Thursday, December 11, 2014
Wednesday, December 10, 2014
గ్రేటెస్ట్ అన్లయిన్ షాపింగ్ ఫెస్టివల్ - ఎవరికీ పండుగ?
గూగుల్ మూడు రోజుల గ్రేటెస్ట్ అన్లయిన్ షాపింగ్ ఫెస్టివల్ ఈ రోజు ప్రారంభమయింది. అయితే ఇక్కడ పండుగ ఎవరికి? అనే అనుమానం నాకు మొదలయింది. ఆలోచించగా ఇది మనకి అనగా వినియోగదారులకు కాదు అమ్మకందారులకు పండుగ, తమ దగ్గర ఉన్న స్టాకును వదిలించుకోవడానికి భారీ తగ్గంపుల పేరుతో మనకి అవసరం లేకున్నా మనకి అంట కట్టే ప్రయత్నం లో చాలా కాలంగా సఫలం అవుతున్నారు అమ్మకందారులు. మనందరం పర్యావరణం మరియు కాలుష్యం దాని పర్యవసానాల మీద బాగా అవగాహన ఉన్నవాళ్లం. ఇప్పుడీ విషయం ఎందుకంటారా? ఎందుకంటే పర్యావరణ పరిరక్షణకు ముఖ్యంగా మూడు R ల సూత్రం ప్రతిపాదించారు మరియు దీనిని గో గ్రీన్ అనే ఉద్యమంగా మలిచారు కూడాను మన ప్రపంచ పర్యావరణ వేత్తలు. అవి ఎమిటంటే REDUCE, REUSE & RECYCLE. వీటిలో మొదటిది చాలా ముఖ్యమైంది i.e. Reduce అంటే "Reduce your consumption". అంటే మన వస్తు వినియోగాన్ని తగ్గంచుకోమని. ఇంతకు ముందు తరంతో పోలిస్తే ప్రస్తుత తరం యెక్క కొనుగోలు శక్తి పెరగడం కానివ్వండి కొత్త కొత్త వస్తూత్పత్తి అనండి ఎమైనా కాని అవసరానికి మించి కొనేస్తున్నాము అన్నది నిజం. ఇంతకు ముందు తరం వారు ఒక వస్తువు ను అవసరమైతే తప్ప కొనుగోలు చేసేవారు కాదు. అంటే Need basis మీద కోనుగోలు చేసేవారు. కాని ప్రస్తుత కాలంలో ఫాషన్ కోసం, గొప్పకోసం లేక ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయని కొనుగోలు చేస్తున్నాము. అంటే మనకి అవసరం ఉన్నా లేకున్నా అనవసర వస్తూత్పత్తి కి కారణమవు తున్నాము. మనం ఎంతగా కొనుగోలు జరిపితే అంతగా వస్తూత్పత్తి జరుగుతుంది అలాగే మనం వాడి పాడేసే వస్తువుల ద్వారా అంతగా కాలుష్యాం పెరగడానికి కారణమవుతున్నాము. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంట్లో కొన్ని వందల జతల చెప్పులు దొరికాయంటే అప్పుడు చాలా ఆశ్చర్య పోయాను. కాని అలాంటి జయలలితల్ని ఇప్పుడు చాలా మందిని మనం చూస్తు న్నాము. మనకి డబ్బు ఉంది కొనుగోలు చేస్తున్నాము అనుకుంటున్నాము కాని మన భావితరాలకి ఎంత చేటు చేస్తున్నామో గమనించడం లేదు. వస్తువులు కొనుగోలు చేసేముందు కాస్త ఆలోచించండి. నిజంగా అవసరమై కొంటున్నామా? లేదా? అలాగే మనం కొనే వస్తువులు పర్యావరణ హితమైనవా కాదా? వాటిని రీ సైకిల్ చేయగలమా? లేదా? మొదలయిన విషయాలు పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం . భావితరాలకోసం మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం . గో గ్రీన్ .
Tuesday, December 9, 2014
85 దేశాలలో మొబయిల్ ఫోన్ నుంచి మొబయిల్ లేదా లాండ్ లయిన్ ఫోనుకు అనంతమయిన కాల్స్ ఉచితంగా......
కాల్+ అనే అప్లికేషన్ అనే కొత్త మొబయిల్ అప్ వచ్చింది. దీనిని ఉపయోగించి 85 దేశాలలో (ప్చ్ ఇండియా లేదు) మొబయిల్ నుండి మొబయిల్ లేదా లాండ్ లయిన్ ఫోనుకు అనంతమయిన కాల్స్ ఉచితంగా చేసుకునే సదుపాయం కల్సిస్తున్నారు. వైబర్, టాక్ రే, స్కైప్ మొదలయిన ఉచిత ఫోన్ సదుపాయం కల్సించే అప్లికేషన్లు మనందరికీ తెలుసు. అయితే వీటిని ఉపయోగించడానికి ఇరు పక్షాలు అంటే కాల్ చేసేవారు మరియు కాల్ రిసీవ్ చేసుకునే వారూ కూడా ఆ అప్లికేషన్ కలిగి ఉండాలి. కాని కాల్+ లో ఉన్న ప్రత్యేకత ఎమిటంటే కాల్ రీసీవ్ చేసుకునే వారు ఈ అప్లికేషన్ ఇనస్టాల్ చేసుకోనవసరం లేదు. ప్రస్తుతానికి ఈ సదుపాయం US కాంటినెంట్, మెక్సికో, చైనా మరియు బ్రెజిల్ లలో మాత్రమే ఉపలబ్దం . ఇతర దేశాలలో వారికి కాల్ చేయాలంటే రెండు పే అప్సన్స్ ఉన్నాయి. ఒక రోజుకు 99 సెంట్స్, రెండు రోజులకు 1.99 డాలర్స్ లేదా నెలకు 19.99 డాలర్ల ప్లానులు ఎంచుకొని ఉచితంగా ఎంతసైపయినా మాట్లాడుకోవచ్చు. అప్లికేషన్ కోసం గూగల్ ప్లే స్టోర్ ని సందర్శించండి.
Monday, December 8, 2014
మీకు ఈ పండు పేరు తెలుసా?
ఈ పండు పేరు డ్రాగన్ ఫృూట్. దీని ఆకారం చూసి ఆ పేరు పెట్టి ఉంటారనుకుంటాను. చైనాలో ఎక్కువగా పండిస్తారుట. నేను వీటిని సింగపూర్ లో చూశాను. చూడటానికి రంగు చాలా బాగుంది కాని రుచి మాత్రం అంత గొప్పగాలేదు. చప్పగా ఉంటుంది. సింగపూర్ లో ఎటువంటి పంటలు పండించరు కాని ప్రపంచం నలుమూలల నుంచి పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకుంటారు. అక్కడ లభించని వైరైటీలేదు అంటే ఏ మాత్రం అదిశయోక్తి కాదు.
Saturday, December 6, 2014
ఆదర్శప్రాయుడు ఈ కానిస్టేబుల్
ప్రస్తుత సమాజంలో హితబొధకులు పెరిగిపోయారు. చాలా మంది సొసైటీ పాడయిపోయింది మానవత్వం చచ్చిపోయింది వగైరా వగైరా డైలాగులు చెప్పడం, సోషల్ సైట్లలో నీతి వాక్యాలు పెట్టి లైకులు కొట్టడం వంటివి మనం చూస్తున్నాం . కాని ఈ కానిస్టేబుల్ ని చూడండి. నిజంగా ఆదర్శప్రాయుడు అంటే ఇతనే. చెప్పడం లేదు. చేతలలో చూపిస్తున్నాడు. ప్రాధమిక చికిత్స ఎంత అవసరమో మనందరికీ తెలిసినదే. ఈ కానిస్టేబుల్ తన పరిధిలో తగు సహయం చేస్తు మానవత్వాన్ని పరిమళించప చేస్తున్నాడు. హట్సాఫ్ సయ్యద్.
Friday, December 5, 2014
ఫాన్సీ నెంబరు కొనుగోలు డబ్బు తగలేయడమా?
నా బ్లాగులో "బియస్ యన్ యల్ ఫాన్సీ నెంబర్ల వేలం" టపాకు వచ్చిన కామెంటుకు నా విశ్లేషణ.
ఇందులో డబ్బులు తగులబెట్టేది ఎమీ లేదు అనేది నాభావన. ఎందుకంటే ఖర్చు అనేది చూసే వారి దృష్టి ని బట్టి ఉంటుంది అనేది కాదనలేని నిజం. కారు కొనుక్కోవడం అవసరం అనుకుంటాడు కొనగలిగేవాడు, కొనలేనివాడు అనవసర ఖర్చు అంటాడు. ఇలాంటివే చాలా చెప్పొచ్చు అనుకోండి. కాని ఇక్కడ విషయం అది కాదు. ఇంతకు ముందు సామాన్యుడుకు ఫాన్సీ నెంబర్లు ఎండమావె. వెహికల్ నెంబర్లు కాని టెలిఫోన్ నెంబర్లు కాని మనకి నచ్చినవి కావాలంటే మనకి ఆ డిపార్టుమెంటులో పనిచేసేవారు తెలిసుండాలి లేక మనకి మంచి పరపతి లేదా చేయి తడప గిలిగే తెగువ ఉండాలి. లేకపోతే వారెదిస్తే అదే గతి. కాని మారిన పరిస్తుతులు గ్లోబలైజేషన్ వలన కంపెనీలు మరియు ప్రభుత్వాలు కుడా వ్యాపార సరళిని పెంపొందించుకుంటున్నాయి. డబ్బులు వచ్చే ఎ అవకాశాన్ని వదులు కోవడం లేదు. దీని వలన నష్టం కూడా ఎమీ లేదు. ఉభయతారకం కూడాను. మనకి అవకాశం ఉంటే డబ్బులు పెట్టగలిగితే ఎవడి కాళ్లు పట్టుకోకుండా దర్జాగా మనకి నచ్చిన నెంబరును సొంతం చేసుకో వచ్చు. కాదంటారా?
