తెలుగులో టైపు చేయడానికి అనేక ఉపకరణాలు గూగుల్ ఐఎమ్ఇ, బరహ, లేఖిని, హంసలేఖ, అక్షరమాల మొదలైనవి ఉన్నాయి. అయితే అవి అన్నీ ఫోనెటిక్ లేక ఇన్ స్క్రిప్ట్ పద్ధతిలో టైపు చేయడానికి మాత్రమే సహయ పడతాయి. ఇవన్నీ తెలుగు టైపింగ్ రాని వారు సులభంగా టైపు చేయడానికి ఎంతో ఉపయోగ పడతాయి కాని తెలుగు టైపింగ్ గోద్రేజ్, రెమింగ్టన్ టైపురైటర్ల మీద నేర్చుకున్న వారు పైన పేర్కొన్న పద్ధతులు ఉపయోగిస్తే వారు నేర్చుకున్న విద్య మర్చిపోయే అవకాశం పుంది. వారికోసమే ఇప్పుడు నేను ఒక ఉచిత సాప్ట్ వేర్ ను పరిచయం చేయబోతున్నాను. ఇది C-DAC వారు అభివృద్ధి పరిచారు. ఇది పూర్తిగా ఉచితం. మీరు ఈ క్రింది లింక్ ద్వారా తెలుగు యూనికోడ్ ఫాంట్స్ మరియు కీ బోర్డ్ డ్రైవరును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా అభ్యర్ధన మీద CD పొందవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి మీరు పైన పేర్కొన్న మూడు పద్ధతుల లోనూ టైపు చేయవచ్చు. తెలుగు భాష మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల సాఫ్ట్ వేర్ లను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైనక్స్ సాఫ్ట్ వేర్ కోసం ఫాంట్స్ ను ఇచ్చారు కాని కీబోర్డ్ డ్రైవర్ ను ప్రొవైడ్ చేయలేదు. మీకు తెలిసిన ఇలాంటి సాఫ్ట్ వేర్ ఉంటే తెలియ చేయండి.
ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేయండి
google telugu keyboard install చేసుకోండి. అల్ట్-షిఫ్ట్ కొట్టి మనం language మర్చి మర్చి కొట్టవచ్చు.
ReplyDeleteగూగుల్ తెలుగు కీ బోర్డ్ లైనక్స్ ని సపోర్ట్ చేయడం లేదు.
Delete