Wednesday, December 10, 2014

గ్రేటెస్ట్ అన్లయిన్ షాపింగ్ ఫెస్టివల్ - ఎవరికీ పండుగ?

గూగుల్ మూడు రోజుల గ్రేటెస్ట్ అన్లయిన్ షాపింగ్ ఫెస్టివల్ ఈ రోజు ప్రారంభమయింది.  అయితే ఇక్కడ పండుగ ఎవరికి? అనే అనుమానం నాకు మొదలయింది.  ఆలోచించగా ఇది మనకి అనగా వినియోగదారులకు కాదు అమ్మకందారులకు పండుగ, తమ దగ్గర ఉన్న స్టాకును వదిలించుకోవడానికి భారీ తగ్గంపుల పేరుతో మనకి అవసరం లేకున్నా మనకి అంట కట్టే ప్రయత్నం లో చాలా కాలంగా సఫలం అవుతున్నారు అమ్మకందారులు. మనందరం పర్యావరణం మరియు కాలుష్యం దాని పర్యవసానాల మీద బాగా అవగాహన ఉన్నవాళ్లం.  ఇప్పుడీ విషయం ఎందుకంటారా?  ఎందుకంటే పర్యావరణ పరిరక్షణకు ముఖ్యంగా మూడు R ల సూత్రం ప్రతిపాదించారు మరియు దీనిని గో గ్రీన్ అనే ఉద్యమంగా మలిచారు కూడాను  మన ప్రపంచ పర్యావరణ వేత్తలు.  అవి ఎమిటంటే REDUCE, REUSE & RECYCLE.  వీటిలో మొదటిది చాలా ముఖ్యమైంది i.e. Reduce అంటే "Reduce your consumption". అంటే మన వస్తు వినియోగాన్ని తగ్గంచుకోమని.  ఇంతకు ముందు తరంతో పోలిస్తే ప్రస్తుత తరం యెక్క కొనుగోలు శక్తి పెరగడం కానివ్వండి కొత్త కొత్త వస్తూత్పత్తి అనండి ఎమైనా కాని అవసరానికి మించి కొనేస్తున్నాము అన్నది నిజం.  ఇంతకు ముందు తరం వారు ఒక వస్తువు ను అవసరమైతే తప్ప కొనుగోలు చేసేవారు కాదు.  అంటే Need basis మీద కోనుగోలు చేసేవారు.  కాని ప్రస్తుత కాలంలో ఫాషన్ కోసం, గొప్పకోసం లేక ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయని కొనుగోలు చేస్తున్నాము.  అంటే మనకి అవసరం ఉన్నా లేకున్నా అనవసర వస్తూత్పత్తి కి కారణమవు తున్నాము.  మనం ఎంతగా కొనుగోలు జరిపితే అంతగా వస్తూత్పత్తి జరుగుతుంది అలాగే మనం వాడి పాడేసే వస్తువుల ద్వారా అంతగా కాలుష్యాం పెరగడానికి కారణమవుతున్నాము.  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంట్లో కొన్ని వందల జతల చెప్పులు దొరికాయంటే  అప్పుడు చాలా ఆశ్చర్య పోయాను.  కాని అలాంటి జయలలితల్ని ఇప్పుడు చాలా మందిని మనం చూస్తు న్నాము.  మనకి డబ్బు ఉంది కొనుగోలు చేస్తున్నాము అనుకుంటున్నాము కాని మన భావితరాలకి ఎంత చేటు చేస్తున్నామో గమనించడం లేదు.    వస్తువులు కొనుగోలు చేసేముందు కాస్త ఆలోచించండి.  నిజంగా అవసరమై కొంటున్నామా? లేదా? అలాగే మనం కొనే వస్తువులు పర్యావరణ హితమైనవా కాదా? వాటిని రీ సైకిల్ చేయగలమా? లేదా? మొదలయిన విషయాలు పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం .  భావితరాలకోసం మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం . గో గ్రీన్ .

4 comments:

  1. ఇవే కాదు సౌందర్య లేపనాల వాడకం కూడా తగ్గించమని అడగండి!

    ReplyDelete
    Replies
    1. ఈ లిస్ట్ ఆనంతమయింది. పై వస్తువులు వుదాహరణకు మాత్రమే నని మనవి

      Delete