస్తుంటే మిగిలిన ఛానెల్స్ ఎందుకు మౌనం దాల్చుతున్నారో అర్దం కావడం లేదు.  జాతీయ మీడియా కూడా స్పందించి  ఈ వార్తలకు కవరేజి ఇస్తుంటే మన ప్రాంతీయ ఛానెల్స్ మాత్రం చోద్యం చూస్తున్నాయి.  ఈ రోజు మీకేమి ఇబ్బంది లేక పోవచ్చు కాని ఇలాంటి నాయకులతో రేపు మీకు కూడా ఇదే సత్కారం అని మర్చిపోతున్నారు.  వీరి మధ్య ఎప్పటిలాగా సామాన్య మానవుడే నష్ట పోతున్నాడు.  ఛానెల్స్ చెప్పేదే వినాలి ఎం ఎస్ వో లు చూపించిన ఛానెల్స్ మాతృమే చూడాలి.  హే భగవాన్  ఎందుకీ దుస్తితి.



Wednesday, September 10, 2014

శర్మగారి కాలక్షేపం కబుర్లు

ముందుగా శర్మగారి కి నమస్కారములు.  నాకు శర్మగారు పరిచయం లేనప్పటికీ నేను కూడా బ్లాగులను చదువు తుంటాను కాబట్టి ఆయన బ్లాగు ద్వారా పరిచయమే.  ప్రస్తుతం  తెలుగు బ్లాగుల ప్రపంచంలో వేడి వేడి చర్చా విషయం శర్మగారు ఇక బ్లాగులు రాయను అని భీష్మించుకుని కూర్చోడమే అని అర్ధం అవుతోంది.  బ్లాగు మితృలందరూ శర్మగారి ని శాంతింప చేసి వారి బ్లాగు ద్వారా మరింత రచనామృతాన్ని గ్రోలడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.  ఇందులో నా వంతు కృషి గా బ్లాగు ముఖంగా శర్మగారికి విన్నపాలు.

శర్మగారి బ్లాగు లో శీర్షికలో శర్మ కాలక్షేపం కబుర్లు - (టాగ్ లైన్) అని విధిగా ఉంటుంది.  అది సత్యం .  రాసే వాళ్లు కొద్ధి మందే అయినా చదువరులు అనేక మంది.  అందులో సింహభాగం కాలక్షేపం కోసం బ్లాగలు వీక్షిస్తుంటారు లేక చదువు తుంటారు.  అలాగే బ్లాగులు ఒక వ్యాపకంగా రాసేవారున్నారు మరియు తమ దుగ్ధని తీర్చుకోడానికి రాసే వారున్నారు. తెలుగు బ్లాగును  వ్యాపార లేక వాణిజ్య పరంగా నిర్వాహించేవారు చాలా తక్కువ.  ఇక చౌర్యం విషయానికొస్తే చౌర్యం అనేది ఇప్పటి విషయం కాదు, బహుశా మనిషి పుట్టుకతోనే ఇది కూడా మొదలయి ఉంటుందని నా భావన.  కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలు చౌర్యనికి గురై నిర్మాతలు ఎంత నష్టపోతున్నారో అందరికి తెలుసు.   కాబట్టి చౌర్యనికి గురవుతోందని మీరు బ్లాగు రాయడం మానేస్తే మాత్రం మీ అభిమానులే కాదు చాలా మంది చాలా మంచి విషయాలను లేదా చాలా ఆనందాన్ని మిస్పవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.  ముఖ్యంగా మీరు బ్లాగును వ్యాపార దృష్టి తో రాయనపుడు మీరు అంతగా బాధ పడనవసరం లేదు.  ఇక పేరు ప్రఖ్యాతలంటారా అవి ఇప్పటికే మీవశం .   అంతేగాక మీలాంటి పరిణితి చెందిన వారు ప్రఖ్యాతలకు పాకులాడే స్ధితి నుంచి దాటిపోయుంటారు అనుకుంటున్నాను.  మీ బ్లాగు లోని సమాచారానాన్ని తీసుకుంటున్నారు అంటే మీరు చాలా గర్వపడల్సిన విషయం.  ఇంకో విషయం చౌర్యం అనడం కంటే సమాచారాన్ని పంచుకుంటున్నారు అంటే సబబే మో అనిపిస్తోంది ఎందుకంటే అసలు అంతర్జాల భావనే సమాచార మార్పిడి.  ఇక మీబ్లాగు నుండి సమాచారాన్ని తీసుకున్నవారు ఆ విషయాన్ని వ్యక్త పరచడం వారి సంస్కారం.  మీ బ్లాగు నుండి సమాచారాన్ని మరికొంతమందికి పంచుతున్నారు అంటే మీ అక్షరాలు మరో కొంత మందికి ఉపయోగ పడతాయే కాని వృధా కాదు.   సూటిగా సుత్తి లేకుండా (ఇంత రాసినతరువాత కూడా - టూ మచ్ కదా) చెప్పాలంటే మీరు కాలక్షేపం కోసం రాస్తున్నారు మేము కాలక్షేపం కోసం చదువు తున్నాము కాబట్టి మీరు కంటిన్యూ చేస్తే ధన్యులం లేదా మీరు చెప్పినట్లు ముసలమ్మ కోడి నిప్పు లాగా కాలం దేనికోసం అగదు. ఇది స్వస్ధి.