ఇందులో డబ్బులు తగులబెట్టేది ఎమీ లేదు అనేది నాభావన. ఎందుకంటే ఖర్చు అనేది చూసే వారి దృష్టి ని బట్టి ఉంటుంది అనేది కాదనలేని నిజం. కారు కొనుక్కోవడం అవసరం అనుకుంటాడు కొనగలిగేవాడు, కొనలేనివాడు అనవసర ఖర్చు అంటాడు. ఇలాంటివే చాలా చెప్పొచ్చు అనుకోండి. కాని ఇక్కడ విషయం అది కాదు. ఇంతకు ముందు సామాన్యుడుకు ఫాన్సీ నెంబర్లు ఎండమావె. వెహికల్ నెంబర్లు కాని టెలిఫోన్ నెంబర్లు కాని మనకి నచ్చినవి కావాలంటే మనకి ఆ డిపార్టుమెంటులో పనిచేసేవారు తెలిసుండాలి లేక మనకి మంచి పరపతి లేదా చేయి తడప గిలిగే తెగువ ఉండాలి. లేకపోతే వారెదిస్తే అదే గతి. కాని మారిన పరిస్తుతులు గ్లోబలైజేషన్ వలన కంపెనీలు మరియు ప్రభుత్వాలు కుడా వ్యాపార సరళిని పెంపొందించుకుంటున్నాయి. డబ్బులు వచ్చే ఎ అవకాశాన్ని వదులు కోవడం లేదు. దీని వలన నష్టం కూడా ఎమీ లేదు. ఉభయతారకం కూడాను. మనకి అవకాశం ఉంటే డబ్బులు పెట్టగలిగితే ఎవడి కాళ్లు పట్టుకోకుండా దర్జాగా మనకి నచ్చిన నెంబరును సొంతం చేసుకో వచ్చు. కాదంటారా?
తప్పు ఎప్పుడూ మగవారిదేనా?
అమ్మాయిలు, అబ్బాయిల తగాదాలలో ఎప్పుడూ మగవారినే తప్పు పడుతుంటారు మన సమాజాంలో. బహుశా చాలా కేసులు లో అబ్బయిలే దోషులుగా తేలడం వలన అనుకుంటా. మొన్న హరియానా లో రోవాతక్ బస్ లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ముగ్గురు యువకులను బెల్టుతో చితకబాదారు. ఆ విడియో సోషియాలో మీడియా బహళ ప్రచారం పొందింది. చాలామంది, ఆ అమ్మాయిల తెగువను కూడా పొగిడారు. మరికొంత మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్న సహ ప్రయాణికులను తిట్టి పోశారు కూడాను వారు మిన్నకుండిపోయారని. హరియాణా ప్రభుత్వమైతా ఇంకొంచెం ముందుకెళ్లి రాబోయో గణతంత్రదినోత్సవ కార్యక్రమంలో వారిని సత్కరిస్తామని ప్రకటించేశారు కూడాను. కాని ఆ కేసు దర్యాప్తు లో ఆ బస్సులోనే ప్రయణిస్తున్న నలుగురు మహిళలు ఆ ముగ్గురు యువకుల కు అనుకూలంగా సాక్ష్యం చెప్పారుట. దాంతో హరియాలా ప్రభుత్వం సత్కార విషయాన్ని దర్యాప్తు పూర్తి అయె వరకు పక్కన పెట్టరారుట. ప్రస్తుత మారిన సమాజంలో నిజా నిజాలు తెలియకుండా స్పందింస్తే ఇంతే సంగతులు.
Thursday, December 4, 2014
మీకు మొబయిల్ ఫోన్ ఫాన్సీ నెంబరు కావాలా?
బియస్ యన్ యల్ మొబయిల్ ఫాన్సీ నంబర్లను వేలం వేస్తోంది. మీకు నచ్చిన నెంబర్లను అతి తక్కువ ధరకు పొందండి. మీరు ఎంచుకోవడానికి విస్తృత మైన సంఖ్యలు అందుబాటులో ఉన్నాయి. త్వరపడండి. ఈ అవకాశం కొద్ధిరోజులు మాత్రమే. మీకు నచ్చిన సంఖ్యలు ఎంచుకోవాడినికి క్రింది లింక్ ను నొక్కండి.
ఇక్కడ నొక్కండి
ఇక్కడ నొక్కండి
Tuesday, December 2, 2014
పది కేజీల (నిజమే మీరు చదివినది) 24 కారెట్ల స్వచ్ఛమైన బంగారపు నాణెము
పది కేజీల (నిజమే మీరు చదివినది) 24 కారెట్ల స్వచ్ఛమైన బంగారపు నాణెము. సింగపూర్ లో ముస్తఫా షాపింగ్ మాల్ లభ్యమపుతోంది. నేను మొన్న వేసవి సెలవులకు సింగపూర్ వెళ్లి నపుడు మొదటి సారి చూశాను లెండి అంత బంగారాన్ని ప్రత్యక్షంగా. మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే సింగపూర్ వెళ్లండి లేదా కొద్ది రోజులు వేచి ఉండండి ఎలాగు మన దొరలు ఆంధ్ర తెలంగాణాలను సింగపూర్ లు గా అభివృద్ది చేస్తామంటున్నారు కదా. మన షాపింగ్ మాల్ లో కూడా దొరకొచ్చు.
Saturday, November 29, 2014
ఒక మంచి ఆప్ - పెడోమీటర్
ఆప్స్ ఆప్స్ స్మార్ట్ ఫోన్ ల యుగంలో ఆప్స్ అందరికీ చేరువయి పోయాయి. నిజంగా అప్స్ మనదినసరి కార్యక్రమాల నిర్వవాణను చాలా సులభతరం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆండ్రాయిడ్ శకం మొదలయ్యాక అప్స్ మన జీవితంలోకి చొచ్చుకుని వచ్చేశాయి. ఇప్పుడు లెక్కలేనన్ని ఆప్స్ అందుబాటులో ఉన్నయి. మన ప్రతీ అవసరానికీ ఒక ఆప్ ఉందనడం లో ఆనుమానం లేదు. నేను కొత్తగా పెడోమీటర్ అనే అప్ ను నా స్మార్ట్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకున్నాను. ఇది రోజు మనం ఎంత దూరం నడుస్తున్నాం అనే విషయాన్ని నమోదు చేస్తుంది. అంతే కాకుండా ఎంత వేగంతో నడుస్తున్నాం, ఎన్ని కాలరీలు ఖర్చు అయ్యాయి, ఎంత సేపు నడిచాం మొదలయిన వివరాలు తేది, వారం మరియు నెల వారీగా నమోదు చేస్తుంది మరియు చూపుతుంది. వ్యాయామంగా నడక చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరం . మీరు ప్రయత్నించి చూడండి.
Saturday, November 22, 2014
బి యస్ యన్ యల్ లో జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ల నియామకం
బి యస్ యన్ యల్ లో జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ల నియామకం. పూర్తి వివరములకు క్రింది లింక్ ను నొక్కండి
ఇక్కడ నొక్కండి
ఇక్కడ నొక్కండి
Sunday, November 2, 2014
దీపావళికి దీపాలను వెలిగంచారని విద్యార్ధులమీద చర్యలు!
