పేరు తెలపడానికి ఇష్టపడని వియాత్నం జాతీయుడు అమెరికా లో ఒకే ఒక వ్యక్తి
నివసిస్తున్న గ్రామం "బ్యుఫోర్డ్" 9 ,00 ,000 US డాలర్లకు వేలం లో
కొనుక్కున్నాడు. ఇప్పటివరకు ఈ గ్రామంలో 61 సంవత్సరముల వయస్సు గల
వ్యక్తి డాన్ సమ్మోన్స్ నివసిస్తున్నాడు. రైల్ రోడ్డు వసతి గల ఈ గ్రామం
లో ఒకప్పుడు 2000 మంది నివసించేవారు. ఈ గ్రామమానికి రైల్వే సదుపాయం
రద్దు చేసిన తరువాత గ్రామంలో ని వారంతా ఒక్కొక్కరుగా ఇతర ప్రాంతాలకు వలస
వెళ్లారు. వేలం అన్ లైన్ మరియు అన్ సైట్ లో నిర్వహించారు. 1,00 ,000
డాలర్ల వద్ద మొదలైన వేలం లో హంగ్ కాంగ్ , న్యూ యార్క్ , ఫ్లోరిడా,
కాన్సాస్ మరియు వ్యోమింగ్ ల నుంచి పోటి దారులు పాల్గొన్నారు. అన్ సైట్ లో
20 మంది పాల్గొనగా కొంత మంది ఫోన్ లో కూడా బిడ్ చేసారుట. కొనుగోలుదారునకు
10 ఎకరముల స్థలం, ఇల్లు, గారేజ్ లతో పాటు సెల్ టవర్ మరియు పార్కింగ్ లాట్
కూడా లభిస్తాయిట.
No comments:
Post a Comment