1907 లో న్యూయార్క్ లోని వస్త్ర పరిశ్రమలలోని స్ధితి గతులపై విసుగెత్తిన మహిళలు పనిగంటలు తగ్గింపు, వేతనాల పెంపు, ఓటు హక్కు కోసం నినదిస్తూ దాదాపు 15000 మంది సమ్మె చేశారు. సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగింది. మరోకధనం ప్రకారం 1857 మార్చి 8 వ తేదీన న్యూయార్క్ లోని వస్త్ర పరిశ్రమలలో జరిగిన సమ్మె 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అదే స్ధితిగతులు కొనసాగుతున్నందున 1907 లో ఈ సమ్మె జరిగింది. సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలోనే ఫిబ్రవరి నెల ఆఖరి ఆదివారం 1909 నుండి 1913 దాకా అమెరికా అంతటా 'ఉమెన్స్ డే' జరిగింది. అయితే జర్మనీ లోని కోపెన్ హగ్ లో 1910 లో అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి 17 దేశాల నుండి 100 మందికి పైగా హజరయ్యారు. ఈ సమావేశాన్ని 'క్లారా జెట్కిన్' నిర్వహించారు. ఆమె ప్రదిపాదన మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలన్న విషయమై అంగీకారం కుదిరింది. అనేక దేశాలలో ఫిబ్రవరి ఆఖరి ఆదివారాన్ని మహిళా దినోత్సవంగా జరుపుకునే వారు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 2 లక్షల మంది రష్యన్ సైనికుల మృతికి నిరసనగా రష్యాలో 'బ్రెడ్, పీస్ & రైట్ టు ఓట్' అన్న నినాదంతో సమ్మె ప్రారంభమైంది. రష్యాలో పాటించే జ్యూలియన్ కాలెండర్ ప్రకారం 23 ఫిబ్రవరి 1917 న ఈ సమ్మె ప్రారంభమైంది. అయితే గ్రెగరియన్ ప్రకారం ఈ సమ్మె మార్చి 8 న ప్రారంభమైనట్లు లెఖ్క. అప్పటినుండి మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటించే సంప్రదాయం అనేక దేశాలు పాటిస్తున్నాయి. 1911 మార్చి 8 న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మొదటగా డెన్మార్క్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లాంటి అనేక దేశాలు పాటించాయి. అలా 2011 నాటికి అంతర్జాతీయ మహిళాదినోత్సవం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
No comments:
Post a Comment