Wednesday, February 29, 2012

వేలానికి రానున్న గోల్కొండ వజ్రం

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గోల్కొండ వజ్రాల గనుల  నుంచి వచ్చిన 'బ్యూ-శాన్సి' వజ్రం మే నెలలో జెనీవాలోని సోధ్బీ లో వేలానికి రానుంది.  1610 లో ఈ వజ్రాన్ని  ఫ్రెంచ్ చక్రవర్తి హెన్రీ-VI భార్య రాణీ మారీ డి మెడిసి పట్టాభిషేక సమయంలో కిరీటంలో అలంకరించుకుంది.  ఈ వజ్రం 34.98 కారెట్ల బరువు కలిగియుంది.  2 మిలియన్ డాలర్ల నుంచి 4 మిలియన్ డాలర్ల వరకు పలక వచ్చునని అంచనా.  16 వ శతాబ్ది మధ్యలో ఈ వజ్రాన్ని పొందిన లార్డ్ ఆఫ్ శాన్సీ నికోలస్ డి హర్లే  పేరు మీద నామకరణం చేయబడి వంశ పారంపర్యంగా ఫాన్స్, ఇంగ్లాండ్, పర్షియా మరియు నెదర్లాండు యెక్క ఆరెంజ్-నాసా దేశ రాజ వంశస్తుల చేతులు మారింది.  గోల్కొండ వజ్రాల గనులు నుంచి వచ్చిన వజ్రాలు పారదర్శకత, స్వచ్ఛత మరియు తెలుపు దనానికి పెట్టింది పేరు.  ఈ లక్షణాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అరుదుగా లభించే టైవు-2 వజ్రాలలో మాత్రమే ఉంటాయి. 
    గోల్కొండ నుంచి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మరికొన్ని వజ్రాలు కోహినూర్, రీజెంట్ మరియు హోప్.  కోహినూర్ వజ్రం 186 కారెట్ల బరుమ కలిగి ప్రస్తుతం బ్రిటీషు రాణి కిరీట సంపదలో వుంది. అతిపెద్ద గోల్కొండ వజ్రం రీజెంట్.  దీని బరువు 410 కారెట్లు.  ఇది ప్రస్తుతం పారీస్ లోని లారే మ్యూజియం లో వుంది.  మరొక వజ్రం హోప్, ఇది ౪0 కారెట్ల బరువు కలిగి ప్రస్తుతం వాషింగ్టన్ లోని స్మిత్సోనియన్ మ్యూజియం లో వుంది. 

No comments:

Post a Comment