నయనతార యెక్క రీఎంట్రీని కోలిపుడ్ సొమ్ముచేసుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆమె చివరి సినిమా శ్రీరామరాజ్యం యెక్క అనువాద హక్కులను పంపిణీదారుడైన కిరణ్ కొనుక్కున్నారు. తమిళ అనువాదం ఎప్రిల్ రెండవవారంలో విడుదలకు సన్నాహలు చేస్తున్నారుట. కాగా ప్రస్తుతం నయనతార అజిత్ కి కధానాయకిగా ఒక తమిళ సినిమాలో నటిస్తోంది.
Saturday, March 31, 2012
Wednesday, March 28, 2012
టీ కాలు ఇన్ జెక్ష్ న్ రూపంలో నే ఎందుకు వుంటాయి?
టీ కాలు ఇన్ జెక్ష్ న్ రూపంలో నే ఎందుకు వుంటాయి? టాబ్లెట్ లేదా కాప్సూల్ రూపంలో ఎందుకు ఉండవు? అని మా అమ్మాయి మొన్న టీ కా కోసం హాస్పిటల్ కు వెల్లినప్పుడు అడిగింది. నిజమే కదా, అనిపించింది. కారణం చెప్పలేకపోయాను. మీ కేమైనా తెలుసా?
Saturday, March 10, 2012
తెలుగులోనే టైపు ఛేయడం ఎలా?
తెలుగులో టైపు చేయడానికి అనేక ఉపకరణాలు గూగుల్ ఐఎమ్ఇ, బరహ, లేఖిని, హంసలేఖ, అక్షరమాల మొదలైనవి ఉన్నాయి. అయితే అవి అన్నీ ఫోనెటిక్ లేక ఇన్ స్క్రిప్ట్ పద్ధతిలో టైపు చేయడానికి మాత్రమే సహయ పడతాయి. ఇవన్నీ తెలుగు టైపింగ్ రాని వారు సులభంగా టైపు చేయడానికి ఎంతో ఉపయోగ పడతాయి కాని తెలుగు టైపింగ్ గోద్రేజ్, రెమింగ్టన్ టైపురైటర్ల మీద నేర్చుకున్న వారు పైన పేర్కొన్న పద్ధతులు ఉపయోగిస్తే వారు నేర్చుకున్న విద్య మర్చిపోయే అవకాశం పుంది. వారికోసమే ఇప్పుడు నేను ఒక ఉచిత సాప్ట్ వేర్ ను పరిచయం చేయబోతున్నాను. ఇది C-DAC వారు అభివృద్ధి పరిచారు. ఇది పూర్తిగా ఉచితం. మీరు ఈ క్రింది లింక్ ద్వారా తెలుగు యూనికోడ్ ఫాంట్స్ మరియు కీ బోర్డ్ డ్రైవరును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా అభ్యర్ధన మీద CD పొందవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి మీరు పైన పేర్కొన్న మూడు పద్ధతుల లోనూ టైపు చేయవచ్చు. తెలుగు భాష మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల సాఫ్ట్ వేర్ లను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైనక్స్ సాఫ్ట్ వేర్ కోసం ఫాంట్స్ ను ఇచ్చారు కాని కీబోర్డ్ డ్రైవర్ ను ప్రొవైడ్ చేయలేదు. మీకు తెలిసిన ఇలాంటి సాఫ్ట్ వేర్ ఉంటే తెలియ చేయండి.
ఇక్కడ క్లిక్ చేయండి
ఇక్కడ క్లిక్ చేయండి
Friday, March 9, 2012
హేట్ స్టోరీ గోడ పత్రిక లో ని హీరోయిన్?
