Friday, December 5, 2014

తప్పు ఎప్పుడూ మగవారిదేనా?

అమ్మాయిలు, అబ్బాయిల తగాదాలలో ఎప్పుడూ మగవారినే తప్పు పడుతుంటారు మన సమాజాంలో.  బహుశా చాలా కేసులు లో అబ్బయిలే దోషులుగా తేలడం వలన అనుకుంటా.  మొన్న  హరియానా లో రోవాతక్ బస్ లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ముగ్గురు యువకులను బెల్టుతో చితకబాదారు.  ఆ విడియో సోషియాలో మీడియా బహళ ప్రచారం పొందింది.  చాలామంది, ఆ అమ్మాయిల తెగువను కూడా పొగిడారు. మరికొంత మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్న సహ ప్రయాణికులను తిట్టి పోశారు కూడాను వారు మిన్నకుండిపోయారని.    హరియాణా ప్రభుత్వమైతా ఇంకొంచెం ముందుకెళ్లి రాబోయో గణతంత్రదినోత్సవ కార్యక్రమంలో వారిని సత్కరిస్తామని ప్రకటించేశారు కూడాను.  కాని ఆ కేసు దర్యాప్తు లో ఆ బస్సులోనే ప్రయణిస్తున్న నలుగురు మహిళలు ఆ ముగ్గురు యువకుల కు అనుకూలంగా సాక్ష్యం చెప్పారుట.  దాంతో హరియాలా ప్రభుత్వం సత్కార విషయాన్ని దర్యాప్తు పూర్తి అయె వరకు పక్కన పెట్టరారుట.  ప్రస్తుత మారిన సమాజంలో నిజా నిజాలు తెలియకుండా స్పందింస్తే ఇంతే సంగతులు. 


1 comment:

  1. నాడు అరిభీకరముగ రౌదీఇజముకు మీడియా కరతాళ ద్వనులు!
    నేడు సత్య శోధనకు సాక్షమిచ్చిన ఈ మహిళల కేవి ప్రశంసలు?!

    ReplyDelete