Sunday, September 7, 2014

ప్రపంచ క్షమాగుణ దినోత్సవం

నేడు ప్రపంచ క్షమాగుణ దినోత్సవం. ఒక రోజును ప్రపంచ క్షమాగుణ దినోత్సవం గా ప్రకటించారు అంటేనే క్షమాగుణాని కున్న ప్రాధాన్యం ఎమిటో తెలుస్తోంది.  ఒక మనిషికి ఉండవలసిని మంచి లక్షణాలలో క్షమాగుణం ఒకటి.  నిజంగా ఈ గుణం వలన లబ్ది పొందేది క్షమించేగుణం కలవారే.  క్షమాగుణం కలవారు చాలా ప్రశాంత జీవితాన్ని గడుపుతారనడం లో ఎటువంటి సందేహం లేదు.   

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో నేను గొప్పవాడిని నేను చేసిందే కరెక్ట్ అనే అహంకార పూరిత ధోరణి ఎక్కువైపోంతోంది.  దీనివలన ఎ చిన్న తప్పును కూడా తట్టుకోలేక  చీటికి మాటికి కోపం ప్రదర్శిస్తుంటారు.  తద్వారా మానశిక అశాంతికి గురవుతుంటారు.   సహజంగా ఎదుటి వారి తప్పుల వలన లేక వాళ్ల వలన మనకు కలిగిన అసౌకర్యం వలన మనకు కోపం వస్తుంది  వెంటనే అది ప్రదర్శిస్తాము.  దీనిలో మన ఉద్దేశ్యము ఎదుటి వాడిని శిక్షించాలని కాని కోపం అనేది భస్మాసుర హస్తం లాంటిది.  అది కోపం తెచ్చుకున్న వాళ్లనే దహించి వేస్తుంది.  దీనికి విరుగుడే క్షమాగుణం .  మనకి క్షమించ గలిగే మనస్సుంటే ఆ పరిస్తితిలో జరిగే నష్టం సగం తగ్గిపోతుంది.   లేదంటే మనం కోపం ప్రదర్శిస్తే ఎదుటి వాడు వూరుకోడు కదా వెంటనే వాదన మొదలవు తుంది అది ఎంత వరకు వెళుతుందంటే మొన్ననే ఒక సంఘటన చూశాం .  ఒక పాఠశాలలో చదుపుకునే ఇద్దరు విద్యార్ధుల మద్య తలెత్తిన వివాదం వారిద్దరి జీవితాలను కాలరాసింది.  ఒకరు మరణిస్తే మరొకరు ఆ మరణానికి కారకుడై చెరసాల పాలై తన జీవితానికి చరమగీతం పాడుకున్నాడు. 

ఉపసంహరంః  క్షమించమన్నారు గా అని నీతి మాలిన దారుణాలకు, అకృత్యాలకు పాల్పడిన వారిని క్షమించి వదిలేయమని కాదు.

Saturday, September 6, 2014

ఎలా? ఎలా? ఎలా? కవి కావడమెలా?

