నేడు ప్రపంచ క్షమాగుణ దినోత్సవం. ఒక రోజును ప్రపంచ క్షమాగుణ దినోత్సవం గా ప్రకటించారు అంటేనే క్షమాగుణాని కున్న ప్రాధాన్యం ఎమిటో తెలుస్తోంది. ఒక మనిషికి ఉండవలసిని మంచి లక్షణాలలో క్షమాగుణం ఒకటి. నిజంగా ఈ గుణం వలన లబ్ది పొందేది క్షమించేగుణం కలవారే. క్షమాగుణం కలవారు చాలా ప్రశాంత జీవితాన్ని గడుపుతారనడం లో ఎటువంటి సందేహం లేదు.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో నేను గొప్పవాడిని నేను చేసిందే కరెక్ట్ అనే అహంకార పూరిత ధోరణి ఎక్కువైపోంతోంది. దీనివలన ఎ చిన్న తప్పును కూడా తట్టుకోలేక చీటికి మాటికి కోపం ప్రదర్శిస్తుంటారు. తద్వారా మానశిక అశాంతికి గురవుతుంటారు. సహజంగా ఎదుటి వారి తప్పుల వలన లేక వాళ్ల వలన మనకు కలిగిన అసౌకర్యం వలన మనకు కోపం వస్తుంది వెంటనే అది ప్రదర్శిస్తాము. దీనిలో మన ఉద్దేశ్యము ఎదుటి వాడిని శిక్షించాలని కాని కోపం అనేది భస్మాసుర హస్తం లాంటిది. అది కోపం తెచ్చుకున్న వాళ్లనే దహించి వేస్తుంది. దీనికి విరుగుడే క్షమాగుణం . మనకి క్షమించ గలిగే మనస్సుంటే ఆ పరిస్తితిలో జరిగే నష్టం సగం తగ్గిపోతుంది. లేదంటే మనం కోపం ప్రదర్శిస్తే ఎదుటి వాడు వూరుకోడు కదా వెంటనే వాదన మొదలవు తుంది అది ఎంత వరకు వెళుతుందంటే మొన్ననే ఒక సంఘటన చూశాం . ఒక పాఠశాలలో చదుపుకునే ఇద్దరు విద్యార్ధుల మద్య తలెత్తిన వివాదం వారిద్దరి జీవితాలను కాలరాసింది. ఒకరు మరణిస్తే మరొకరు ఆ మరణానికి కారకుడై చెరసాల పాలై తన జీవితానికి చరమగీతం పాడుకున్నాడు.
ఉపసంహరంః క్షమించమన్నారు గా అని నీతి మాలిన దారుణాలకు, అకృత్యాలకు పాల్పడిన వారిని క్షమించి వదిలేయమని కాదు.
No comments:
Post a Comment