మొన్న బ్లాగిల్లు వారి బ్లాగులో కామెంట్లు చేయండి బ్లాగులను బతికించండి అని ఒక పోస్టు చూశాను. అది చదివిన తరువాత నా మదిలో మెదిలిన విషయాలు మీ తో పంచుకుందామని ఈ పోస్టు. కామెంట్లు (మంచి వి మరియు అర్ధవంతమైనవి) బ్లాగు రాసేవారికి టానిక్ లాంటివి. అవి ఎంతో ప్రేరణ నిస్తాయనడంలో ఎటు వంటి సందేహం లేదు. అదే సమయంలో అవాంఛిత కామెంట్లు మనస్సు నొప్పిస్తాయి. కాని కామెంటు, కామెంటు చేసే వారి వ్యక్తిక్త్వాన్ని బయడ పెటుతుంది. పిచ్చి కామెంటు చేస్తే అది బ్లాగు రాసే వారి మనస్సునొప్పించినా చూసే వారికి మాత్రం ఖచ్చితంగా కామెంటు చేసిన వారి తెంపరితనం లేక వారి కుత్సిత స్వభావామే కనబడుతుంది, కాబట్టి బ్లాగు రాసేవారు అటు వంటి కామెంట్లను పెద్దగ పట్టించుకోనవసరం లేదు అని నా భావన. సరే ఇక కామెంట్ల విషయానికొస్తే, కామెంట్లు చేయకపోవడానికి నాకు ఈ క్రింది కారణాలు కనిపిస్తున్నాయి.
- సమయా భావం . చాలా మంది చదువరులు తమకున్న తక్కువ సమయంలో కొన్ని ముఖ్యము లేక ఆసక్తి కలిగిన బ్లాగులు ఎంచుకుని చదువు తుంటారు. అంతే గాక కొన్ని బ్లాగులలో సమాచారం/విషయం చాలా పెద్దదిగా ఉంటే బ్లాగు కూడా పూర్తి గా చదువరు. అటువంటి వారు కామెంట్లు చేయురు.
- కొన్ని బ్లాగులలో ని విషయం కామెంటు చేసేలా ఉండక పోవడం . ఉదాహరణకు, Good English, Punch pataka బ్లాగులలో కామెంట్ల అవసరం ఉండదు.
- బ్లాగులలో విషయం ఒక వర్గం, ప్రాంతం, కులం, మతం లేదా జాతి వారికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఉండటం .
- బ్లాగులోని సమాచారం సమస్యాత్మకమయితే (సైబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఉంటే) కామెంట్ చేయడానికి వెనుకాడతారు.
- భాషాపరమయిన సమస్య - కామెంటు తెలుగులో చేద్దామని పిస్తుంది, కాని మనం చూసే పి.సి లో తెలుగు సాఫ్ట్ వేర్ అందుబాటులో లేక పోవడం.
- తెలుగు సాఫ్ట్ వేర్ ఉన్నా తెలుగులో టైపు చేయడం కష్టమనిపించడం .
- కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వ వలసి రావడం .
- అజ్ఞాత గా కామెంట్ చేసే అవకాశం లేకపోవడం .
- మన కామెంటుకి విలువ ఉండదని భావించినపుడు.
- మన కామెంటు మోడరేషన్ కి గురి అవుతుందని భావించినపుడు.
- మన కామెంటు వాస్తవమయినప్పటికీ అది ఎదుటివారిని బాధిస్తుందని భావించినపుడు.
- కొన్ని బ్లాగులలో మొత్తానికి కామెంట్లు డిసేబుల్ చేసి ఉండడం .
స్ధూలంగా నాకు కనిపించిన కొన్ని కారణాలు. ఇంకా చాలానే ఉండి ఉండవచ్చు. అయితే ఎతా వాతా చెప్పోచ్చేది ఎమిటంటే కామెంట్ చేసే వారు బ్లాగు రాసే వారు ఇద్దరూ కూడా పరస్పర గౌరవాలకు భంగం వాటిల్ల కుండా చూసుకుంటే కామెంట్లు పెరుగుతాయి. బ్లాగులు కూడా మూడు పోస్టులు ఆరు కామెంట్లగా వర్ధిల్లుతాయి.
