Sunday, October 26, 2014

సప్త వర్ణ రంజిత మైన గులాబీలు.


పైగులాబీను చూశారు కదా.  ఇది నిజమైన గులాబీనే, పెయింటింగ్ కాదు మరియు ఫోటోషాప్ లో డిజైన్ చేసింది కూడా కాదు. నిజంగా నిజమైందే.  కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా.  గులాబీలంటే పింక్ రంగు గులాబీలే మనకు తెలుసు.  ఆతరువాత హైబ్రీడ్ రకం వచ్చాక గులాబీలు కొత్త కొత్త రంగులు తెచ్చుకున్నాయి.  తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు ఇలా వేలాది రంగులలో గులాబీలను మనం  చూశాము.  ఇప్పుడు ఇంద్రధనస్సు రంగులులో గులాబీలు తయారు చేస్తున్నారు నెదర్లాండు కు చెందిన పీటర్ డె వెర్కన్.  పీటర్ ఒక ఫ్లోరిస్ట్ తన వ్యాపార అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నంలో పుట్టుకొచ్చినవే ఈ హరివిల్లు గులాబీలు. రంగుల పూలు ఆకులు నుంచి రంగులను సేకరించి ఆయా రంగులను నీటిలో కలిపి ఆ నీటిని గులాబీ మొక్కలు పీల్చుకునేలా చేసి ఈ ఇంద్రధనస్సు రంగులలో గులాబీలు పూయిస్తున్నారు.  గులాబీలు పుష్ప జాతులలో మహరాణీ వంటివి.  మనం ఎవరినైనా ఎటువంటి సందర్భంలోనైనా  అభినందించాలంటే మనకి ఠక్కున గుర్తుకు వచ్చేవి  గులాబీలు.  ప్రేమలో ఉన్న వారైతే చెప్పనక్కరలేదు  వారు తమ మనసు దోచిన చెలికత్తెకు ప్రొపోజ్ చేసే సంబర్బంలో  గులాబీ కంటే ఇవ్వదగిన బహమతి మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.  మీకు కూడా వీటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా? మరెందుకాలస్యం వెంటనే rainbowedroses.com కి వెళ్లండి.

No comments:

Post a Comment