ప్రతీ రోజూ వ్యాయామం తరువాత ఒక కప్పు కాఫీ త్రాగడం మరువకండి. ఎందుకంటే వ్యాయామం చేసిన తరువాత కాఫీ త్రాగితే చర్మ కాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ రెంటి కలయిక వలన కాన్సర్ కారక ఎలుకలలో చర్మ వ్రణాలు 62% వరకూ తగ్గినట్లు న్యూజెర్సీ లోని రట్గర్స్ ఎర్నెస్ట్ మారియో స్కూల్ ఆఫ్ ఫార్మసీ కనుగొంది. ఈ రెంటి కలయిక సూర్యరస్మి వలన కలిగే కాన్యర్ ను ఎలుకలలో గణనీయంగా తగ్గించినట్లు డా. యావో పింగ్-లూ చెపుతున్నారు. మనుష్యులలో కూడా ఇవే ఫలితాలు కలుగుతాయని నమ్మకంగా తెలియచేస్తున్నారు. కెఫీన్ మరియు వ్యాయామం రెండూ మనకు మేలు చేస్తాయి అయితే రెండిటి కలయిక మరింత మంచి ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు. కాబట్టి వ్యాయమంతో బాటు ఒక కప్పు కాఫీ మర్చిపోకండే.
No comments:
Post a Comment