భారత దేశం సెక్యులర్ దేశమని గర్వంగా చెప్పుకుంటాము. మనది హిందూ దేశమైనప్పటికీ, మన దేశ రాజ్యాంగం పౌరులకు తమకు నచ్చిన మతం మరియు మత పరమైన ఆచార వ్యవహరాలు అనుసరించే పూర్తి హక్కునిచ్చింది. అన్య మతస్తులు మైనారిటీలని వారికి అనేక వసతులు కల్పించాము అనేకంటే ఇతర దేశములతో పోల్చితే నెత్తిన పెట్టి చూసుకుంటున్నాము అని చెప్పవచ్పు. అన్ని మతాలవారిని సమానంగా గౌరవంగా చూస్తున్నాము. అంతవరకూ బాగుంది కాని మరి మన హిందూ మతాన్ని గౌరవించవద్దా? హిందువు లను లక్ష్యంగా ఉగ్రవాద దాడులు జరపడం, మతమార్పిడులకు పూనుకోవడం, మన పవిత్ర దేవాలయాలలో అన్య మత ప్రచారాలు చేయడం చూస్తున్నాము. తమిళనాడులోని ఒక మెడికల్ కళాశాలలో మొన్న దీపావళికి దీపాలను వెలిగంచారని ఆ విద్యార్ధులమీద చర్యలు తీసుకున్నారు. రూ.5000/_ అపరాధ రుసుము విధించారు. సెక్కులర్ దేశమంటే ఇతర మతస్ద్తులను నెత్తిన పెట్టుకోవడమేనా మన హిందూ మతం మీద మమకారం ఉండక్కరలేదా? ప్రతీ దేశం తమ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటయి తమ జాతి మతములకు ఎంతో పాధాన్యతనిస్తాయి. కాని మనం మనవి వదిలేసుకుని దేనికోసమో పాకులాడుతున్నామనిపిస్తోంది. మన దేశం, ప్రాంతం, భాష, సంస్కృతి, మతం, ఆచార వ్యవహరాలను వదిలేసి పరులకు పట్టం కడుతున్నాము. అన్యులు మన మతాచారాలని గౌరవించక పోతే కనీసం స్పందించక పోతే ఎలా? ఇటువంటి చర్యలను అడ్డుకునే చర్యలు తూతూ మంత్రంగా మాత్రమే జరుగుతున్నాయి. ఇలా మిన్నకుంటే రాను రాను అవి పెను భూతంగా పరిణమించవచ్చు. మోడి అయినా ఒటు బ్యాంకు రాజకీయాలకు ప్రాకులాడ కుండా మన దేశానికి పూర్వ వైభవాన్ని తీసుకు వస్తాడని ఆశిద్దాం .
Saturday, November 1, 2014
ఆకాశవాణి నుంచి త్వరలో 24 గంటల వార్తా ప్రసారాల ఛానెల్
ఆకాశవాణి రేడియోలో ఈ మధ్య నరేంద్ర మోడి మన్ కి బాత్ అను కార్యక్రమం ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన విషయం విదితమే. నరేంద్ర మోడి మన్ కి బాత్ కార్యక్రమం రేడియో కి మరింత ప్రాచుర్యం కలిగించడమే కాకుండా దేశంలో ని మారు మూల ప్రాంతాలలోకి కూడా తన సందేశాన్ని చేరవేయాలని మోది సంకల్పాన్ని నెరవేర్చింది . ఈ నెల 2వ తేదిన మరోమారు నరేంద్ర మోడి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారుట. తన రేడియో కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసిన నరేంద్రమోడి, దూరదర్శన్ తరహలో ఆకాశవాణిలో కూడా 24 గంటల వార్తా ప్రసారాల ఛానెల్ ప్రారంభించడాని కి ఆదేశాలు జారీ చేశారుట. సో మనం త్వరలో కొత్త ఆకాశ వాణి 24 గంటల వార్తా ప్రసారాల ఛానెల్ ను చూడబోతున్నాము కాదు కాదు వినబోతున్నాము.
Wednesday, October 29, 2014
మీకీ విషయం తెలుసా?
ఈ రోజు నాకొక కొత్త విషయం తెలిసింది. అదేమిటంటే "వెండి తెర నవలలు" అంటే సినిమా నవలలు. నవలల ను సినిమాలు గా తీయడం మనందరికి సుపరిచితమే. కాని ముందే తీసిన సినిమాలను నవలా రూపంలో అచ్చువేయించేవారుట. అంటే రివర్స్ అన్నమాట, ముందు సినిమా ఆ తరువాత నవల. ఇది విన్నప్పుడు నిజంగా గమ్మత్తుగా అనిపించింది. కాని ఇది నిజం. తెలుగు సినిమా తొలి నాళ్లలో సినిమాలను ప్రజలకు చేరువయ్యేందుకు నవలా రూపంలో అచ్చువేయించేవారుట. ఒక పెద్ద కధను మూడు గంటలలో సినిమాగా చూపించాలి. అందువలన దర్శకునికి అది పెద్ద సవాలు. దర్శకుడు సినిమాలో తీసింది అంటే దర్శకుని కోణం (దర్శకుని మనస్సులో ఉన్నది) ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో నవలలను అచ్చువేయించేవారుట. పాతాళభైరవి, మాయా బజారు, కన్యాశుల్కం ఇత్యాది సినిమాలు నవలలు గా వచ్చి ప్రజల మన్ననలు పొందడమే గాక పునః ముద్రణ కూడా గావింప బడినవిట.
Monday, October 27, 2014
ఎందుకిలా?
ఈ మధ్య ఫేస్ బుక్ లో చాలా మంది దేవుడి ఫొటోలు పోస్ట్ చేసి 5 సెకన్లలో షేర్ చేయండి మీకు మంచి జరుగుతుంది లేదా మంచి వార్త వింటారు అని రకరకాలుగా మెసేజ్ లు పెడుతున్నారు. వాటిని చాలా మంది షేర్ చేస్తున్నారు. మా చిన్న తనంలో కూడా ఇలా పామ్ ప్లేట్ లు పంచి పెట్టే వారు. వాటిలో దేముడి మహిమలు లేక దేవుడు కలలో కనిపించాడు, అది చేయమన్నాడు ఇది చేయమన్నాడు అంటూ వ్రాసి చివరకు మీరు కూడా కొన్ని పామ్ ప్లేట్లు పంచండి లేక పోతే మీకు కీడు జరుగుతుంది అంటూ వ్రాసేవారు. అసలు ఇలా ఎవరు మొదలు పెట్టేరో తెలీదు కాని వారికి ఎం ఒరుగుతుందో నిజంగా నాకు అర్ధం కాలేదు. వీళ్లకి మినిమం కామన్ సెన్స్ ఉండదా అని పిస్తుంది. బలహీనుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆ పామ్ ప్లేట్ లను పడయలేక వేరే వాళ్లకి ఇవ్వ లేక (పామ్ ప్ల్టేట్ ఇచ్చే వాళ్లని చాలా అనుమానంగా చూసేవారు) వాళ్లు పడే యాతన పగవాడికి కూడా వద్దురా బాబు అని పిస్తుంది. ఇలాంటి బలవంతపు షేర్ ల వలన కలిగే లాభం ఎమిటో ఎంతకీ అంతుపట్టదు. వాళ్లకి మంచి జరగడం దెవుడెరుగు, మరొకళ్లని ఇబ్బందుల పాలు చేసినందుకు మాత్రం తప్పక దండించ బడతారనిపిస్తుంది.
Sunday, October 26, 2014
సప్త వర్ణ రంజిత మైన గులాబీలు.
Saturday, October 25, 2014
రెడ్ ఎమ్ ఐ ఫోన్ కొంటున్నారా? ఒక్క సారి ఆలోచించండి.
ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్ లో రెడ్ ఎమ్ ఐ ఎస్ 1 ఫోను మంచి ఫీచర్లతో సరసమయిన ధరలో (రు. 5999 మాత్రమే) లబిస్తోంది. ఈ ఫోనును సొంతం చేసుకోవడానికి ముందుగా మీరు మీ ఫ్లిప్ కార్ట్ అక్కౌంటు ద్వారా నమోదు చేసుకోవలసి ఉంటుంది. తరువాత ఫ్లిప్ కార్ట్ సూచించిన తేదీ మరియు సమయానికి అమ్మకాలు ప్రారంభమవుతాయి. సరిగ్గా అదేసమయానికి మనం బై అనే బటన్ క్ల్దిక్ చేయడం ద్వారా మనం కొనుక్కోవచ్చు. కాని లక్షలాది మంది నమోదు చేసుకుంటుండడం వలన సెకన్ల వ్యవధిలో నే అమ్మకాలు పూర్తి ఆయిపోతున్నాయి. చాలా మంది నిరాశకు గురవుతున్నారు. అంత ప్రజాదరణ పొందింది ఈ స్మార్ట్ ఫోను. అయితే ఈ ఫోన్ బుక్ లోని కాంటాక్ట్స్ మరియు మెసెజెలు బీజింగ్ లోని సర్వర్లలో నిక్షిప్తమవుతున్నాయట. ఆందుకే తమ ఉద్యోగులు మరియు వారి పరివారాన్ని ఈ ఫోను వినియోగించ వద్దని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిబంధన విధించింది. సో మీరు కూడా రెడ్ ఎమ్ ఐ ఫోన్ కొందామనుకుంటున్నారా? అయితే ఒక్క సారి ఆలోచించండి.
Friday, October 24, 2014
FACEBOOKలో షేర్ బడిన ఈ మెసేజ్ చుడండి. దీనిని రాసిన వారిని మీరు ఖచ్చితంగా అభినందిస్తారు.
FACEBOOKలో షేర్ బడిన ఈ క్రింది మెసేజ్ చుడండి. దీనిని కంపోజ్ చేసిన వాడికి హాట్సాఫ్ .
1. DILIP VENGSARKAR
When you rearrange the letters:
A SPARKLING DRIVE
2. PRINCESS DIANA
When you rearrange the letters:
END IS A CAR SPIN
3. MONICA LEWINSKY
When you rearrange the letters:
NICE SILKY WOMAN
4. DORMITORY
When you rearrange the letters:
DIRTY ROOM
5. ASTRONOMER
When you rearrange the letters:
MOON STARER
6. DESPERATION
When you rearrange the letters:
A ROPE ENDS IT
7. THE EYES
When you rearrange
THEY SEE
8. A DECIMAL POINT
When you rearrange the letters:
I M A DOT IN PLACE
AND FOR THE GRAND FINALE
MOTHER-IN-LAW
When you rearrange the letters:
WOMAN HITLER...
