Saturday, June 14, 2014

అత్త తిట్టినందుకు కాదు తోడికోడల నవ్వినందుకు అన్నట్లు....


తెలంగాణా ఎమ్మెల్యే ల ప్రమాణ స్వీకారం మీద టివిల లో వచ్చిన ప్రసారాలమీద కెసిఆర్ ఫైర్ అవ్వడం చూస్తే అత్త తిట్టినందుకు కాదు తోడికోడల నవ్వినందుకు అన్నట్లుంది.  కనీసం తమ మాతృ భాష తెలుగు కూడా సరిగా చదువ లేక పోయారు వీరు రేపు ముఖ్యమైన దస్త్రాల మీద సంతకాలు చేయవలసి ఉంటుంది.  మరి అవి చదివి అర్ధం చేసు కుని పెడతారా లేక గత దేవుడి  పాలనలో లాగా ముఖ్యమంత్రి చెప్పారని లేక ఆధికారులు చెప్పారని అంటారా అన్నది దేవుడి కెరుక.      ప్రజా ప్రతినిధులు  గా ఎన్నిక కాబడడానికి కనీస విద్యార్హత ఉంటే బాగుంటుంది.

1 comment:

  1. తడబాటుకు అనేక కారణాలు ఉంటాయి ఉ. బెరుకు, stage fear లాంటివి. ఆంధ్రతో సహా అన్ని రాష్ట్రాలలలో & లోక్సభలో ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తాయి. అంతెందుకు నూతన ఆంద్ర మంత్రి దేవినేని ఉమా గారు ప్రమానంలోని కఠిన పదాలు పలకలేక ఏకంగా వదిలేసారు. ఇంతమాత్రాన పాచికల్లు మొఖాలు, టూరింగ్ సినిమాలు చూసేతోల్లు టో అంటూ అవహేళన చేయడం సభ్యత కాదు.

    శాసనసభ్యులు ముఖ్యమయిన దస్తావేజుల మీద సంతకాలు పెడతారా? మీరు మంత్రుల గురించి ఆలోచిస్తున్నట్టు ఉంది.

    ReplyDelete