తెలుగు చిత్రపరిశ్రమ త్వరలో తన సొంత ఛానల్ "చిత్రసీమ" ను ప్రారంభిస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చేనెలలో "చిత్రసీమ" ప్రసారాలను మనంచూడవచ్చు. "చిత్రసీమ" ఛానల్ యెక్క ప్రత్యేకత ఏమిటంటే ఇ ఛానల్ ఏ ఒక్కరికో చెందినది కాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమ యెక్క కోపరేటివ్ వెంచర్ గా పుండబోతోంది. అంటే ఇది ప్రతిఒక్కరి ఛానల్. చిత్రపరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామే. కోపరేటివ్ ఛానల్ అనేది ఒక దేశంలోనే ఒక కొత్త ఐడియా, ఇంతవరకూ ఏచిత్ర పరిశ్రమ ఇటువంటి ఆలోచన చేయలేదు. అమూల్ కోపరేటివ్ ఛానల్ యెక్క సక్సస్ ఈ ఛానల్ రూపకల్పనకు ప్రేరణ అని ఏ.పి ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ దగ్గుబాటి సురేష్ తెలియచేసారు.
No comments:
Post a Comment