Saturday, September 6, 2014

ఎలా? ఎలా? ఎలా? కవి కావడమెలా?

తనికెళ్ల భరణి గారు ఒక ఛానెల్ ముఖా ముఖి కార్యక్రమంలో తెలుగు భాష ను గురించి చెబుతూ, పద్యము అనేది తెలుగు భాష సొంతం మరే భాష లోను లేనిది అని అన్నారు.   అది విన్న తరువాత  చాలా ఆనందం కలిగింది నేను కూడా తెలుగువాడిగా పుట్టినందుకు.  నిజం చెప్పాలంటే కాస్త ఛాతీ ఉప్పొంగిన మాట వాస్తవం.  అప్పటి నుండి నాలో ఎన్నో ఆలోచనలు.  మన కవు లందరూ (నాకు తెలిసిన) కళ్లముందు మెదిలారు.   వారందరూ కవులుగా ఎలా తయారయ్యారు.  ఎం చదివారు. ఎక్కడ శిక్షణ తీసుకున్నారు.  అసలు కవి కావడానికి అర్హతలేమిటి?  గద్య, పద్య మరియు పాటల రచన అనే ప్రక్రియలలో గద్య రచన స్పష్ఠంగా తెలుస్తోంది.  విషయ పరిజ్ఞానానికి భాషా పరిజ్ఞానం తోడైతే రచయిత కావచ్చు గద్య రచన చేయవచ్చు.  మరి కవి కావడమెలా?  అందరూ అంటుంటారు కవుల కు భావుకత ఎక్కువ అని కాని భావుకత ఉన్న వారందరూ కవులు కాలేరనేది జగమెరిగిన సత్యము. మరి కవి కావడాని ఎమైనా కోర్సులున్నయా? కోచింగ్ సెంటర్లున్నాయా?  ఛందస్సు మరియు వ్యాకరణం నేర్చుకుంటే కవై పోవచ్చా?  ఎలా? ఎలా? ఎలా? కవి కావడమెలా?  మీకేమైనా తెలిస్తే కాస్త చెప్పరూ?

No comments:

Post a Comment