1. DILIP VENGSARKAR
When you rearrange the letters:
A SPARKLING DRIVE
2. PRINCESS DIANA
When you rearrange the letters:
END IS A CAR SPIN
3. MONICA LEWINSKY
When you rearrange the letters:
NICE SILKY WOMAN
4. DORMITORY
When you rearrange the letters:
DIRTY ROOM
5. ASTRONOMER
When you rearrange the letters:
MOON STARER
6. DESPERATION
When you rearrange the letters:
A ROPE ENDS IT
7. THE EYES
When you rearrange
THEY SEE
8. A DECIMAL POINT
When you rearrange the letters:
I M A DOT IN PLACE
AND FOR THE GRAND FINALE
MOTHER-IN-LAW
When you rearrange the letters:
WOMAN HITLER...
Thursday, October 2, 2014
ఎంత తేడా?
ఈ రోజు పేపరులో వచ్చిన రెండు వార్తలు చూడండి తేడా ఎంతో మీకు కుడా తెలుస్తుంది. ఒకరు పర్యావరణానికి హనికరమని తన ప్లెక్సీలు తొలగిస్తే మరో పక్క మన దొరవారి ప్లెక్సీ కాలిందని దాని మీద ఎంతో విలువయిన ప్రజా వనరులను పణంగా పెట్టి ఎంక్వయిరీ. మరో విషయం నిన్న మన ప్రధాని నరేంద్ర మోది గారు పిలుపు మేరకు దేశ ప్రజలందరూ స్వచ్ఛ భారత్ కు ప్రమాణం చేసి తమవంతు శుద్ధి కార్యక్రమాన్ని చేపడితే మన సియం గారు మాత్రం ఎక్కడా కనపడలేదు. మీరేమైనా చూశారా?
Wednesday, September 17, 2014
Monday, September 15, 2014
కాశ్మీరు వరద బాధితులకు బి యస్ యన్ యల్ ఉద్యోగుల వితరణ
కనీ విని ఎరుగని రీతిలో ప్రకృతి ప్రకోపానికి గురైన కాశ్మీరు వరద బాధితులకు బి యస్ యన్ యల్ ఉద్యోగులు తమ వంతు సహయంగా ఒక రోజు జీతాన్ని (మూలవేతనం) వితరణ గా ప్రకటించాలని బియస్ యన్ యల్ ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి.
"శర్మగారి బ్లాగు లో చోరి" - టపా లోని విషయం గూర్చి
"శర్మగారి బ్లాగు లో చోరి" టపా చదివిన తరువాత, నా బ్లాగులో "శర్మగారు ఇక బ్లాగులు రాయను" అని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించడానికి తోటి బ్లాగర్లు చేస్తున్న ప్రయత్నాలు చూసి నా వంతు కర్తవ్యంగా ఆయన్ని శాంతిప జేయాలనే సదుద్దేశంతో నేను ఈ నెల 10 వ తేదీన వ్రాసిన టపా ( ఇక్కడ నొక్కండి) ఆయనను శాంతింప చేయక పోగా మరింత ఆగ్రహం కలిగించింది అని భావించి ఆ టపా యిెక్క ఉద్దేశ్యము తెలుపుతూ వివరణ (వాదన కాదు).
నా మొదటి పేరాలో నే మిమ్మల్ని శాంతింప చేయడమే నా ప్రయత్నము అని స్పష్ఠంగా చెప్పాను. మీకు సుద్దులు చెప్పాలనే సంకల్సము నాకు ఎ కోశానా లేదు మరియు అంతటి అనుభవము లేదు.
సమాచారం తీసుకున్నవారు ఆ విష యాన్ని వ్యక్తపరచడం సభ్యత అని వ్రాశాను. వ్యక్త పరచలేదంటే సభ్యత సంస్కారములు లేని వారనే గా అర్ధం . అది తప్పు అని కూడా తెలుస్తోంది. కాని ఎదుటి వాడిని దూషించడం సభ్యత కాదనిపించి సూటిగా వ్రాయలేదు.
నా బ్లాగులో చిల్లి ముంత కూడా లేదు ఎత్తుకు పోవడానికి అని పరిహసమాడారు మీరే. దీని బట్టి మీ బ్లాగులో మంచి విషయం ఉందనే కదా అర్దం. అందుకు మీరు గర్వపడాలి కదా. నేను వ్రాసినది కూడా అదే కదా. ఆఖరుకు ఎమీ లేని నా బ్లాగులోని కంటెంట్ కూడా అపహరణకు గురైంది. తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ఒక ఛానెల్ రానుంది అనే సమాచారం. ఆ కంటెంట్ ని వెబ్సైట్ (బ్లాగు కాదు) లో యధాతధంగా (కాపి పేస్టు) ఉంచారు.
ఇక నా బ్లాగు విషయానికొస్తే నేను రచయితను కాను. మంచి విషయాలు తెలుసుకోవడానికి బ్లాగులు చదుపు తుంటాను నాకు తెలిసిన కొత్త విషయాలు అందరితో పంచుకుందామనే ఉద్దేశ్యంతో నాకు చేతనైనంత వీలైనప్పడు రాస్తున్నాను. అప్పుడప్పుడు నా ఆక్రోశం వెళ్ల గక్కడానికి కూడా రాస్తుంటాను. బ్లాగింగు నా ప్రొఫెషను కాదు, హబీ మాత్రమే.
తప్పు ఎప్పుడూ తప్పే అందులో సందేహం లేదు. తప్ప చేసినవాడి కి ఎప్పుడూ అపరాధభావం ఉంటుంది. ధైర్యంగా ముందుకు రాలేడు. చౌర్యం అనేది తప్పే. అందులో రెండవ వాదన లేదు. తప్పచేసినవాడిని ఎవరూ అభినందించరు. వాడి ఎదుట ఎమీ చేయలేక పోయినా మనస్సులో మాత్రం వ్యతిరేకత ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నా పోస్టులో నేను తప్పు చేసిన వాడిని సమర్ధించ లేదు. చౌర్యం అనేది సహజం అని వ్యక్తపరిచాను (సిని పరిశ్రమ చౌర్యాన్ని గురించి ప్రస్తావించి) మిమ్మల్ని పాసిఫై చేయాలనే ఉద్దేశ్యంతో. ఫలానా బ్లాగరు కాపీ చేస్తాడు అని తెలిస్తే ఎవరు ఆ బ్లాగును చూడడానికి కూడా ఇష్టపడరు. మీరు ఆ బ్లాగుల వివరాలు ఆధారాలతో సహ ఈ రోజు ప్రకటించి మంచి పని చేశారు. మచ్చుకు ఒకటి చూశాను. దిగ్ర్బాంతి చెందాను అనడంలో సందేహ లేదు. ఇప్పటి వరకు స్పూర్తిగా తీసుకున్నాం అంటుంటారు కదా అలా నేమో అనుకున్నాను. మక్కి కి మక్కి అంటే మనసెలా ఒప్పిందో మరి.
కోడి కుంపటి కధ ద్వారా నన్ను నేనే విమర్శించున్నాను అన్నారు. ముందే చెప్పాను నేను మిమ్మల్ని శాంతింప చేయడాని కి వ్రాస్తు మిమ్మల్ని విమర్శించే సాహసం ఎందుకు చేస్తాను. మీ కధ లో ని భావం (Time & Tide waits for None) నచ్చి ఉదహరించాను.
నాలక్ష్యం ఆ పోస్టు మొదటి పేరాలో సుస్పష్టంగా రాసినప్పటికీ, మీరు ఇంతగా అపార్ధం చేసుకున్నారు అంటే నేను నా భావాలను వ్యక్త పరచటంలో ఫెయిలయ్యాననిపిస్తోంది. చెప్పాను కదా నేను రచయితని కానని నా వివరణ చూసిన తరువాత కూడా మీరు అదే ఉద్దేశ్యంతో ఉంటే మనః స్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను.
నా మొదటి పేరాలో నే మిమ్మల్ని శాంతింప చేయడమే నా ప్రయత్నము అని స్పష్ఠంగా చెప్పాను. మీకు సుద్దులు చెప్పాలనే సంకల్సము నాకు ఎ కోశానా లేదు మరియు అంతటి అనుభవము లేదు.
సమాచారం తీసుకున్నవారు ఆ విష యాన్ని వ్యక్తపరచడం సభ్యత అని వ్రాశాను. వ్యక్త పరచలేదంటే సభ్యత సంస్కారములు లేని వారనే గా అర్ధం . అది తప్పు అని కూడా తెలుస్తోంది. కాని ఎదుటి వాడిని దూషించడం సభ్యత కాదనిపించి సూటిగా వ్రాయలేదు.