"అజ్ఞాత గా కామెంట్ చేసే అవకాశం లేకపోవడం ." In what way, 'name' matters as long as the comments are in 'good' language, besides being honest and genuine.
ReplyDeleteసవజంగా కొందరు బిడియస్తులు తమ పేరు తో కామెంట్ చేయడానికి ఇష్టపడరు అందుకని. అజ్ఞాతగా అయితే ధైర్యం పెరుగుతుంది.
DeleteSorry - missed to type "that is the main reason", I suppose.
ReplyDeleteకామెంట్ల ఆవశ్యకత గురించి చక్కగా విశ్లేషించారు . కామెంట్లు రాకపోడానికి మీరిచ్చిన కారణాలు కరెక్టే కావచ్చు .కొండరన్నట్లు మనమేమీ కామెంట్లు అడుక్కోనవసరం లేదు . చదివేవారే కాస్త తీరిక చేసుకొని జస్ట్ "బాగుంది " అని వ్యాఖ్యానిస్తే అదే టానిక్ !
ReplyDeleteఅజ్ఞాత గా చేసినా కూడా బుద్దిగా చేస్తే చాలు అనేది నా ఉద్దేశం . మీరన్నట్లు అజ్ఞాత ఉన్నప్పుడు ఎక్కువ కామెంట్లు వచ్చే అవకాశమున్నట్లుగా కొన్నిబ్లాగుల విశ్లేషణలలో తేలింది .
కొన్ని బ్లాగులు ఎంతో మంచి టపాలను అందిస్తున్నా వాటికి ఒక్క కామెంట్ కూడా రాకపోవడం ఆశ్చర్యపరచింది .
అసలు బ్లాగర్లు టపా వ్రాసేముందు కామెంట్ల గురించి ఎదురు చూడరు అని కూడా నేను నమ్ముతున్నాను .
అయినా టపాకు కామెంట్ వోటింగ్ వంటిది .
నిజంగా కామెంట్ వొటింగ్ వంటిదే. బ్లాగులో కూడా ఫేస్ బుక్ లాగా లైక్ బటన్ ఉంటే బాగుంటుందేమో.
Deleteలైక్ విడ్జెట్ మీకు దొరుకుతుంది ఇంటెర్నెట్ లొ....చూడండి
DeleteWell said!
ReplyDeleteప్రత్యుత్తరం అందడం చాలా కష్టం ఎందుకంటే నా అభిమతం తెలుసుకుంటారు మన వ్రాతలలో, వ్యతిరేకించకుండా వీడు ఇంతే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు!
ReplyDeleteబ్లాగ్స్ లో కూడా ప్రాంతీయవాదం మీద ఎక్కువ పోస్ట్ లు రావడం కూడా ఓ రీసన్ కూడలి ఒపెన్ చేస్తే అవే ఎక్కువగా ఉండేవి, నాది బంగారు ప్లేస్ అని ఒకరంటే , నాది వజ్రం ప్లేస్ అని ఒకరంతే ........ కూడలి దాటి లోపలికి పో బుద్ది అయ్యేదికాదు. ఇక కామెంట్ దాకా ఎక్కడ? ఒకప్పుడు కూడలికి వస్తే హాయిగా ఉండేది, వీవెన్ గారు థాంక్స్
ReplyDeleteసుమ చామర్తి ,
ReplyDeleteనీ 'సుమనోగతం' తెలియచేయటంతో ఎన్నో విషయాలు బయటపడ్డాయి .
