Tuesday, June 12, 2012

ఇదేనా ప్రజాస్వామ్యం ?


ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజి లోక్ సభ స్తానానికి అ రాష్ట్ర ముఖ్య మంత్రి అఖిలేష్  భార్య డింపుల్  ఏక గ్రివంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రజా స్వామ్యం అంటే  ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకో బడడమే అని నిర్వచనం ?  మరి డింపుల్  యాదవ్ ఎన్నికలో ప్రజల ప్రమేయం ఏముంది.  నిజంగా అ రాష్ట్ర ము లోని పార్టిలు ప్రధాన ప్రతి పక్షము మరియు జాతీయ పార్టీలతో సహా అభ్యర్ధిని నిలబెట్టక పోవడం సిగ్గుచేటు.  దేశం లోని రాజకీయ నాయకులందరూ ప్రాంతాల వారిగా పంచుకుంటూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.  ఇక్కడ అధికారమే ఆయుధం అని విస్పష్టంగా తెలుస్తోంది.  ఆమె 2009 లో జరిగిన  లోక్ సభ ఎన్నికలలో పోటి చేసి ఓటమి పాలయింది.  ఇప్పుడు వాళ్ళాయన ముఖ్యమంత్రి కావడం తో ఇల్లాలి ముచ్చట ని ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టి తీర్చాడు.

3 comments:

  1. ప్రజాస్వామ్యం!
    ఈ పదబందం ఏహ్యత కల్గింఏంతగా దుర్వినియోగం చేయబడింది. తప్పు రాజకీయ నాయకులదా? వారిని (చేసేది లేక) భరిస్తున్న (అమాయక) ప్రజదా? ఈ భేతాళ ప్రశ్నకు జవాబు తెలిసిన వారెవ్వరు! People get the government they deserve అని ఒక ఆంగ్ల సామెత ఉంది. అందు చేత ప్రజలు విజ్ఞానధనులు కానప్పుడు అవకతవక ప్రభుత్వాలే వచ్చి దరిద్రపు పాలనలు అందిస్తాయి. అవకాశవాదులు గద్దెకెక్కి ప్రజలను అమాయకత్వం నుండి బయట పడవేసే విద్యను ప్రోత్సహిస్తారనుకోవటం మరొక అమాయకత్వం.

    ఈ లోపాన్ని కాలమే సరిదిద్దాలి. సరిదిద్దుతుంది కూడా, కట్టె వంకర పొయ్యి తీర్చినట్లు.

    ఈ రోజున ధనం, పలుకుబడి, అధికారం అనేవి మూడూ పరస్పరసంపోషకాలుగా కనిపిస్తున్నాయి. వీటి సాయంతో అందలాలెక్కే వారిని నీతిసూత్రాలతో కట్టి, కొట్టి త్రోసివేయటం కేవల కథల్లోనే జరుగుతుంది.

    తమ చాపక్రిందికి నీళ్ళు వచ్చినప్పూడే స్పందించే జనసామాన్యమనస్తత్వం కారణంగా, తీవ్రమైన అసౌకర్యం కలిగేదాకా యిటువంటివాళ్ళను జనం (ఓటుతో) తరిమి కొట్టరు.

    ఓరిమి వహించండి.
    కాలమే అమాయకప్రజల కష్టాలు తీర్చాలి.

    ReplyDelete
  2. ఇక్కడ జగన్మోహనాసురుణ్ణి ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిని చెయ్యాలనుకునేవాళ్ళు ఉన్నారు కదా. ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా అలాగే.

    ReplyDelete
  3. జగన్మోహనాసురుణ్ణి!
    ఏమి సమాసం ప్రవీణ్!
    కాని యేంచేస్తాం, నిజానికి నేడు దాదాపు ప్రతి రాజకీయ నాయకుడూ ఒక అసురుడే!

    ReplyDelete