Monday, September 15, 2014

"శర్మగారి బ్లాగు లో చోరి" - టపా లోని విషయం గూర్చి

"శర్మగారి బ్లాగు లో చోరి" టపా చదివిన తరువాత, నా బ్లాగులో "శర్మగారు ఇక బ్లాగులు రాయను" అని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించడానికి తోటి బ్లాగర్లు చేస్తున్న ప్రయత్నాలు చూసి నా వంతు కర్తవ్యంగా ఆయన్ని శాంతిప జేయాలనే సదుద్దేశంతో నేను ఈ నెల 10 వ తేదీన వ్రాసిన టపా ( ఇక్కడ నొక్కండి) ఆయనను శాంతింప చేయక పోగా మరింత ఆగ్రహం కలిగించింది అని భావించి ఆ టపా యిెక్క ఉద్దేశ్యము తెలుపుతూ వివరణ (వాదన కాదు).

నా మొదటి పేరాలో నే మిమ్మల్ని శాంతింప చేయడమే నా ప్రయత్నము అని స్పష్ఠంగా చెప్పాను.  మీకు సుద్దులు చెప్పాలనే సంకల్సము నాకు ఎ కోశానా లేదు మరియు అంతటి అనుభవము లేదు. 

సమాచారం తీసుకున్నవారు ఆ విష యాన్ని వ్యక్తపరచడం సభ్యత అని వ్రాశాను.   వ్యక్త పరచలేదంటే సభ్యత సంస్కారములు లేని వారనే గా అర్ధం .  అది తప్పు అని కూడా తెలుస్తోంది.  కాని ఎదుటి వాడిని దూషించడం సభ్యత కాదనిపించి సూటిగా వ్రాయలేదు.  

నా బ్లాగులో చిల్లి ముంత కూడా లేదు ఎత్తుకు పోవడానికి అని పరిహసమాడారు మీరే.  దీని బట్టి మీ బ్లాగులో మంచి విషయం ఉందనే కదా అర్దం.  అందుకు మీరు గర్వపడాలి కదా.  నేను వ్రాసినది కూడా అదే కదా.  ఆఖరుకు ఎమీ లేని నా బ్లాగులోని కంటెంట్ కూడా అపహరణకు గురైంది.  తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ఒక ఛానెల్ రానుంది అనే సమాచారం.  ఆ కంటెంట్ ని వెబ్సైట్ (బ్లాగు కాదు) లో యధాతధంగా (కాపి పేస్టు) ఉంచారు.    

ఇక నా బ్లాగు విషయానికొస్తే నేను రచయితను కాను.  మంచి విషయాలు తెలుసుకోవడానికి బ్లాగులు చదుపు తుంటాను నాకు తెలిసిన కొత్త విషయాలు అందరితో పంచుకుందామనే ఉద్దేశ్యంతో నాకు చేతనైనంత వీలైనప్పడు రాస్తున్నాను. అప్పుడప్పుడు నా ఆక్రోశం వెళ్ల గక్కడానికి కూడా రాస్తుంటాను.  బ్లాగింగు నా ప్రొఫెషను కాదు, హబీ మాత్రమే.  

