Thursday, March 8, 2012

గీతారెడ్డికి నారాయణ లేఖ

గీతారెడ్డిని విమర్శించి నాలుక కరుచుకున్న నారాయణ ఆమెకు క్షమాపణ కోరుతూ ఉత్తరం రాశారు.  బహుశా ఈ వివాదం ఇక్కడి తో ముగిసిపోవచ్చు.   ఈ విషయం మీద ప్రజలు, ప్రముఖులు లేదా విమర్శకులు వెంటనే స్పందించారు. మరికొందరు ఎస్.సి/ఎస్.టి అట్రాసిటీ కేసు కూడా పెట్టారు.  అయితే ఈ మధ్య కాలంలో బహుశా చాలా కాలంగా కూడా కావచ్చు, ఒక విచిత్రమైన పోకడని గమనిస్తున్నాం.  అది ఏమిటంటే, "మహిళ అని చూడాకుండా ఆరోపించారు" లేదా "నేను బలహీన వర్గానికి చెందినవాడిని, కాబట్టి నా మీద ఆరోపణలు చేశారు" అంతే కాకుండా ఎస్.సి, ఎస్.టి కి చెందినవరు అయితే చెప్పనక్కరలేదు వెంటనే ఎస్.సి/ఎస్.టి అట్రాసిటీ కేసు అంటున్నారు.  ఇక్కడ నేను చెప్పొచ్చేదేమిటి అంటే, ఒక ఆరోపణ వచ్చినపుడు అందులోని నిజా నిజాలు చూడ కుండా, లేదా ఆ ఆరోపణ తప్పు అని చెప్ప కుండా పై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు.  ఇక్కడా ప్రాముఖ్యత ఇవ్వవలసింది ఆరోపణ ఏమిటీ అనే దాని మీద కాని, అది మహిళల మీద చేశారా లేక ఎస్.సి/ఎస్.టి ల మీద చేసారా అని కాదు అని నా అభిప్రాయం.  పత్రికలలో నూ ఇటువంటి శీర్షికలే చూస్తున్నాము. "బలహీన వర్గాల మీద దాడి" లేక "బలహీన వర్గానికి చెందిన మహిళ మీద అత్యాచార ప్రయత్నం".  ఏదైనా దాడి లేక అక్రుత్యం ఎవరిమీద జరిగినా దాని ఫలితం ఒక్కటే. ఎస్.సి/ఎస్.టి, బలహీన వర్గాల మీద ఒక లాగా లేక సాధారణ ప్రజలమీద ఒక లాగా వుండదు. అలాగే మహిళల మీద ఒకలాగా పురుషుల మీద ఒకలాగా ఉండదు.  కష్టం నష్టం అందరికీ ఒకే లాగా వుంటాయి.  సమస్యలు, ఆరోపణలు అనేవి జండర్, కాస్ట్ & క్రీడ్ ఆధారంగా వుండకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు?

6 comments:

  1. Replies
    1. మీడియా గాడిదలకు ఆ విషయం చెప్పండి.

      Delete
  2. మీడియావాళ్ళని పందులతో అయితే పోల్చొచ్చు కానీ బరువులు మోసి ప్రజలకి సేవ చేసే గాడిదలని అనడం బాగాలేదు. నిత్య జీవితంలో ఎవరూ ముఖం చూసి కులం పేరు గుర్తుపట్టలేరు. రాజకీయాలలోనే కులానికి ఎందుకంత ఇంపార్టెన్స్ వస్తోంది?

    ReplyDelete
  3. అసలు నారాయణ గీతారెడ్డి "గారి" ని (న మీద కేసు పెట్టకుండా వుండడం కోసం :)) ఏమని అన్నారు కొంచం ఎవరయినా తెలపగలరు? i missed the first part :).

    ReplyDelete
  4. మంత్రి గారు అందానికి ఇచ్చిన ప్రాధాన్యం, ఆ శాఖ సమస్యలు పరిష్కరించడానికి ఇవ్వరని నారాయణ గారు అన్నారు.. ఇంతకు ముందు ఐ.ఎ.ఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గారి మీద కూడా ఇలాగే నోరు పారేసుకున్నారట. శ్రీలక్ష్మి గారు ఎంత అందంగా ఉంటుందో, అంత అవినీతి పరురాలు అని మీడియా ముందు నోరు జారారట... దీని మీద నారాయణ వాళ్ళావిడ కూడా సీరియస్ అయిందట....!!! పాపం నారాయణ గారు. టైం బాగోలేదనుకుంటా...!!!

    ReplyDelete