నా బ్లాగులో చిల్లి ముంత కూడా లేదు ఎత్తుకు పోవడానికి అని పరిహసమాడారు మీరే. దీని బట్టి మీ బ్లాగులో మంచి విషయం ఉందనే కదా అర్దం. అందుకు మీరు గర్వపడాలి కదా. నేను వ్రాసినది కూడా అదే కదా. ఆఖరుకు ఎమీ లేని నా బ్లాగులోని కంటెంట్ కూడా అపహరణకు గురైంది. తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ఒక ఛానెల్ రానుంది అనే సమాచారం. ఆ కంటెంట్ ని వెబ్సైట్ (బ్లాగు కాదు) లో యధాతధంగా (కాపి పేస్టు) ఉంచారు.
ఇక నా బ్లాగు విషయానికొస్తే నేను రచయితను కాను. మంచి విషయాలు తెలుసుకోవడానికి బ్లాగులు చదుపు తుంటాను నాకు తెలిసిన కొత్త విషయాలు అందరితో పంచుకుందామనే ఉద్దేశ్యంతో నాకు చేతనైనంత వీలైనప్పడు రాస్తున్నాను. అప్పుడప్పుడు నా ఆక్రోశం వెళ్ల గక్కడానికి కూడా రాస్తుంటాను. బ్లాగింగు నా ప్రొఫెషను కాదు, హబీ మాత్రమే.
తప్పు ఎప్పుడూ తప్పే అందులో సందేహం లేదు. తప్ప చేసినవాడి కి ఎప్పుడూ అపరాధభావం ఉంటుంది. ధైర్యంగా ముందుకు రాలేడు. చౌర్యం అనేది తప్పే. అందులో రెండవ వాదన లేదు. తప్పచేసినవాడిని ఎవరూ అభినందించరు. వాడి ఎదుట ఎమీ చేయలేక పోయినా మనస్సులో మాత్రం వ్యతిరేకత ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నా పోస్టులో నేను తప్పు చేసిన వాడిని సమర్ధించ లేదు. చౌర్యం అనేది సహజం అని వ్యక్తపరిచాను (సిని పరిశ్రమ చౌర్యాన్ని గురించి ప్రస్తావించి) మిమ్మల్ని పాసిఫై చేయాలనే ఉద్దేశ్యంతో. ఫలానా బ్లాగరు కాపీ చేస్తాడు అని తెలిస్తే ఎవరు ఆ బ్లాగును చూడడానికి కూడా ఇష్టపడరు. మీరు ఆ బ్లాగుల వివరాలు ఆధారాలతో సహ ఈ రోజు ప్రకటించి మంచి పని చేశారు. మచ్చుకు ఒకటి చూశాను. దిగ్ర్బాంతి చెందాను అనడంలో సందేహ లేదు. ఇప్పటి వరకు స్పూర్తిగా తీసుకున్నాం అంటుంటారు కదా అలా నేమో అనుకున్నాను. మక్కి కి మక్కి అంటే మనసెలా ఒప్పిందో మరి.
కోడి కుంపటి కధ ద్వారా నన్ను నేనే విమర్శించున్నాను అన్నారు. ముందే చెప్పాను నేను మిమ్మల్ని శాంతింప చేయడాని కి వ్రాస్తు మిమ్మల్ని విమర్శించే సాహసం ఎందుకు చేస్తాను. మీ కధ లో ని భావం (Time & Tide waits for None) నచ్చి ఉదహరించాను.
నాలక్ష్యం ఆ పోస్టు మొదటి పేరాలో సుస్పష్టంగా రాసినప్పటికీ, మీరు ఇంతగా అపార్ధం చేసుకున్నారు అంటే నేను నా భావాలను వ్యక్త పరచటంలో ఫెయిలయ్యాననిపిస్తోంది. చెప్పాను కదా నేను రచయితని కానని నా వివరణ చూసిన తరువాత కూడా మీరు అదే ఉద్దేశ్యంతో ఉంటే మనః స్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను.
Sunday, September 14, 2014
బ్లాగుల్లో పోస్టు లకి కామెంట్లు ఎందుకు రావట్లేదు ?
మొన్న బ్లాగిల్లు వారి బ్లాగులో కామెంట్లు చేయండి బ్లాగులను బతికించండి అని ఒక పోస్టు చూశాను. అది చదివిన తరువాత నా మదిలో మెదిలిన విషయాలు మీ తో పంచుకుందామని ఈ పోస్టు. కామెంట్లు (మంచి వి మరియు అర్ధవంతమైనవి) బ్లాగు రాసేవారికి టానిక్ లాంటివి. అవి ఎంతో ప్రేరణ నిస్తాయనడంలో ఎటు వంటి సందేహం లేదు. అదే సమయంలో అవాంఛిత కామెంట్లు మనస్సు నొప్పిస్తాయి. కాని కామెంటు, కామెంటు చేసే వారి వ్యక్తిక్త్వాన్ని బయడ పెటుతుంది. పిచ్చి కామెంటు చేస్తే అది బ్లాగు రాసే వారి మనస్సునొప్పించినా చూసే వారికి మాత్రం ఖచ్చితంగా కామెంటు చేసిన వారి తెంపరితనం లేక వారి కుత్సిత స్వభావామే కనబడుతుంది, కాబట్టి బ్లాగు రాసేవారు అటు వంటి కామెంట్లను పెద్దగ పట్టించుకోనవసరం లేదు అని నా భావన. సరే ఇక కామెంట్ల విషయానికొస్తే, కామెంట్లు చేయకపోవడానికి నాకు ఈ క్రింది కారణాలు కనిపిస్తున్నాయి.
- సమయా భావం . చాలా మంది చదువరులు తమకున్న తక్కువ సమయంలో కొన్ని ముఖ్యము లేక ఆసక్తి కలిగిన బ్లాగులు ఎంచుకుని చదువు తుంటారు. అంతే గాక కొన్ని బ్లాగులలో సమాచారం/విషయం చాలా పెద్దదిగా ఉంటే బ్లాగు కూడా పూర్తి గా చదువరు. అటువంటి వారు కామెంట్లు చేయురు.
- కొన్ని బ్లాగులలో ని విషయం కామెంటు చేసేలా ఉండక పోవడం . ఉదాహరణకు, Good English, Punch pataka బ్లాగులలో కామెంట్ల అవసరం ఉండదు.
- బ్లాగులలో విషయం ఒక వర్గం, ప్రాంతం, కులం, మతం లేదా జాతి వారికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఉండటం .
- బ్లాగులోని సమాచారం సమస్యాత్మకమయితే (సైబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఉంటే) కామెంట్ చేయడానికి వెనుకాడతారు.
- భాషాపరమయిన సమస్య - కామెంటు తెలుగులో చేద్దామని పిస్తుంది, కాని మనం చూసే పి.సి లో తెలుగు సాఫ్ట్ వేర్ అందుబాటులో లేక పోవడం.
- తెలుగు సాఫ్ట్ వేర్ ఉన్నా తెలుగులో టైపు చేయడం కష్టమనిపించడం .
- కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వ వలసి రావడం .
- అజ్ఞాత గా కామెంట్ చేసే అవకాశం లేకపోవడం .
- మన కామెంటుకి విలువ ఉండదని భావించినపుడు.
- మన కామెంటు మోడరేషన్ కి గురి అవుతుందని భావించినపుడు.
- మన కామెంటు వాస్తవమయినప్పటికీ అది ఎదుటివారిని బాధిస్తుందని భావించినపుడు.
- కొన్ని బ్లాగులలో మొత్తానికి కామెంట్లు డిసేబుల్ చేసి ఉండడం .
స్ధూలంగా నాకు కనిపించిన కొన్ని కారణాలు. ఇంకా చాలానే ఉండి ఉండవచ్చు. అయితే ఎతా వాతా చెప్పోచ్చేది ఎమిటంటే కామెంట్ చేసే వారు బ్లాగు రాసే వారు ఇద్దరూ కూడా పరస్పర గౌరవాలకు భంగం వాటిల్ల కుండా చూసుకుంటే కామెంట్లు పెరుగుతాయి. బ్లాగులు కూడా మూడు పోస్టులు ఆరు కామెంట్లగా వర్ధిల్లుతాయి.