తనికెళ్ల భరణి గారు ఒక ఛానెల్ ముఖా ముఖి కార్యక్రమంలో తెలుగు భాష ను గురించి చెబుతూ, పద్యము అనేది తెలుగు భాష సొంతం మరే భాష లోను లేనిది అని అన్నారు.   అది విన్న తరువాత  చాలా ఆనందం కలిగింది నేను కూడా తెలుగువాడిగా పుట్టినందుకు.  నిజం చెప్పాలంటే కాస్త ఛాతీ ఉప్పొంగిన మాట వాస్తవం.  అప్పటి నుండి నాలో ఎన్నో ఆలోచనలు.  మన కవు లందరూ (నాకు తెలిసిన) కళ్లముందు మెదిలారు.   వారందరూ కవులుగా ఎలా తయారయ్యారు.  ఎం చదివారు. ఎక్కడ శిక్షణ తీసుకున్నారు.  అసలు కవి కావడానికి అర్హతలేమిటి?  గద్య, పద్య మరియు పాటల రచన అనే ప్రక్రియలలో గద్య రచన స్పష్ఠంగా తెలుస్తోంది.  విషయ పరిజ్ఞానానికి భాషా పరిజ్ఞానం తోడైతే రచయిత కావచ్చు గద్య రచన చేయవచ్చు.  మరి కవి కావడమెలా?  అందరూ అంటుంటారు కవుల కు భావుకత ఎక్కువ అని కాని భావుకత ఉన్న వారందరూ కవులు కాలేరనేది జగమెరిగిన సత్యము. మరి కవి కావడాని ఎమైనా కోర్సులున్నయా? కోచింగ్ సెంటర్లున్నాయా?  ఛందస్సు మరియు వ్యాకరణం నేర్చుకుంటే కవై పోవచ్చా?  ఎలా? ఎలా? ఎలా? కవి కావడమెలా?  మీకేమైనా తెలిస్తే కాస్త చెప్పరూ?

Friday, September 5, 2014

ఉపాధ్యాయ దినోత్సవం - విద్యార్ధులతో దేశ ప్రధాని మాటా మంతి

ఈ రోజు భారత దేశ చరిత్రలో మొదటి సారి ఒక ప్రధాని దేశ వ్యాప్తంగా ఉన్న భావి భారత పౌరులను ( విద్యార్ధులను) ఇంటరాక్టివ్ పద్ధతిలో సంభాషించటం నిజంగా అభినందనీయం . ఇది భావి భారత పౌరులను ఎంతగానో  ప్రభావితం చేస్తుంది మరియు వాళ్లలో ఎంతో ఉత్తేజాన్ని నింపుతుందనడం సందేహం లేదు.  మన దేశ ప్రధాని ని దాదాపుగా ముఖతః మాట్లాడం ప్రశ్నించగలగడం మన so called Democracy లో నిజంగా ఒక కలే.  మన నాయకులు ఎన్నికయే వరకు అరచేతిలో స్వర్గాన్ని   ఆ తరువాత చుక్కల్ని చూపిస్తారు.   పిల్లల్లో నేను మన దేశ ప్రధానితో మట్త్లాడాను అనే భావన ఎంతటి ఉత్సుకత నింపుతుందో వర్ణనాతీతం .  మోదీ జీ ఎన్నికల ముందే కాదు ఎన్నికలై ప్రభుత్వాన్ని ఎర్పరిచిన తరువాత కూడా ప్రజలతో మమేక మవడాని కి చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం .

అంతే కాదు ఆయన ప్రసంగంలో అతి ముఖ్యమైన మరియు అత్యావశ్యక అంశాన్నికూడా ప్రస్తావించారు.    అదే నేటి తరంలో  ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న అనాసక్తి ని ఎత్తి చూపారు.  మరి మోదీ గారు ఉపాధ్యాయ వృత్తి మీద నేటి యువత కు అసక్తి కలగడానికి ఎమైనా చర్యలు చేపడ తారేమో చూడాలి.  ఉపాధ్యాయ వృత్తి మీద సమాజానికి ఉన్న దృక్ఫదం మారాలి.   ప్రతీ దానిని డబ్బుతో బేరీజు వేసే సంస్కృతి పోవాలి.    తమ జ్ఞానాన్ని పది మందికి పంచే పవిత్ర అధ్యాపక వృత్తి ని చేపట్టేలా నేటి తరాన్ని ప్రోత్సవాించాలి.