Wednesday, October 29, 2014

మీకీ విషయం తెలుసా?



ఈ రోజు నాకొక కొత్త విషయం తెలిసింది.  అదేమిటంటే "వెండి తెర నవలలు" అంటే సినిమా నవలలు.  నవలల ను సినిమాలు గా తీయడం మనందరికి సుపరిచితమే.  కాని ముందే తీసిన సినిమాలను నవలా రూపంలో అచ్చువేయించేవారుట. అంటే రివర్స్ అన్నమాట, ముందు సినిమా ఆ తరువాత నవల.  ఇది విన్నప్పుడు నిజంగా గమ్మత్తుగా అనిపించింది. కాని ఇది నిజం.  తెలుగు సినిమా తొలి నాళ్లలో సినిమాలను ప్రజలకు చేరువయ్యేందుకు నవలా రూపంలో అచ్చువేయించేవారుట.  ఒక పెద్ద కధను మూడు గంటలలో సినిమాగా చూపించాలి.  అందువలన దర్శకునికి అది పెద్ద సవాలు.  దర్శకుడు సినిమాలో తీసింది అంటే దర్శకుని కోణం (దర్శకుని మనస్సులో ఉన్నది)  ప్రజలకు  తెలియాలనే ఉద్దేశ్యంతో నవలలను అచ్చువేయించేవారుట.    పాతాళభైరవి, మాయా బజారు, కన్యాశుల్కం ఇత్యాది సినిమాలు నవలలు గా వచ్చి ప్రజల మన్ననలు పొందడమే గాక పునః ముద్రణ కూడా గావింప బడినవిట.

1 comment: