Thursday, April 12, 2012

కొత్తగా ఆలోచించు


బాగుంది కదా కొత్త లాజిక్.

Saturday, April 7, 2012

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

"ఆరోగ్యమే మహా భాగ్యం" అన్నది నానుడి.  ఇది అక్షర సత్యం అన్నది నేడు నిరూ పితమవుతున్నది. ప్రజల కోసం ప్రజలచేత నిర్మితమైన మన ప్రభుత్వం "ప్రజారోగ్యాన్ని" గాలికి వదిలేసింది.  లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లు అని  ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు.  ప్రజల రక్తం పిండి మరి పన్నులు వాసులు చేస్తున్నారు.  వారి ని మద్యం మత్తు లో ముంచి వారి  ఆరోగ్య "సంపద"ని దోచేస్తున్నారు. కానీ ప్రాధమిక సదుపయాలైన విద్య, వైద్యం, మంచినీటి వసతి మొదలగునవి కల్పించటం లో విఫలమైనాయి.  ఇప్పటికి చాల గ్రామాలలో వైద్య సదుపాయం మృగ్యం.  ఏజన్సీ ప్రానతలైతే చెప్పనవసరం లేదు.  అడవి తల్లి బిడ్డలు దోమ కాటుకి కూడా బలైపోతున్నారు.  ప్రభుత్వ వైద్యశాలలు ని నిర్వీర్యం చేస్తున్నారు మరియు బడా కార్పొరేటు సంస్థలకు తాయిలలిచ్చి మరి మేపుతున్నారు.  నైతిక విలువలు హరించి పోతున్నాయి.  వైద్య వృత్తి కి సంపాదనే పరమావధి గా మారింది.  పాలకులరా కళ్ళు తెరవండి.  ప్రజలు  మిమ్మల్ని ఏమి అడగట్లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి దారి చూపించండి. వాళ్ళని బిచ్చగాళ్ళని చేయకండి. వారికి కనీస వసతులు (వారి చేతిలో లేనివి ) కలిపించండి చాలు అదే పదివేలు. సర్వే జనా సుఖినోభవంతు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని అతిచిన్న గ్రామం వేలం లో అమ్మకం !

పేరు తెలపడానికి ఇష్టపడని వియాత్నం జాతీయుడు అమెరికా లో ఒకే ఒక వ్యక్తి నివసిస్తున్న గ్రామం "బ్యుఫోర్డ్" 9 ,00 ,000 US డాలర్లకు వేలం లో కొనుక్కున్నాడు.   ఇప్పటివరకు ఈ గ్రామంలో   61 సంవత్సరముల వయస్సు గల  వ్యక్తి  డాన్ సమ్మోన్స్ నివసిస్తున్నాడు.  రైల్ రోడ్డు వసతి గల ఈ గ్రామం లో  ఒకప్పుడు  2000 మంది నివసించేవారు.  ఈ గ్రామమానికి రైల్వే  సదుపాయం  రద్దు చేసిన తరువాత గ్రామంలో ని వారంతా ఒక్కొక్కరుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వేలం అన్ లైన్ మరియు అన్ సైట్ లో నిర్వహించారు.  1,00 ,000 డాలర్ల వద్ద మొదలైన  వేలం లో  హంగ్ కాంగ్ , న్యూ యార్క్ , ఫ్లోరిడా, కాన్సాస్ మరియు వ్యోమింగ్ ల నుంచి పోటి దారులు పాల్గొన్నారు.  అన్ సైట్ లో 20  మంది పాల్గొనగా కొంత మంది ఫోన్ లో కూడా బిడ్ చేసారుట.  కొనుగోలుదారునకు 10 ఎకరముల స్థలం, ఇల్లు, గారేజ్ లతో పాటు సెల్ టవర్ మరియు పార్కింగ్ లాట్ కూడా లభిస్తాయిట.

Friday, April 6, 2012

హనుమజ్జయంతి ఎప్పుడు?