తప్పు ఎప్పుడూ తప్పే అందులో సందేహం లేదు.  తప్ప చేసినవాడి కి ఎప్పుడూ అపరాధభావం ఉంటుంది.  ధైర్యంగా ముందుకు రాలేడు.   చౌర్యం అనేది తప్పే. అందులో రెండవ వాదన లేదు. తప్పచేసినవాడిని ఎవరూ అభినందించరు.  వాడి ఎదుట ఎమీ చేయలేక పోయినా మనస్సులో మాత్రం వ్యతిరేకత ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.  నా పోస్టులో  నేను తప్పు చేసిన వాడిని సమర్ధించ లేదు.  చౌర్యం అనేది సహజం అని వ్యక్తపరిచాను (సిని పరిశ్రమ చౌర్యాన్ని గురించి ప్రస్తావించి) మిమ్మల్ని పాసిఫై చేయాలనే ఉద్దేశ్యంతో.  ఫలానా బ్లాగరు కాపీ చేస్తాడు అని తెలిస్తే ఎవరు ఆ బ్లాగును చూడడానికి కూడా ఇష్టపడరు.  మీరు ఆ బ్లాగుల వివరాలు ఆధారాలతో సహ  ఈ రోజు ప్రకటించి మంచి పని చేశారు.  మచ్చుకు ఒకటి చూశాను.  దిగ్ర్బాంతి చెందాను అనడంలో సందేహ లేదు.  ఇప్పటి వరకు స్పూర్తిగా తీసుకున్నాం అంటుంటారు కదా అలా నేమో అనుకున్నాను.  మక్కి కి మక్కి అంటే మనసెలా ఒప్పిందో మరి.  

కోడి కుంపటి కధ ద్వారా నన్ను నేనే విమర్శించున్నాను అన్నారు.  ముందే చెప్పాను నేను మిమ్మల్ని శాంతింప చేయడాని కి వ్రాస్తు మిమ్మల్ని విమర్శించే సాహసం ఎందుకు చేస్తాను.  మీ కధ లో ని భావం (Time & Tide waits for None) నచ్చి ఉదహరించాను.  

నాలక్ష్యం ఆ పోస్టు మొదటి పేరాలో సుస్పష్టంగా రాసినప్పటికీ,  మీరు ఇంతగా అపార్ధం చేసుకున్నారు అంటే నేను నా భావాలను వ్యక్త పరచటంలో ఫెయిలయ్యాననిపిస్తోంది. చెప్పాను కదా నేను రచయితని కానని  నా వివరణ చూసిన తరువాత కూడా మీరు అదే ఉద్దేశ్యంతో ఉంటే మనః స్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను.

6 comments:

  1. చిల్లిముంత కూడా లేని బ్లాగు గురించి అంత గొ..ప్ప రచయితగారు టపా పెట్టేసేరే !!!
    పైగా సభ్యత గురించి ఆ రచయితగారు చాలా బాగా చెప్పేరు కూడానూ!

    నేను ఇక బ్లాగులు రాయనూ అని అలగడం మాంఛి ఫ్యాషన్ అయినట్టుంది. ఇదొక పబ్లిసిటీ స్టంట్ అంతే!

    మరీ అంత క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరమేమీలేదండి మీకు.

    ReplyDelete
  2. టపా టైటిలు చూసి ఆ చోరీ మీరే చేసా రనుకున్నా !! టైటిలు మరీ మిస్ లీడింగ్ గా ఉందండోయ్ !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బాబోయి్ ఇంకో అపవాదా? టైటిలు మార్చాను. ధన్యవాదములు.

      Delete
  3. సుమగారూ. అపోహలను అటుంచుదాం. బ్లాగులోకం ఈ‌ టపాచోరులను ఉపేక్షించటం తగదు కాబట్టి ఏమాత్రం గమనికకు వచ్చినా
    1. చోరీకి గురియైనది మీ‌టపా ఐతే వెంటనే గూగుల్ వారికి ఫిర్యాదు చేయండి.
    2. ఇతరుల టపా ఐతే ఆ టపా స్వంతదారుల గమనికకు తెండి.
    ఒకవేళ చోరులు గూగుల్ బ్లాగులో కాక ఇతర సైట్లలో ఉంచినా ఫిర్యాదు చేయటానికి తగిన మార్గం ఉండితీరుతుంది. తెలుసుకోండి. ఫిర్యాదు చేయండి. ఇతరులకు చెప్పండి. చోరులను గురించి పబ్లిసిటీ ఇవ్వండి
    ధన్యవాదాలు చదివినందుకు.

    ReplyDelete
    Replies
    1. The suggestions proposed are very good, let's practice them. thank you....

      Delete