అతిత్వరలో చోదక రహిత కార్లు రోడ్ల మీద షికార్లు చేయనున్నాయి. మానవ ప్రమేయం లేకుండా నే ఈ కార్లు ఎర్ర దీపముల వద్ద ఆగుతాయి, పాదచారులకు రోడ్డు దాటడానికి దారినిస్తాయి, తమ డ్రైవింగ్ లైన్ లో ప్రయాణం చేస్తాయి, ఇతర వాహనములకు దారినిస్తాయి మరియు తమంట తాముగా ఇతర వాహనములను అధిగమిస్తాయి. తనంతట తానుగా చోదన చేయగల కార్లు ను తయారు చేయడం లో ముందంజలో గల ఈ కంపెనీ కి గతంలో ఎటువంటి కార్లు తయారు చేసిన అనుభవం లేదు. అదే గూగుల్. ఈ కార్ల సృష్టి కర్త సెబాష్టియన్ త్రూన్. ఇతను ౧8 సంవత్సరముల వయస్సులో తన స్నేహితుడును రోడ్డు ప్రమాదంలో కోల్సోయాడు. అప్పటి నుండి తన జీవితాన్ని ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో ప్రాణం కోల్పోతున్న ఒక మిలియన్ ప్రజల కు అంకితం చేయాడానికి నిశ్చయించుకున్నాడు. అతని ఆశయం చోదక రహిత కార్లు తయారు చేసేలా అతనిని ప్రేరేపించింది. 2004 వ సంవత్సరములో అమెరికా అత్యున్నత మిలిటరీ పరిశోధనా సంస్ధ DARPA నిర్వహించిన పోటీలో ఇతను తయారు చేసిన చోదక రహిత కారు 11 మెళ్లు ప్రయాణించి ప్రధమ స్ధానాన్ని పొందింది. తదుపరి సంవత్సరంలో 7 గంటల్లో నే 212 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన లక్ష్యన్ని చేరుకుంది. సరిగ్గా ఇటువంటి ఆలోచన వచ్చిన గూగల్ సంస్ధ సెబాస్టియన్ ని తమ కంపెనీ ముఖ్యాలయం మౌంటెన్ వ్యూ కి చోదక రహిత కార్ల ను అభివృద్ధి చేయడానికి ఆహ్వనించింది. సెబాస్టియన్ మరియు DARPA లో పోటీ పడిన మరో ఇంజనీర్ క్రిస్ అర్మసన్ తో కూడిన గూగుల్ ఇంజనీర్ల సముదాయం యెక్క కృషి ఫలితంగా చోదక రహిత టయోటా ప్రియుస్ కార్లు శాన్ ఫ్రాన్సిస్కో మరియు మౌంటైన్ వ్యూ ప్రాంతాలలో ప్రయాణించాయి. ఈ కార్లు ప్రతీరోజు ట్రాఫిక్ లో తమంతట తాము గా చోదకుల సహయం లేకుండా ఎటువంటి ప్రమాదాకి గురి కాకుండా ప్రయాణించ గాలిగాయి. అయితే ఈ కార్లు మార్కెట్ లోకి రావడానిరి కొన్ని సంవత్సరాలు (దశాబ్దములు కాదు) పట్టే అవకాశం ఉందని గూగల్ సంస్ధ తెలియ చేస్తోంది. అయితే భారతదేశంలో ఈ కార్లు షికారు చేయడానికి మాత్రం దశబ్దాలు పట్టే అవకాశం ఉందిట. ఈ కార్ల వలన ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహంచాలి అనే న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. వీటిని పరిష్కరించవలసి ఉన్నది.
No comments:
Post a Comment