Monday, October 27, 2014

ఎందుకిలా?

ఈ మధ్య ఫేస్ బుక్ లో చాలా మంది దేవుడి ఫొటోలు పోస్ట్ చేసి 5 సెకన్లలో షేర్ చేయండి మీకు మంచి జరుగుతుంది లేదా మంచి వార్త వింటారు అని రకరకాలుగా మెసేజ్ లు పెడుతున్నారు. వాటిని చాలా మంది షేర్ చేస్తున్నారు.   మా చిన్న తనంలో కూడా ఇలా పామ్ ప్లేట్ లు పంచి పెట్టే వారు.  వాటిలో దేముడి మహిమలు లేక  దేవుడు కలలో కనిపించాడు, అది చేయమన్నాడు ఇది చేయమన్నాడు అంటూ వ్రాసి చివరకు మీరు కూడా కొన్ని పామ్ ప్లేట్లు పంచండి లేక పోతే మీకు కీడు జరుగుతుంది అంటూ వ్రాసేవారు.  అసలు ఇలా ఎవరు మొదలు పెట్టేరో తెలీదు కాని వారికి ఎం ఒరుగుతుందో నిజంగా నాకు అర్ధం కాలేదు. వీళ్లకి మినిమం కామన్ సెన్స్ ఉండదా అని పిస్తుంది.   బలహీనుల జీవితాలతో ఆడుకుంటున్నారు.  ఆ పామ్ ప్లేట్ లను పడయలేక వేరే వాళ్లకి ఇవ్వ లేక (పామ్ ప్ల్టేట్ ఇచ్చే వాళ్లని చాలా అనుమానంగా చూసేవారు) వాళ్లు పడే యాతన పగవాడికి కూడా వద్దురా బాబు అని పిస్తుంది.     ఇలాంటి బలవంతపు షేర్ ల వలన కలిగే లాభం ఎమిటో ఎంతకీ అంతుపట్టదు.  వాళ్లకి మంచి జరగడం దెవుడెరుగు, మరొకళ్లని ఇబ్బందుల పాలు చేసినందుకు మాత్రం తప్పక దండించ బడతారనిపిస్తుంది.

2 comments:

  1. పాంప్లెట్ రోజుల్లో, బిజినెస్ కోసం ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఇలాంటివాటిని సృష్టించే వారు. ఇప్పుడు మోడ్రన్ గా ఎఫ్ బి

    ఫలానా గుడికివెళితే, ఫలానా బాబా దగ్గరకి వెలితే... లాంటివే ఇవ్వన్నీ

    ReplyDelete