హమ్మయ్య మా ఊరి పేరు చెప్పుకునే అవకాశం వచ్చింది. మాది ఏలూరు, నాకు చిన్నప్పటి నుంచి ఒక అసంతృప్తి ఉండేది. అదేమిటి అంటే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైనప్పటికిని మా ఊరి పేరు పెద్దగా వార్తలలో కనిపించేది కాదు. కనీసం న్యూస్ పేపరులో వాతావరణం కాలమ్ లోనైనా కనిపించేది కాదు. ఎందుకో ఏలూరు లో ఉష్ణోగ్రత ఏ పేపరులో నూ కనిపించదు. చాళుక్యులు ఏలూరు కు దగ్గరలోని పెదవేగి ని రాజధాని గా చేసుకుని పరిపాలించారు అని చరిత్ర చెబుతోంది. ఏలూరు లో సి ఆర్ ఆర్ కళాశాలలో నే మన సూపర్ స్టార్ కృష్ణ చదువు కున్నాడు. ఏలూరు ను ఆనుకుని ఉన్న చేటపర్రు గ్రామంనుంచి సిల్క్ స్మిత మరియు మురళీ మెాహన్ వంటి వారు సిని రంగంలో ఒక వెలుగు వెలిగారు. ఏలూరు కు 40 కి మీ దూరంలో నున్న ద్వారాకా తిరుమల చిన్న తరుపతి గా ప్రఖ్యాతి చెందింది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరిన్ని నా తదుపరి టపాలలో పొందు పరుస్తాను. ఇంతకీ విషయమేమిటి అంటే ఏలూరు లో పుట్టిన ఒక యువకుడు సిని కధానాయకుడు గా ఎదిగాడు. ఈ వార్త విన్న నాటినుంచి భలే సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మీతో పంచుకో వాలనే ఈ చిరు ప్రయత్నం . ఇంతకీ ఎవరా కధానాయుకుడు అనుకుంటున్నారా? ఊహలు గుస గుస లాడే ఫేమ్ నాగ శౌర్య . అతనికి మరిన్ని అవకాశాలొచ్చి మంచి కధానాయకుడుగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ .....
Let us say all the best to him !
ReplyDeleteసుప్రసిద్దనటి మహానటి కన్నాంబ గారిది ఏలూరే. ఆమెను మించిన నటి తెలుగు-తమిళంలో ఇంతవరకూ రాలేరు అంటే అతిశయోక్తి కాదు. ఇంకా కొందరు చిత్రరంగానికి సంబందించిన వారు ఉన్నారని చదివిన జ్ఞాపకం. ఏలూరుకు బహుకాలం నుండి పేరున్నమాట వాస్తవమే. ఈ నటుడు పైకి వస్తే మళ్ళీ మీ ఊరిపేరు వెలిగిపోతుంది లెండి.
ReplyDelete