Wednesday, September 10, 2014

శర్మగారి కాలక్షేపం కబుర్లు

ముందుగా శర్మగారి కి నమస్కారములు.  నాకు శర్మగారు పరిచయం లేనప్పటికీ నేను కూడా బ్లాగులను చదువు తుంటాను కాబట్టి ఆయన బ్లాగు ద్వారా పరిచయమే.  ప్రస్తుతం  తెలుగు బ్లాగుల ప్రపంచంలో వేడి వేడి చర్చా విషయం శర్మగారు ఇక బ్లాగులు రాయను అని భీష్మించుకుని కూర్చోడమే అని అర్ధం అవుతోంది.  బ్లాగు మితృలందరూ శర్మగారి ని శాంతింప చేసి వారి బ్లాగు ద్వారా మరింత రచనామృతాన్ని గ్రోలడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.  ఇందులో నా వంతు కృషి గా బ్లాగు ముఖంగా శర్మగారికి విన్నపాలు.

శర్మగారి బ్లాగు లో శీర్షికలో శర్మ కాలక్షేపం కబుర్లు - (టాగ్ లైన్) అని విధిగా ఉంటుంది.  అది సత్యం .  రాసే వాళ్లు కొద్ధి మందే అయినా చదువరులు అనేక మంది.  అందులో సింహభాగం కాలక్షేపం కోసం బ్లాగలు వీక్షిస్తుంటారు లేక చదువు తుంటారు.  అలాగే బ్లాగులు ఒక వ్యాపకంగా రాసేవారున్నారు మరియు తమ దుగ్ధని తీర్చుకోడానికి రాసే వారున్నారు. తెలుగు బ్లాగును  వ్యాపార లేక వాణిజ్య పరంగా నిర్వాహించేవారు చాలా తక్కువ.  ఇక చౌర్యం విషయానికొస్తే చౌర్యం అనేది ఇప్పటి విషయం కాదు, బహుశా మనిషి పుట్టుకతోనే ఇది కూడా మొదలయి ఉంటుందని నా భావన.  కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలు చౌర్యనికి గురై నిర్మాతలు ఎంత నష్టపోతున్నారో అందరికి తెలుసు.   కాబట్టి చౌర్యనికి గురవుతోందని మీరు బ్లాగు రాయడం మానేస్తే మాత్రం మీ అభిమానులే కాదు చాలా మంది చాలా మంచి విషయాలను లేదా చాలా ఆనందాన్ని మిస్పవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.  ముఖ్యంగా మీరు బ్లాగును వ్యాపార దృష్టి తో రాయనపుడు మీరు అంతగా బాధ పడనవసరం లేదు.  ఇక పేరు ప్రఖ్యాతలంటారా అవి ఇప్పటికే మీవశం .   అంతేగాక మీలాంటి పరిణితి చెందిన వారు ప్రఖ్యాతలకు పాకులాడే స్ధితి నుంచి దాటిపోయుంటారు అనుకుంటున్నాను.  మీ బ్లాగు లోని సమాచారానాన్ని తీసుకుంటున్నారు అంటే మీరు చాలా గర్వపడల్సిన విషయం.  ఇంకో విషయం చౌర్యం అనడం కంటే సమాచారాన్ని పంచుకుంటున్నారు అంటే సబబే మో అనిపిస్తోంది ఎందుకంటే అసలు అంతర్జాల భావనే సమాచార మార్పిడి.  ఇక మీబ్లాగు నుండి సమాచారాన్ని తీసుకున్నవారు ఆ విషయాన్ని వ్యక్త పరచడం వారి సంస్కారం.  మీ బ్లాగు నుండి సమాచారాన్ని మరికొంతమందికి పంచుతున్నారు అంటే మీ అక్షరాలు మరో కొంత మందికి ఉపయోగ పడతాయే కాని వృధా కాదు.   సూటిగా సుత్తి లేకుండా (ఇంత రాసినతరువాత కూడా - టూ మచ్ కదా) చెప్పాలంటే మీరు కాలక్షేపం కోసం రాస్తున్నారు మేము కాలక్షేపం కోసం చదువు తున్నాము కాబట్టి మీరు కంటిన్యూ చేస్తే ధన్యులం లేదా మీరు చెప్పినట్లు ముసలమ్మ కోడి నిప్పు లాగా కాలం దేనికోసం అగదు. ఇది స్వస్ధి.

