భారత దేశం సెక్యులర్ దేశమని గర్వంగా చెప్పుకుంటాము. మనది హిందూ దేశమైనప్పటికీ, మన దేశ రాజ్యాంగం పౌరులకు తమకు నచ్చిన మతం మరియు మత పరమైన ఆచార వ్యవహరాలు అనుసరించే పూర్తి హక్కునిచ్చింది. అన్య మతస్తులు మైనారిటీలని వారికి అనేక వసతులు కల్పించాము అనేకంటే ఇతర దేశములతో పోల్చితే నెత్తిన పెట్టి చూసుకుంటున్నాము అని చెప్పవచ్పు. అన్ని మతాలవారిని సమానంగా గౌరవంగా చూస్తున్నాము. అంతవరకూ బాగుంది కాని మరి మన హిందూ మతాన్ని గౌరవించవద్దా? హిందువు లను లక్ష్యంగా ఉగ్రవాద దాడులు జరపడం, మతమార్పిడులకు పూనుకోవడం, మన పవిత్ర దేవాలయాలలో అన్య మత ప్రచారాలు చేయడం చూస్తున్నాము. తమిళనాడులోని ఒక మెడికల్ కళాశాలలో మొన్న దీపావళికి దీపాలను వెలిగంచారని ఆ విద్యార్ధులమీద చర్యలు తీసుకున్నారు. రూ.5000/_ అపరాధ రుసుము విధించారు. సెక్కులర్ దేశమంటే ఇతర మతస్ద్తులను నెత్తిన పెట్టుకోవడమేనా మన హిందూ మతం మీద మమకారం ఉండక్కరలేదా? ప్రతీ దేశం తమ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటయి తమ జాతి మతములకు ఎంతో పాధాన్యతనిస్తాయి. కాని మనం మనవి వదిలేసుకుని దేనికోసమో పాకులాడుతున్నామనిపిస్తోంది. మన దేశం, ప్రాంతం, భాష, సంస్కృతి, మతం, ఆచార వ్యవహరాలను వదిలేసి పరులకు పట్టం కడుతున్నాము. అన్యులు మన మతాచారాలని గౌరవించక పోతే కనీసం స్పందించక పోతే ఎలా? ఇటువంటి చర్యలను అడ్డుకునే చర్యలు తూతూ మంత్రంగా మాత్రమే జరుగుతున్నాయి. ఇలా మిన్నకుంటే రాను రాను అవి పెను భూతంగా పరిణమించవచ్చు. మోడి అయినా ఒటు బ్యాంకు రాజకీయాలకు ప్రాకులాడ కుండా మన దేశానికి పూర్వ వైభవాన్ని తీసుకు వస్తాడని ఆశిద్దాం .
Sunday, November 2, 2014
దీపావళికి దీపాలను వెలిగంచారని విద్యార్ధులమీద చర్యలు!

Subscribe to:
Post Comments (Atom)
ఇలాంటి వెర్రి చేష్టలే చివరకు, దేపావళి రోజున దీపాలు వెలిగించకపోతే, చర్యలు తీసుకునే రోజులను తీసుకు వస్తాయి.
ReplyDeleteఈ టపా మరీ అసంబద్ధం గా ఉన్నది ! చిత్తూరు పాలక్కాడు కేరళా లో ఉన్నది తమిళ నాడు లో కాదు
ReplyDeleteరెండు, ఆ పై ఫైను హాస్టల్ లో వారు రూల్స్ ని అతిక్రమించి 'lighting candles' గురించి.
హాస్టల్ రూల్స్ ఫాలో చెయ్యడం అన్నది విద్యార్థి ప్రధమ కర్తవ్యం. కర్తవ్య పరి పాలన చెయ్య కుండా, నిబద్దత లేకుండా ఉండటం తప్పు .
హాస్టల్ సేఫ్టీ కోసం హాస్టల్ లో లైటింగ్ కేండల్స్ కూడదని వారు తీసు కున్న నిర్ణయం. దాని కని కేటాయించిన స్థలం లో నే చెయ్యాలనే వారి ఆదేశం దీనిని మీరి విద్యార్థులు చెయ్యడం భావ్యం కాదు.
ఇది క్రమ శిక్షణ కి చెందిన విషయం. దీనికి ఇట్లా కమ్యూనల్ ఎన్గల్ అద్దడం సరి కాదు .
మనం ఇంట్లో మతాబులు టపా కాయలు పెల్చం. రోడ్డు పై న (అదిన్నూ ఇప్పుడున్న అపార్ట్మెంటు కల్చర్ లో మరీ ముఖ్యం )
జిలేబి