కామెంట్లను పొగడ్తలకే తీసుకోకూడదు బ్లాగర్లు . సద్విమర్శలను అర్ధం చేసుకొని , తగు (అవసరమైతే ) ఆ మార్పులు చేసుకోగలిగిన నాడు కామెంట్లు అధికంగా వచ్చే అవకాశము వుంటుంది . వాటి ద్వారా ఎదుగుదల వుంటుంది బ్లాగు రచయితలకు .
ఉదా : పాక శాఖ ప్రవీణులు ఎలా కాగలుగుతున్నారు ? కొంచెం ఆలోచించండి . చేసిన వంటను తిని అందులోని లోపాలను తిన్నవారు చెప్పటం వలన , ముందు ముందు సరి చేసుకోవటం వలన వాళ్ళు ప్రావీణ్యతను సంపాదించుకో గలిగారు .
ఆ తిన్న వాళ్ళు ఎప్పటికీ అతిధులుగానే వుండిపోయారు చరిత్రలో .
కామెంట్ వ్రాయకపోవడానికి బద్దకం ఒక ప్రధాన కారణం. అలాగే కొంతమంది బ్లాగర్లు అన్ని బ్లాగుల్లో కామెంట్ చెయ్యరు. సెలక్టివ్‌గానే చేస్తారు.
ReplyDeleteమంచి టపాకి కనీసం, బాగుంది (well said) అని ఒక చిన్న కామెంట్ చేసినా, మరికొంతమంది చదువుతారు. మంచి టపాలని ప్రొత్సహించినవారవుతారు. This is my request.
ఎవరో వస్తారని, ఏదో కామెంటుతారని ఎదురుచూడకుండా, మన బ్లాగులో మనమే అనామకులుగానో, అపరిచితులుగానో కామెంట్లెట్టుకోవడం ఉత్తమమని నా అభిప్రాయం. ఆ well said ఏదో మనమే మన బ్లాగులో రాసుకుంటే, అదిచూసి ఇతరులు చదువుతారు. ఒకవేళ అలా చూసినవాళ్ళందరూ కామెంటకపోతే అప్పుడూ వివిధ విడ్జెట్లద్వారా బ్లాగుహిట్లను ప్రదర్శనకు పెట్టి మనమేమీ బొత్తిగా మిడ్జెట్లము(మరగుజ్జులు) కామని మన అహాన్ని సంతృప్తి పరుచుకోవచ్చు. అప్పటికీ అహం చల్లారకపోతే, నా బ్లాగుకు ఇన్ని హిట్లోచ్చాయోచ్‌చ్‌చ్‌చ్ అని మూణ్ణెళ్ళకోసారి ఒక టపా వెయ్యొచ్చు. ఇక అప్పటికీ లాభం లేకపోతే ఏదో (భావజాల)భజన బృందంలో చేరడమో, సినిమా కబుర్లపేరుతో సొల్లుకబుర్లు రాయడమో చేయవచ్చు.
Deleteమీ స్పేస్ వాడుకున్తున్నందుకు క్షమించండి .
ReplyDeleteబాబు బ్లాగ్గర్లు , వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి . ఇక్కడ రోబోట్ లు తో స్పాం చేసే అంత సీన్ లేదు .
ఆ వర్డ్ ఏంటో అర్ధం కాదు , చిరాకు వేస్తుంది .
బ్లాగుల్లో ఈ కామెంట్ల గొడవేందయ్యా నాయనా ఏమి కామెంట్లు రాకపోతే బ్లాగులు రాయకూడదా ??
ReplyDeleteఅట్లా అయితే కొందరు సీనియర్ బ్లాగర్ల దయ ఉన్న వాళ్ళకే కామెంట్లు వస్తాయి గానీ అందరికి ఎందుకొస్తాయి కామెంట్లు ..
బ్లాగువేదికకు అనుసంధానించడం జరిగింది గమనించగలరు.
ReplyDeleteఇప్పుడర్థమయ్యింది - ఎందుకు రావట్లేదు అని ప్రశ్నిస్తే వస్తాయన్న మాట !!
ReplyDeleteజిలేబి
:-)
Delete