Friday, September 12, 2014
హమ్మయ్య మా ఊరి పేరు చెప్పుకునే అవకాశం వచ్చింది
హమ్మయ్య మా ఊరి పేరు చెప్పుకునే అవకాశం వచ్చింది. మాది ఏలూరు, నాకు చిన్నప్పటి నుంచి ఒక అసంతృప్తి ఉండేది. అదేమిటి అంటే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైనప్పటికిని మా ఊరి పేరు పెద్దగా వార్తలలో కనిపించేది కాదు. కనీసం న్యూస్ పేపరులో వాతావరణం కాలమ్ లోనైనా కనిపించేది కాదు. ఎందుకో ఏలూరు లో ఉష్ణోగ్రత ఏ పేపరులో నూ కనిపించదు. చాళుక్యులు ఏలూరు కు దగ్గరలోని పెదవేగి ని రాజధాని గా చేసుకుని పరిపాలించారు అని చరిత్ర చెబుతోంది. ఏలూరు లో సి ఆర్ ఆర్ కళాశాలలో నే మన సూపర్ స్టార్ కృష్ణ చదువు కున్నాడు. ఏలూరు ను ఆనుకుని ఉన్న చేటపర్రు గ్రామంనుంచి సిల్క్ స్మిత మరియు మురళీ మెాహన్ వంటి వారు సిని రంగంలో ఒక వెలుగు వెలిగారు. ఏలూరు కు 40 కి మీ దూరంలో నున్న ద్వారాకా తిరుమల చిన్న తరుపతి గా ప్రఖ్యాతి చెందింది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరిన్ని నా తదుపరి టపాలలో పొందు పరుస్తాను. ఇంతకీ విషయమేమిటి అంటే ఏలూరు లో పుట్టిన ఒక యువకుడు సిని కధానాయకుడు గా ఎదిగాడు. ఈ వార్త విన్న నాటినుంచి భలే సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మీతో పంచుకో వాలనే ఈ చిరు ప్రయత్నం . ఇంతకీ ఎవరా కధానాయుకుడు అనుకుంటున్నారా? ఊహలు గుస గుస లాడే ఫేమ్ నాగ శౌర్య . అతనికి మరిన్ని అవకాశాలొచ్చి మంచి కధానాయకుడుగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ .....
శ్రీనగర్ లో పది రోజుల పాటు ఉచిత (లోకల్ & యస్ టి డి) కాల్స్
జమ్ము & కాశ్మీర్ వరదలలో చిక్కుకున్న బి యస్ యన్ ఎల్ వినియోగ దారులకు తన వంతు సహయంగా బి యస్ యన్ ఎల్ శ్రీనగర్ వాసులకు పది రోజుల పాటు ఉచిత కాల్స్ (లోకల్ & యస్ టి డి) మరియు ఎస్ ఎమ్ ఎస్ ల ను అందిస్తోంది.
మరింత సమాచారం కోసం క్రింది లింక్ ను నొక్కండి.
ఇక్కడ నొక్కండి
మరింత సమాచారం కోసం క్రింది లింక్ ను నొక్కండి.
ఇక్కడ నొక్కండి
ఏది స్వదేశీ ఏది విదేశీ ?
ఈ మధ్య సోషల్ నెట్ వర్క్ లలో ఒక విషయం చాలా ప్రచారం జరుగుతోంది. అది ఎమిటంటే స్వదేశీ వస్తువు లే కొనండి, దాని వలన మూడు మాసాలలో మన రూపాయి విలువ డాలర్ ను మించి పోతుంది అని. నిజంగా అలా జరిగే అవకాశం వుందా? దాని వెనుక ఉన్న లాజిక్ ఎమిటి? పెట్రోలియం ఉత్పత్తులు కొనడం తగ్గించండి అంటే అర్ధం ఉంది. ఎందుకంటే మనం పెట్రోలియం ఉత్పత్తులకై ఎక్కువగా దిగుమతుల మీద ఆధార పడి ఉన్నాము. దిగుమతులు ఎక్కువైతే అంతర్జాతీయ ద్రవ్యనిది నిలవలు తగ్గపోతాయి ప్రభుత్వం మీద సబ్సిడీ భారం పెరిగిపోతుంది. విదేశీ వస్తువులు అంటున్నాం కాని మనం కొనేవన్నీ (చాలా మటుకు) విదేశీ కంపెనీల చేత మనదేశంలో తయారయినవే. మనదేశంలో తయారు చేస్తున్నారు కాబట్టి ఆ యా ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అంతే కాక మన ప్రభుత్వానికి పన్నులు మరియ లైసెన్సు ఫీజులు కూడా చెల్లిస్తున్నారు. మరి మనం ఎరకంగా నష్టపోతున్నాము. దీని వలన మన ప్రాంతీయ వస్తువుల ప్రాభావన్ని కోల్పోతున్నాం . మరియు ఆ యా కళలమీద ఆధార పడి బతికే వారు తమ బతుకు తెరవు కోల్పో తున్నారు. ఉదాహరణకు చేనేత, హస్తకళలు మొదలైనవి. కానీ డాలర్ విలువను మించిపోయేంతగా ఎం జరుగుతుందో తెలియట్లేదు. మీకే మైన తెలిస్తే కాస్త చెబుదురు. ఎదేమైనా స్వదేశీ అభిమాన పరంగా చూస్తే ఆది ఖచ్చితంగా ఆచరణీయమే. మరిక మొదలు పెట్టండి స్వదేశీ వస్తువులు వాడకం. స్వదేశీ వస్తువు లేవి విదేశీ వస్తువు లేవో తెలియడం లేదు కదా. అందుకే స్వదేశీ విదేశీ వస్తువుల జాబితాను క్రింద ఇచ్చాను. ఈ జాబితా నాకు ఒక మీటింగ్ లో దొరికింది, ఇతర వివరములు తెలియరాలేదు.
Thursday, September 11, 2014
భళా బి యస్ యన్ ఎల్ ..
పకృతి విపత్తు బారిన పడిన కాశ్మీర్ కు బాసట గా నిలిచింది బి యస్ యన్ ఎల్. టెలికామ్ సర్వీసులను మొదటిగా పునరుద్ధరించి వరద బాధితులకు తన వంతు సహయం చేసింది. అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు. పూర్తి సమచారం కోసం క్రింది లింక్ ని నొక్కండి.
కాశ్మీర్ లో మొదటగా బి యస్ యన్ ఎల్ సర్వీసులు పునరుద్ధరణ.
కాశ్మీర్ లో మొదటగా బి యస్ యన్ ఎల్ సర్వీసులు పునరుద్ధరణ.
తెర వెనుక ......
సుమారు గత మూడు మాసములుగా టివి9 మరియు ఆంధ్రాజ్యోతి ఛానెల్ ల ప్రసారాలు తెలంగాణా రాష్ట్రంలో ఎంఎస్ వో లు నిలుపుదల చేశారు మాకేం తెలీదు అంటూ వచ్చారు. కాని దానివెనుక ఉన్నదెవరో నిన్న కెసిఆర్ కామెంట్ తర్వాత సుస్పష్ఠంగా ప్రపంచానికి తెలిసింది. కెసిఅర్ ఇంకా విజయం పొందిన కిక్ లోనే ఉన్నట్లున్నారు. అందుకే ఆయన కాళ్లు భూమి మీద నిలవడం లేదు. కాని కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదన్నది జగమెరిగిన సత్యం . ఒడలు బళ్లు కావడం కూడా మనకెరుకే. టివి9 మరియు ఆంధ్రజ్యోతి వారు క్షమాపణలు చెప్పిన తరువాత కూడా స్పందించడం లేదంటే తెగేవరకూ లాగుతున్నారనిపిస్తోంది.
దానిని పక్కన బెడితే, మన దేశం ఒక అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకుంటున్నాం . అయితే మరి ఇంత నియంతలా ప్రవర్తిస్తున్న అది కెసిఆర్ కావచ్చు లేక ఎం ఎస్ ఒో లు కావచ్చు, వారిని అదుపు చేసే యంత్రాంగమేమీ లేదా లేక ఉన్నా చేతులు ముడుచుకుని కూర్చున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఎందుకంటే మాకు నచ్చిన ఛానెల్స్ మాత్రమే ప్రసారం చేస్తాం అంటే ఇంకా ప్రజాస్వామ్యమెక్కడ? మనకి వ్యతిరేకంగా మాట్లడితే అంతే గతి అంటే ఎలా? అంటే మన ప్రజాస్వామ్యం ఒటి కుండేనా?
అది అలా ఉంటే జర్నలిష్టులు పోరాటం చేస్తుంటే మిగిలిన ఛానెల్స్ ఎందుకు మౌనం దాల్చుతున్నారో అర్దం కావడం లేదు. జాతీయ మీడియా కూడా స్పందించి ఈ వార్తలకు కవరేజి ఇస్తుంటే మన ప్రాంతీయ ఛానెల్స్ మాత్రం చోద్యం చూస్తున్నాయి. ఈ రోజు మీకేమి ఇబ్బంది లేక పోవచ్చు కాని ఇలాంటి నాయకులతో రేపు మీకు కూడా ఇదే సత్కారం అని మర్చిపోతున్నారు. వీరి మధ్య ఎప్పటిలాగా సామాన్య మానవుడే నష్ట పోతున్నాడు. ఛానెల్స్ చెప్పేదే వినాలి ఎం ఎస్ వో లు చూపించిన ఛానెల్స్ మాతృమే చూడాలి. హే భగవాన్ ఎందుకీ దుస్తితి.
Wednesday, September 10, 2014
శర్మగారి కాలక్షేపం కబుర్లు
ముందుగా శర్మగారి కి నమస్కారములు. నాకు శర్మగారు పరిచయం లేనప్పటికీ నేను కూడా బ్లాగులను చదువు తుంటాను కాబట్టి ఆయన బ్లాగు ద్వారా పరిచయమే. ప్రస్తుతం తెలుగు బ్లాగుల ప్రపంచంలో వేడి వేడి చర్చా విషయం శర్మగారు ఇక బ్లాగులు రాయను అని భీష్మించుకుని కూర్చోడమే అని అర్ధం అవుతోంది. బ్లాగు మితృలందరూ శర్మగారి ని శాంతింప చేసి వారి బ్లాగు ద్వారా మరింత రచనామృతాన్ని గ్రోలడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఇందులో నా వంతు కృషి గా బ్లాగు ముఖంగా శర్మగారికి విన్నపాలు.