ఈ రోజు హనుమజ్జయంతి అని హైదరాబాదులో చాలా దేవాలయాలలో వేడుకలు నిర్సహించారు.  కాని కాలెండరు లో మే నెల 15 వ తేది అని ఉంది.  ప్రతి సంవత్సరము మే నెలలో వస్తుంది.  కాని మరి ఈ రోజు నిర్వహించిన వేడుకలు ఎమిటి? జయంతి రెండుసార్లు వచ్చే అవకాశం లేదు కదా?

నవ గ్రహాలు కాదుట?

పరీక్షల కాలం, మా అమ్మాయిని గ్రహాలు ఎన్ని అని అడిగితే ఎనిమిది అని సమాధానం చెప్పింది, కాదు తప్పు తొమ్మిది అని నేను చెబితే కాదు ఎనిమిది అని మాటీచర్ చెప్పారు అని అంది. కాని మన సౌరవ్యవస్తలోని గ్రహాలు తొమ్మిది అవి మార్స్, వీనస్, ఎర్త్, మెర్యురీ, జూపిటర్, సాటరన్, యురేనస్, నెప్ల్యూన్ మరియు ప్లూటో అని చిన్నప్పుడు చదుపుకున్నట్లు బాగా గుర్తు. వెంటనే పుస్తకం తిరగేసాను అప్పుడు తెలిసింది ఇప్పుడు గ్రహాలు ఎనిమిదిగానే పరిగణిస్తున్నారని.  అగస్టు 2006 లో జరిగిన సమావేశంలో అంతర్జాతీయ ఖగోళ సమితి ప్లూటో ని ఈ మధ్య కనుగొన్న ఇతర ఖగోళ వస్తువులను (సెరస్ 2003, UB313) లను మరుగుజ్జు గ్రహాలుగా పరిగణించాలని నిర్ణయించారుట.  ఇంక అప్పటి నుండి గ్రహాలు ఎనిమిది అని పాఠ్యాంశాలలో కూడా మార్పు చేశారు. 

Thursday, April 5, 2012

కాఫీ తో మరో ప్రయోజనం

ప్రతీ రోజూ వ్యాయామం తరువాత ఒక కప్పు కాఫీ త్రాగడం మరువకండి.  ఎందుకంటే వ్యాయామం చేసిన తరువాత కాఫీ త్రాగితే చర్మ కాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ.  ఈ రెంటి కలయిక వలన కాన్సర్ కారక ఎలుకలలో చర్మ వ్రణాలు 62% వరకూ తగ్గినట్లు న్యూజెర్సీ లోని రట్గర్స్ ఎర్నెస్ట్ మారియో స్కూల్ ఆఫ్ ఫార్మసీ కనుగొంది.  ఈ రెంటి కలయిక సూర్యరస్మి వలన కలిగే కాన్యర్ ను ఎలుకలలో గణనీయంగా తగ్గించినట్లు డా. యావో పింగ్-లూ చెపుతున్నారు. మనుష్యులలో కూడా ఇవే ఫలితాలు కలుగుతాయని నమ్మకంగా తెలియచేస్తున్నారు. కెఫీన్ మరియు వ్యాయామం రెండూ మనకు మేలు చేస్తాయి అయితే రెండిటి కలయిక మరింత మంచి ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు.  కాబట్టి వ్యాయమంతో బాటు ఒక కప్పు కాఫీ మర్చిపోకండే.

Tuesday, April 3, 2012

మిస్ యూనివర్స్ కెనడా పోటిలలో లింగ మార్పిడి మహిళ కు అవకాశం ?

వచ్చే మే నెలలో జరిగే 61 వ మిస్ యూనివర్స్ కెనడా పోటిలకు ఫైనలిస్ట్ గా ఎంపిక అయిన లింగ మార్పిడి  మహిళ ను పోటిలకు అనర్హురాలిగా నిర్వాహకులు గతనెలలో ప్రకటించారు. పోటి నియమ నిబంధనల ప్రకారం పోటిదారులు జన్మతః మహిళ అయి వుండాలి. కాగా సోమవారం తమనిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా మిస్ యూనివర్స్ సంస్థ ప్రకటించింది. 23 సంవత్సరాల  జెన్న తలకోవ జన్మతః మహిళ కాదు.  ఆమె 4 సంవత్సరాల క్రితం లింగ మార్పిడి శస్త్ర చికిత్స ద్వార మహిళ గా మారింది.