Friday, April 6, 2012

నవ గ్రహాలు కాదుట?

పరీక్షల కాలం, మా అమ్మాయిని గ్రహాలు ఎన్ని అని అడిగితే ఎనిమిది అని సమాధానం చెప్పింది, కాదు తప్పు తొమ్మిది అని నేను చెబితే కాదు ఎనిమిది అని మాటీచర్ చెప్పారు అని అంది. కాని మన సౌరవ్యవస్తలోని గ్రహాలు తొమ్మిది అవి మార్స్, వీనస్, ఎర్త్, మెర్యురీ, జూపిటర్, సాటరన్, యురేనస్, నెప్ల్యూన్ మరియు ప్లూటో అని చిన్నప్పుడు చదుపుకున్నట్లు బాగా గుర్తు. వెంటనే పుస్తకం తిరగేసాను అప్పుడు తెలిసింది ఇప్పుడు గ్రహాలు ఎనిమిదిగానే పరిగణిస్తున్నారని.  అగస్టు 2006 లో జరిగిన సమావేశంలో అంతర్జాతీయ ఖగోళ సమితి ప్లూటో ని ఈ మధ్య కనుగొన్న ఇతర ఖగోళ వస్తువులను (సెరస్ 2003, UB313) లను మరుగుజ్జు గ్రహాలుగా పరిగణించాలని నిర్ణయించారుట.  ఇంక అప్పటి నుండి గ్రహాలు ఎనిమిది అని పాఠ్యాంశాలలో కూడా మార్పు చేశారు. 

2 comments:

  1. పక్కింట శని, నట్టింట రాహువు, ఎందురింట కేతువు వున్న ఓ శుభముహుర్తాన, 9వ ఇంట కుజుడు తిష్టవేసినపుడు, ప్లూటో సౌరకుటుంబం నుండి వెళ్ళగొట్ట బడినాడు లేండి. :(

    ReplyDelete