Sunday, February 26, 2012

లవ్ హార్మొన్

మీ సంబంధం ఎంత కాలం నిలుస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ రక్తం లో 'ఆక్సిటోన్' లెవెల్ ఎంత వుందో తెలుసుకో మంటున్నారు శాస్త్రవేత్తలు.  ఇజ్రాయెల్ లోని బార్-ఇలాన్ యూనివర్సిటీ వారి పరిశోధన లో ఎక్కువ స్థాయి లో 'ఆక్సిటోన్' కలిగిన జంటలు తక్కువ స్థాయిలో 'ఆక్శిటోన్' కలిగిన జంటలు కన్న ఎక్కువ రోజులు కలసి ఉంటున్నారుట.  వీరి పరిశోధన కోసం కొత్తగా జీవితం ప్రారంభించిన వారిని ఎంపిక చేసుకున్నారు.  ఆరు మాసముల వ్యవధి తరువాత, ఎక్కువ స్థాయి లో 'ఆక్సిటోన్' కలిగిన జంటలు వారి సంబంధాన్ని ఇంకా కొనసగిస్తున్నారు లేదా కొనసాగించడానికి ఆసక్తిని కనవరిచారు కాగా తక్కువ స్థాయి లో 'ఆక్సిటోన్' కలిగిన జంటలు విడిపోవడం జరిగిందిట.  ఈ ఆక్సిటోన్ హార్మోన్ తల్లి శిశువుల బంధం లో కూడా కీలక పాత్ర వహిస్తుందిట.  ఇంతకు ముందు జరిగిన పరిసోధన లో నాశికా రంధ్రాల వద్ద ఆక్సిటోన్ పిచికారి వలన జంటల మధ్య ఆకర్షణ పెరిగినట్లుగా నిర్ధారణ జరిగింది.

No comments:

Post a Comment