Wednesday, March 7, 2012

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గే కేసు నమోదు


సుప్రీంకోర్టు లో కేంద్రపభుత్వం స్వలింగ సంపర్కం అనైతికం అని తరువాత తన వాదనను మార్చుకున్నప్పటికీ, దేశంలో నే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు లో గత డిసెంబరు నెలలో ఐ.పి.సి 377 సెక్షను కింద మొదటి కేసు నమోదు అయింది.    ఈ విషయం డిసెంబరు లో జరిగినప్పటికీ గే కమ్యూనిటి లోని సభ్యులు ఇటువంటి కేసులను ఎదుర్కొనడానికి తమ సభ్యులను చైతన్య పరిచేందుకు నిర్వహించిన సదస్సుల వలన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐ.పి.సి సెక్షను 377 స్వలింగ సంపర్కాన్ని నిరోధిస్తోంది.  ఐ.పి.సి సెక్షను 377 స్పష్టంగా స్వలింగ సంపర్కాన్ని నిరోధిస్తున్నా ఈ సెక్షను మీద కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి.  ఈ కేసులో ఓంగోలు పోలీసులు ముగ్గురిని డిసెంబరు 28  అరెస్టు చేసారు.  వీరిలో ఇద్దరు అసహజ లైంగిక చర్యకు పాలుపడుతుండగా మరొకరు గది బయట వేచియున్నాడుట.  జనవరి నెలలో ఇటువంటి దే మరో కేసు ఓంగోలులోనే నమోదు కావడం విశేషం.  ఐ.పి.సి. సెక్షను 377 కింద నిందితులకు 6 నెలల నుంచి 10 సంవత్సరములు జైలు శిక్ష పడే అవకాశం వుంది.  కాగా స్వలింగ సంపర్కం జరిగినట్లు డాక్టరు నిర్ధారిస్తే తప్ప పోలీసులు ఆరెస్టు చేయకూడదని గే కమ్యూనిటీ సభ్యులు తమ సభ్యులను జాగ్రుత పరుస్తున్నారుట.

1 comment:

  1. శరత్ కాలం గారికి ఈ విషయం చెప్పారా..... లైంగిక హక్కుల కార్యకర్త ఆయన.... పోరాటం చేస్తారు...

    ReplyDelete