సుమారు గత మూడు మాసములుగా టివి9 మరియు ఆంధ్రాజ్యోతి ఛానెల్ ల ప్రసారాలు తెలంగాణా రాష్ట్రంలో ఎంఎస్ వో లు నిలుపుదల చేశారు మాకేం తెలీదు అంటూ వచ్చారు. కాని దానివెనుక ఉన్నదెవరో నిన్న కెసిఆర్ కామెంట్ తర్వాత సుస్పష్ఠంగా ప్రపంచానికి తెలిసింది. కెసిఅర్ ఇంకా విజయం పొందిన కిక్ లోనే ఉన్నట్లున్నారు. అందుకే ఆయన కాళ్లు భూమి మీద నిలవడం లేదు. కాని కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదన్నది జగమెరిగిన సత్యం . ఒడలు బళ్లు కావడం కూడా మనకెరుకే. టివి9 మరియు ఆంధ్రజ్యోతి వారు క్షమాపణలు చెప్పిన తరువాత కూడా స్పందించడం లేదంటే తెగేవరకూ లాగుతున్నారనిపిస్తోంది.
దానిని పక్కన బెడితే, మన దేశం ఒక అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకుంటున్నాం . అయితే మరి ఇంత నియంతలా ప్రవర్తిస్తున్న అది కెసిఆర్ కావచ్చు లేక ఎం ఎస్ ఒో లు కావచ్చు, వారిని అదుపు చేసే యంత్రాంగమేమీ లేదా లేక ఉన్నా చేతులు ముడుచుకుని కూర్చున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఎందుకంటే మాకు నచ్చిన ఛానెల్స్ మాత్రమే ప్రసారం చేస్తాం అంటే ఇంకా ప్రజాస్వామ్యమెక్కడ? మనకి వ్యతిరేకంగా మాట్లడితే అంతే గతి అంటే ఎలా? అంటే మన ప్రజాస్వామ్యం ఒటి కుండేనా?
అది అలా ఉంటే జర్నలిష్టులు పోరాటం చేస్తుంటే మిగిలిన ఛానెల్స్ ఎందుకు మౌనం దాల్చుతున్నారో అర్దం కావడం లేదు. జాతీయ మీడియా కూడా స్పందించి ఈ వార్తలకు కవరేజి ఇస్తుంటే మన ప్రాంతీయ ఛానెల్స్ మాత్రం చోద్యం చూస్తున్నాయి. ఈ రోజు మీకేమి ఇబ్బంది లేక పోవచ్చు కాని ఇలాంటి నాయకులతో రేపు మీకు కూడా ఇదే సత్కారం అని మర్చిపోతున్నారు. వీరి మధ్య ఎప్పటిలాగా సామాన్య మానవుడే నష్ట పోతున్నాడు. ఛానెల్స్ చెప్పేదే వినాలి ఎం ఎస్ వో లు చూపించిన ఛానెల్స్ మాతృమే చూడాలి. హే భగవాన్ ఎందుకీ దుస్తితి.
No comments:
Post a Comment