4 comments:

  1. బాగా వ్రాసారు. అభినందనలు. మీరే చెప్పారు కదా ఒక బ్లాగు నుండి సమాచారాన్ని తీసుకున్నవారు ఆ విషయాన్ని వ్యక్త పరచడం వారి సంస్కారం." అనిపించుకుంటుంది అని. మరి చెప్పకుండా తీసుకోవటం తస్కరణే కదా? అది సమాచారం ఇతరులతో పంచుకోవటం అని వారన్నా అది సమంజసమైన మాట కాదు. పేర్లెందుకు కానీయండి, ఒక మహాతల్లి నాలుదైదురోజుల్లో అక్షరాలా రెండువందల ఎనభైయ్యేడు టపాలను అంతర్జాలంలో ఇతరులనుండి దొంగిలించి తన ఖాతాలో వేసుకుంది. ఇదెటువంటి పని? అలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారండి. వీళ్ళ దొంగపోష్టులకు భళీ అన్నవారు మోసపోతున్నారా లేదా? దొంగలకు పంచటం కోసం ఏదీ ఎవరూ ఉత్పత్తి చేయరు కదా? శర్మగారు పేరుకోసం ప్రాకులాడటం లేదని అందరకూ తెలుసు - ఆయన దొంగలను మేపటం ఇష్టంలేక, దొంగలని నిరోధించే స్థితిలో బ్లాగుప్రపంచం లేక నిరాశపడి తప్పుకుంటున్నారని అనుకుంటున్నాను. ఆయనకు వ్యాపారదృష్టి లేకపోయినా, ఆయన తన చదువరులనుండి నిజాయితీని ఆశించటం తప్పుకాదనుకుంటాను. మీరన్నట్లు కాలం ఎవ్వరికోసమూ ఆగదు ఈ రోజున శర్మగారి కోసమూ ఆగదు, రేపు శ్యామలీయం కోసమూ ఆగదు. కాని సంస్కారం అలవరచుకోని సమాజం మాత్రం ఒకరోజున నిస్తేజంగా ఆగిపోతుంది. అది అంతర్జాలానికీ అందులోని బ్లాగులకూ మరొకదానికీ మరొకదానికీ కూడా వర్తిస్తుంది. అటువంటి దుస్థితి రాకూడదనే మాబోటి వారి ఆదుర్దా. స్వస్తిరస్తు.

    ReplyDelete
  2. దొంగ లించు కుని పోయినారు అంటారు కానీ అదెవరో వారెవరో వారి లిస్టులు బయట పెట్టరేమిటిస్మీ !!

    శర్మ గారు,

    మీరు ఎప్పటి లా టపాలు రాస్తూ ఉండాలి .

    శ్యామలీయం గారు,

    మీరు చెప్పింది సబబైన విషయం . కాని ఆ లిష్టులు పబ్లిష్ చెయ్యడం అవసరం సో అందరికి పొలో మని ఆ బ్లాగు దారుల మీద దాడులు చెయ్యడం సౌలభ్యం అగును !

    జిలేబి


    ReplyDelete
  3. బ్లాగిల్లు శ్రీనివాస్September 10, 2014 at 8:33 AM

    జిలేబి గారూ ! మీకు తెలీదా వారెవరో ! బయటపెట్టకపోవడం ఆయన గొప్పతనం .. అయినా ఆ లిస్టు నమ్మిన కొందరికి పంచారుగా ...

    ReplyDelete