ఈ రోజు ఆసియ కప్ కి సెలక్షన్స్ జరుగనున్నాయి. అయితే సచిన్ కి విశ్రాంతిని ఇస్తారా? లేదా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. 25 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్ లో సచిన్ అందుకోని మైలు రాయి లేదు. ప్రపంచ కప్ ని కూడా ఆశ్వాదించాడు. ఇంకా సచిన్ ఏం కోరుకుంటున్నాడు. ఏం ఆశించి ఇంకా అన్ని ఫార్మాట్ల లో ను ఆడాలనుకుంటున్నాడు. 100 సెంచరీల కోసమైతే టెస్టు లలో కొనసాగవచ్చు. తన కోరిక నెరవేర్చుకోవచ్చు. దేశం లో అనేక మంది యువ క్రికెటర్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సెలక్షన్ కమిటీ సాగనంపే వరకు వేచి చూడడం సచిన్ లాంటి వ్యక్తికి ఇచ్చే గౌరవం కాదు. సచిన్ తనకు తానుగా నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమయింది అనిపిస్తోంది. కాదంటారా?
No comments:
Post a Comment