శర్మగారి బ్లాగు లో శీర్షికలో శర్మ కాలక్షేపం కబుర్లు - (టాగ్ లైన్) అని విధిగా ఉంటుంది. అది సత్యం . రాసే వాళ్లు కొద్ధి మందే అయినా చదువరులు అనేక మంది. అందులో సింహభాగం కాలక్షేపం కోసం బ్లాగలు వీక్షిస్తుంటారు లేక చదువు తుంటారు. అలాగే బ్లాగులు ఒక వ్యాపకంగా రాసేవారున్నారు మరియు తమ దుగ్ధని తీర్చుకోడానికి రాసే వారున్నారు. తెలుగు బ్లాగును వ్యాపార లేక వాణిజ్య పరంగా నిర్వాహించేవారు చాలా తక్కువ. ఇక చౌర్యం విషయానికొస్తే చౌర్యం అనేది ఇప్పటి విషయం కాదు, బహుశా మనిషి పుట్టుకతోనే ఇది కూడా మొదలయి ఉంటుందని నా భావన. కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలు చౌర్యనికి గురై నిర్మాతలు ఎంత నష్టపోతున్నారో అందరికి తెలుసు. కాబట్టి చౌర్యనికి గురవుతోందని మీరు బ్లాగు రాయడం మానేస్తే మాత్రం మీ అభిమానులే కాదు చాలా మంది చాలా మంచి విషయాలను లేదా చాలా ఆనందాన్ని మిస్పవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మీరు బ్లాగును వ్యాపార దృష్టి తో రాయనపుడు మీరు అంతగా బాధ పడనవసరం లేదు. ఇక పేరు ప్రఖ్యాతలంటారా అవి ఇప్పటికే మీవశం . అంతేగాక మీలాంటి పరిణితి చెందిన వారు ప్రఖ్యాతలకు పాకులాడే స్ధితి నుంచి దాటిపోయుంటారు అనుకుంటున్నాను. మీ బ్లాగు లోని సమాచారానాన్ని తీసుకుంటున్నారు అంటే మీరు చాలా గర్వపడల్సిన విషయం. ఇంకో విషయం చౌర్యం అనడం కంటే సమాచారాన్ని పంచుకుంటున్నారు అంటే సబబే మో అనిపిస్తోంది ఎందుకంటే అసలు అంతర్జాల భావనే సమాచార మార్పిడి. ఇక మీబ్లాగు నుండి సమాచారాన్ని తీసుకున్నవారు ఆ విషయాన్ని వ్యక్త పరచడం వారి సంస్కారం. మీ బ్లాగు నుండి సమాచారాన్ని మరికొంతమందికి పంచుతున్నారు అంటే మీ అక్షరాలు మరో కొంత మందికి ఉపయోగ పడతాయే కాని వృధా కాదు. సూటిగా సుత్తి లేకుండా (ఇంత రాసినతరువాత కూడా - టూ మచ్ కదా) చెప్పాలంటే మీరు కాలక్షేపం కోసం రాస్తున్నారు మేము కాలక్షేపం కోసం చదువు తున్నాము కాబట్టి మీరు కంటిన్యూ చేస్తే ధన్యులం లేదా మీరు చెప్పినట్లు ముసలమ్మ కోడి నిప్పు లాగా కాలం దేనికోసం అగదు. ఇది స్వస్ధి.
శర్మగారి బ్లాగు లో శీర్షికలో శర్మ కాలక్షేపం కబుర్లు - (టాగ్ లైన్) అని విధిగా ఉంటుంది. అది సత్యం . రాసే వాళ్లు కొద్ధి మందే అయినా చదువరులు అనేక మంది. అందులో సింహభాగం కాలక్షేపం కోసం బ్లాగలు వీక్షిస్తుంటారు లేక చదువు తుంటారు. అలాగే బ్లాగులు ఒక వ్యాపకంగా రాసేవారున్నారు మరియు తమ దుగ్ధని తీర్చుకోడానికి రాసే వారున్నారు. తెలుగు బ్లాగును వ్యాపార లేక వాణిజ్య పరంగా నిర్వాహించేవారు చాలా తక్కువ. ఇక చౌర్యం విషయానికొస్తే చౌర్యం అనేది ఇప్పటి విషయం కాదు, బహుశా మనిషి పుట్టుకతోనే ఇది కూడా మొదలయి ఉంటుందని నా భావన. కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలు చౌర్యనికి గురై నిర్మాతలు ఎంత నష్టపోతున్నారో అందరికి తెలుసు. కాబట్టి చౌర్యనికి గురవుతోందని మీరు బ్లాగు రాయడం మానేస్తే మాత్రం మీ అభిమానులే కాదు చాలా మంది చాలా మంచి విషయాలను లేదా చాలా ఆనందాన్ని మిస్పవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మీరు బ్లాగును వ్యాపార దృష్టి తో రాయనపుడు మీరు అంతగా బాధ పడనవసరం లేదు. ఇక పేరు ప్రఖ్యాతలంటారా అవి ఇప్పటికే మీవశం . అంతేగాక మీలాంటి పరిణితి చెందిన వారు ప్రఖ్యాతలకు పాకులాడే స్ధితి నుంచి దాటిపోయుంటారు అనుకుంటున్నాను. మీ బ్లాగు లోని సమాచారానాన్ని తీసుకుంటున్నారు అంటే మీరు చాలా గర్వపడల్సిన విషయం. ఇంకో విషయం చౌర్యం అనడం కంటే సమాచారాన్ని పంచుకుంటున్నారు అంటే సబబే మో అనిపిస్తోంది ఎందుకంటే అసలు అంతర్జాల భావనే సమాచార మార్పిడి. ఇక మీబ్లాగు నుండి సమాచారాన్ని తీసుకున్నవారు ఆ విషయాన్ని వ్యక్త పరచడం వారి సంస్కారం. మీ బ్లాగు నుండి సమాచారాన్ని మరికొంతమందికి పంచుతున్నారు అంటే మీ అక్షరాలు మరో కొంత మందికి ఉపయోగ పడతాయే కాని వృధా కాదు. సూటిగా సుత్తి లేకుండా (ఇంత రాసినతరువాత కూడా - టూ మచ్ కదా) చెప్పాలంటే మీరు కాలక్షేపం కోసం రాస్తున్నారు మేము కాలక్షేపం కోసం చదువు తున్నాము కాబట్టి మీరు కంటిన్యూ చేస్తే ధన్యులం లేదా మీరు చెప్పినట్లు ముసలమ్మ కోడి నిప్పు లాగా కాలం దేనికోసం అగదు. ఇది స్వస్ధి.
Sunday, September 7, 2014
ప్రపంచ క్షమాగుణ దినోత్సవం
నేడు ప్రపంచ క్షమాగుణ దినోత్సవం. ఒక రోజును ప్రపంచ క్షమాగుణ దినోత్సవం గా ప్రకటించారు అంటేనే క్షమాగుణాని కున్న ప్రాధాన్యం ఎమిటో తెలుస్తోంది. ఒక మనిషికి ఉండవలసిని మంచి లక్షణాలలో క్షమాగుణం ఒకటి. నిజంగా ఈ గుణం వలన లబ్ది పొందేది క్షమించేగుణం కలవారే. క్షమాగుణం కలవారు చాలా ప్రశాంత జీవితాన్ని గడుపుతారనడం లో ఎటువంటి సందేహం లేదు.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో నేను గొప్పవాడిని నేను చేసిందే కరెక్ట్ అనే అహంకార పూరిత ధోరణి ఎక్కువైపోంతోంది. దీనివలన ఎ చిన్న తప్పును కూడా తట్టుకోలేక చీటికి మాటికి కోపం ప్రదర్శిస్తుంటారు. తద్వారా మానశిక అశాంతికి గురవుతుంటారు. సహజంగా ఎదుటి వారి తప్పుల వలన లేక వాళ్ల వలన మనకు కలిగిన అసౌకర్యం వలన మనకు కోపం వస్తుంది వెంటనే అది ప్రదర్శిస్తాము. దీనిలో మన ఉద్దేశ్యము ఎదుటి వాడిని శిక్షించాలని కాని కోపం అనేది భస్మాసుర హస్తం లాంటిది. అది కోపం తెచ్చుకున్న వాళ్లనే దహించి వేస్తుంది. దీనికి విరుగుడే క్షమాగుణం . మనకి క్షమించ గలిగే మనస్సుంటే ఆ పరిస్తితిలో జరిగే నష్టం సగం తగ్గిపోతుంది. లేదంటే మనం కోపం ప్రదర్శిస్తే ఎదుటి వాడు వూరుకోడు కదా వెంటనే వాదన మొదలవు తుంది అది ఎంత వరకు వెళుతుందంటే మొన్ననే ఒక సంఘటన చూశాం . ఒక పాఠశాలలో చదుపుకునే ఇద్దరు విద్యార్ధుల మద్య తలెత్తిన వివాదం వారిద్దరి జీవితాలను కాలరాసింది. ఒకరు మరణిస్తే మరొకరు ఆ మరణానికి కారకుడై చెరసాల పాలై తన జీవితానికి చరమగీతం పాడుకున్నాడు.
