నా బ్లాగులో "బియస్ యన్ యల్ ఫాన్సీ నెంబర్ల వేలం" టపాకు వచ్చిన కామెంటుకు నా విశ్లేషణ.
ఇందులో డబ్బులు తగులబెట్టేది ఎమీ లేదు అనేది నాభావన. ఎందుకంటే ఖర్చు అనేది చూసే వారి దృష్టి ని బట్టి ఉంటుంది అనేది కాదనలేని నిజం. కారు కొనుక్కోవడం అవసరం అనుకుంటాడు కొనగలిగేవాడు, కొనలేనివాడు అనవసర ఖర్చు అంటాడు. ఇలాంటివే చాలా చెప్పొచ్చు అనుకోండి. కాని ఇక్కడ విషయం అది కాదు. ఇంతకు ముందు సామాన్యుడుకు ఫాన్సీ నెంబర్లు ఎండమావె. వెహికల్ నెంబర్లు కాని టెలిఫోన్ నెంబర్లు కాని మనకి నచ్చినవి కావాలంటే మనకి ఆ డిపార్టుమెంటులో పనిచేసేవారు తెలిసుండాలి లేక మనకి మంచి పరపతి లేదా చేయి తడప గిలిగే తెగువ ఉండాలి. లేకపోతే వారెదిస్తే అదే గతి. కాని మారిన పరిస్తుతులు గ్లోబలైజేషన్ వలన కంపెనీలు మరియు ప్రభుత్వాలు కుడా వ్యాపార సరళిని పెంపొందించుకుంటున్నాయి. డబ్బులు వచ్చే ఎ అవకాశాన్ని వదులు కోవడం లేదు. దీని వలన నష్టం కూడా ఎమీ లేదు. ఉభయతారకం కూడాను. మనకి అవకాశం ఉంటే డబ్బులు పెట్టగలిగితే ఎవడి కాళ్లు పట్టుకోకుండా దర్జాగా మనకి నచ్చిన నెంబరును సొంతం చేసుకో వచ్చు. కాదంటారా?

నిజమే
ReplyDeleteఎవరికన్నా లంచమిచ్చి ఫాన్సీ నంబరు తీసుకొవడం తప్పు. ఖర్చు పెట్టగలిగే శక్తి వుంటే డబ్బులిచ్చి దర్జాగా కొనుక్కోవడం మంచిదే. తెల్ల డబ్బు మార్కెట్ లోకి రావడం మంచిదేగా
ReplyDelete
ReplyDeleteకానే కాదు .
మనం సర్విస్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం తగలెయ్యడం ఎట్లా అవుతుంది ?
జిలేబి