ఉపసంహరంః క్షమించమన్నారు గా అని నీతి మాలిన దారుణాలకు, అకృత్యాలకు పాల్పడిన వారిని క్షమించి వదిలేయమని కాదు.
Saturday, September 6, 2014
ఎలా? ఎలా? ఎలా? కవి కావడమెలా?
తనికెళ్ల భరణి గారు ఒక ఛానెల్ ముఖా ముఖి కార్యక్రమంలో తెలుగు భాష ను గురించి చెబుతూ, పద్యము అనేది తెలుగు భాష సొంతం మరే భాష లోను లేనిది అని అన్నారు. అది విన్న తరువాత చాలా ఆనందం కలిగింది నేను కూడా తెలుగువాడిగా పుట్టినందుకు. నిజం చెప్పాలంటే కాస్త ఛాతీ ఉప్పొంగిన మాట వాస్తవం. అప్పటి నుండి నాలో ఎన్నో ఆలోచనలు. మన కవు లందరూ (నాకు తెలిసిన) కళ్లముందు మెదిలారు. వారందరూ కవులుగా ఎలా తయారయ్యారు. ఎం చదివారు. ఎక్కడ శిక్షణ తీసుకున్నారు. అసలు కవి కావడానికి అర్హతలేమిటి? గద్య, పద్య మరియు పాటల రచన అనే ప్రక్రియలలో గద్య రచన స్పష్ఠంగా తెలుస్తోంది. విషయ పరిజ్ఞానానికి భాషా పరిజ్ఞానం తోడైతే రచయిత కావచ్చు గద్య రచన చేయవచ్చు. మరి కవి కావడమెలా? అందరూ అంటుంటారు కవుల కు భావుకత ఎక్కువ అని కాని భావుకత ఉన్న వారందరూ కవులు కాలేరనేది జగమెరిగిన సత్యము. మరి కవి కావడాని ఎమైనా కోర్సులున్నయా? కోచింగ్ సెంటర్లున్నాయా? ఛందస్సు మరియు వ్యాకరణం నేర్చుకుంటే కవై పోవచ్చా? ఎలా? ఎలా? ఎలా? కవి కావడమెలా? మీకేమైనా తెలిస్తే కాస్త చెప్పరూ?
Friday, September 5, 2014
ఉపాధ్యాయ దినోత్సవం - విద్యార్ధులతో దేశ ప్రధాని మాటా మంతి
ఈ రోజు భారత దేశ చరిత్రలో మొదటి సారి ఒక ప్రధాని దేశ వ్యాప్తంగా ఉన్న భావి భారత పౌరులను ( విద్యార్ధులను) ఇంటరాక్టివ్ పద్ధతిలో సంభాషించటం నిజంగా అభినందనీయం . ఇది భావి భారత పౌరులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది మరియు వాళ్లలో ఎంతో ఉత్తేజాన్ని నింపుతుందనడం సందేహం లేదు. మన దేశ ప్రధాని ని దాదాపుగా ముఖతః మాట్లాడం ప్రశ్నించగలగడం మన so called Democracy లో నిజంగా ఒక కలే. మన నాయకులు ఎన్నికయే వరకు అరచేతిలో స్వర్గాన్ని ఆ తరువాత చుక్కల్ని చూపిస్తారు. పిల్లల్లో నేను మన దేశ ప్రధానితో మట్త్లాడాను అనే భావన ఎంతటి ఉత్సుకత నింపుతుందో వర్ణనాతీతం . మోదీ జీ ఎన్నికల ముందే కాదు ఎన్నికలై ప్రభుత్వాన్ని ఎర్పరిచిన తరువాత కూడా ప్రజలతో మమేక మవడాని కి చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం .
అంతే కాదు ఆయన ప్రసంగంలో అతి ముఖ్యమైన మరియు అత్యావశ్యక అంశాన్నికూడా ప్రస్తావించారు. అదే నేటి తరంలో ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న అనాసక్తి ని ఎత్తి చూపారు. మరి మోదీ గారు ఉపాధ్యాయ వృత్తి మీద నేటి యువత కు అసక్తి కలగడానికి ఎమైనా చర్యలు చేపడ తారేమో చూడాలి. ఉపాధ్యాయ వృత్తి మీద సమాజానికి ఉన్న దృక్ఫదం మారాలి. ప్రతీ దానిని డబ్బుతో బేరీజు వేసే సంస్కృతి పోవాలి. తమ జ్ఞానాన్ని పది మందికి పంచే పవిత్ర అధ్యాపక వృత్తి ని చేపట్టేలా నేటి తరాన్ని ప్రోత్సవాించాలి.
Tuesday, June 17, 2014
ఫిఫా - ప్రపంచ పుట్ బాల్ కప్ పోటీలు - 2014 - ఇండియా స్ధానం
బ్రెజిల్ లో ప్రపంచ పుట్ బాల్ టోర్నమెంట్ 2014 పోటీలు ఈ నెల 13 ప్రారంభమయ్యాయి. మ్యాచ లన్నీ రసవత్తరంగా జరుగుతూ నేత్రానందన్ని కలుగజేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాలు 8 జట్లుగా విడిపోయి ప్రపంచ కప్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచ పటంలో ఎన్నో చిన్న దేశాలు సయితం పోటీ పడుతున్నాయి కొన్ని దేశాల పేర్లు మనం (నేను) వినికూడా ఉండలేదు. ఆ 32 దేశాలని ప్రపంచ పటంలో గుర్తించమని మా పాప కు ఎసైన్ మెంట్ ఇచ్చాను. వెంటనే మాపాప అడిగింది ఇందులో మనదేశం లేదేమిటి అని?. అవును కదా! మరి మన దేశం సంగతి ఎమిటీ అన్న ఆలోచన వచ్చింది. మన దేశం పోటలకు అర్హత సాధించలేదు అని తెలుసు కాని అసలు ఎప్పుడైనా ప్రపంచ పుట్ బాల్ టోర్నీలో పోటీ పడిందాఅన్న సందేహం వచ్చింది. వెంటనే నెట్ లో వెతికాను. షాకింగ్, 1948 లో ఫిఫా గుర్తింపు పొందినప్పటి నుండి ఇంతవరకు ఇండియా ఫిఫా ప్రపంచ పుట్ బాల్ కప్ టోర్నీలలో అడలేదు. 1950వ సంవత్సరంలో ఒకసారి అవకాశం వచ్చినా పోటీలకు సన్నద్ధత లేకపోవడం. బ్రెజిల్ వెళ్లి పోటీలలో పాల్గొనడానికి ప్రయాణ ఖర్చులు లేకపోవడం వంటి కారణాలతో ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది. అప్పటినుండి 1982 వరకు కూడా మనదేశం ప్రపంచ కప్ పోటీలలో ఆడేందుకు కూడా ప్రయత్నించ లేదు. 1986 నుండి క్వాలిఫయింగ్ పోటీలలో పాల్లొంటోంది కాని అసలు పోటీలకు అర్హత సాధించలేదు. ఈ సారి 147 వ స్ధానంలో నిలిచింది. 2011 వరకు కనీసం ఫిఫా ప్రమాణాలకు తగ్గట్లుగా ఒక స్టేడియం కూడా లేని మన దేశం ప్రపంచ కప్ పోటీలలో ఎప్పుడు ఆడుతుందో మరి?
Saturday, June 14, 2014
అత్త తిట్టినందుకు కాదు తోడికోడల నవ్వినందుకు అన్నట్లు....
తెలంగాణా ఎమ్మెల్యే ల ప్రమాణ స్వీకారం మీద టివిల లో వచ్చిన ప్రసారాలమీద కెసిఆర్ ఫైర్ అవ్వడం చూస్తే అత్త తిట్టినందుకు కాదు తోడికోడల నవ్వినందుకు అన్నట్లుంది. కనీసం తమ మాతృ భాష తెలుగు కూడా సరిగా చదువ లేక పోయారు వీరు రేపు ముఖ్యమైన దస్త్రాల మీద సంతకాలు చేయవలసి ఉంటుంది. మరి అవి చదివి అర్ధం చేసు కుని పెడతారా లేక గత దేవుడి పాలనలో లాగా ముఖ్యమంత్రి చెప్పారని లేక ఆధికారులు చెప్పారని అంటారా అన్నది దేవుడి కెరుక. ప్రజా ప్రతినిధులు గా ఎన్నిక కాబడడానికి కనీస విద్యార్హత ఉంటే బాగుంటుంది.
Friday, March 21, 2014
ఎన్టీ ఆర్ తరువాత ఆ స్ధాయి మోహన్ బాబు దే?
రౌడి సినిమా ఆడియో ఫంక్షన్ లో దాసరి నారాయణ రాపు వ్యాఖ్య ఇది. ఎన్టీ అర్ అభిమానిగా నేను ఖండిస్తున్నాను? మరి మీరో ,,,,,,
Subscribe to:
Posts (Atom)