ఫోటో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Thursday, March 8, 2012
గీతారెడ్డికి నారాయణ లేఖ
గీతారెడ్డిని విమర్శించి నాలుక కరుచుకున్న నారాయణ ఆమెకు క్షమాపణ కోరుతూ ఉత్తరం రాశారు. బహుశా ఈ వివాదం ఇక్కడి తో ముగిసిపోవచ్చు. ఈ విషయం మీద ప్రజలు, ప్రముఖులు లేదా విమర్శకులు వెంటనే స్పందించారు. మరికొందరు ఎస్.సి/ఎస్.టి అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో బహుశా చాలా కాలంగా కూడా కావచ్చు, ఒక విచిత్రమైన పోకడని గమనిస్తున్నాం. అది ఏమిటంటే, "మహిళ అని చూడాకుండా ఆరోపించారు" లేదా "నేను బలహీన వర్గానికి చెందినవాడిని, కాబట్టి నా మీద ఆరోపణలు చేశారు" అంతే కాకుండా ఎస్.సి, ఎస్.టి కి చెందినవరు అయితే చెప్పనక్కరలేదు వెంటనే ఎస్.సి/ఎస్.టి అట్రాసిటీ కేసు అంటున్నారు. ఇక్కడ నేను చెప్పొచ్చేదేమిటి అంటే, ఒక ఆరోపణ వచ్చినపుడు అందులోని నిజా నిజాలు చూడ కుండా, లేదా ఆ ఆరోపణ తప్పు అని చెప్ప కుండా పై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు. ఇక్కడా ప్రాముఖ్యత ఇవ్వవలసింది ఆరోపణ ఏమిటీ అనే దాని మీద కాని, అది మహిళల మీద చేశారా లేక ఎస్.సి/ఎస్.టి ల మీద చేసారా అని కాదు అని నా అభిప్రాయం. పత్రికలలో నూ ఇటువంటి శీర్షికలే చూస్తున్నాము. "బలహీన వర్గాల మీద దాడి" లేక "బలహీన వర్గానికి చెందిన మహిళ మీద అత్యాచార ప్రయత్నం". ఏదైనా దాడి లేక అక్రుత్యం ఎవరిమీద జరిగినా దాని ఫలితం ఒక్కటే. ఎస్.సి/ఎస్.టి, బలహీన వర్గాల మీద ఒక లాగా లేక సాధారణ ప్రజలమీద ఒక లాగా వుండదు. అలాగే మహిళల మీద ఒకలాగా పురుషుల మీద ఒకలాగా ఉండదు. కష్టం నష్టం అందరికీ ఒకే లాగా వుంటాయి. సమస్యలు, ఆరోపణలు అనేవి జండర్, కాస్ట్ & క్రీడ్ ఆధారంగా వుండకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు?
Wednesday, March 7, 2012
మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం ఎలా అయింది?
1907 లో న్యూయార్క్ లోని వస్త్ర పరిశ్రమలలోని స్ధితి గతులపై విసుగెత్తిన మహిళలు పనిగంటలు తగ్గింపు, వేతనాల పెంపు, ఓటు హక్కు కోసం నినదిస్తూ దాదాపు 15000 మంది సమ్మె చేశారు. సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగింది. మరోకధనం ప్రకారం 1857 మార్చి 8 వ తేదీన న్యూయార్క్ లోని వస్త్ర పరిశ్రమలలో జరిగిన సమ్మె 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అదే స్ధితిగతులు కొనసాగుతున్నందున 1907 లో ఈ సమ్మె జరిగింది. సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలోనే ఫిబ్రవరి నెల ఆఖరి ఆదివారం 1909 నుండి 1913 దాకా అమెరికా అంతటా 'ఉమెన్స్ డే' జరిగింది. అయితే జర్మనీ లోని కోపెన్ హగ్ లో 1910 లో అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి 17 దేశాల నుండి 100 మందికి పైగా హజరయ్యారు. ఈ సమావేశాన్ని 'క్లారా జెట్కిన్' నిర్వహించారు. ఆమె ప్రదిపాదన మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలన్న విషయమై అంగీకారం కుదిరింది. అనేక దేశాలలో ఫిబ్రవరి ఆఖరి ఆదివారాన్ని మహిళా దినోత్సవంగా జరుపుకునే వారు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 2 లక్షల మంది రష్యన్ సైనికుల మృతికి నిరసనగా రష్యాలో 'బ్రెడ్, పీస్ & రైట్ టు ఓట్' అన్న నినాదంతో సమ్మె ప్రారంభమైంది. రష్యాలో పాటించే జ్యూలియన్ కాలెండర్ ప్రకారం 23 ఫిబ్రవరి 1917 న ఈ సమ్మె ప్రారంభమైంది. అయితే గ్రెగరియన్ ప్రకారం ఈ సమ్మె మార్చి 8 న ప్రారంభమైనట్లు లెఖ్క. అప్పటినుండి మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటించే సంప్రదాయం అనేక దేశాలు పాటిస్తున్నాయి. 1911 మార్చి 8 న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మొదటగా డెన్మార్క్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లాంటి అనేక దేశాలు పాటించాయి. అలా 2011 నాటికి అంతర్జాతీయ మహిళాదినోత్సవం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గే కేసు నమోదు
సుప్రీంకోర్టు లో కేంద్రపభుత్వం స్వలింగ సంపర్కం అనైతికం అని తరువాత తన వాదనను మార్చుకున్నప్పటికీ, దేశంలో నే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు లో గత డిసెంబరు నెలలో ఐ.పి.సి 377 సెక్షను కింద మొదటి కేసు నమోదు అయింది. ఈ విషయం డిసెంబరు లో జరిగినప్పటికీ గే కమ్యూనిటి లోని సభ్యులు ఇటువంటి కేసులను ఎదుర్కొనడానికి తమ సభ్యులను చైతన్య పరిచేందుకు నిర్వహించిన సదస్సుల వలన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐ.పి.సి సెక్షను 377 స్వలింగ సంపర్కాన్ని నిరోధిస్తోంది. ఐ.పి.సి సెక్షను 377 స్పష్టంగా స్వలింగ సంపర్కాన్ని నిరోధిస్తున్నా ఈ సెక్షను మీద కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఈ కేసులో ఓంగోలు పోలీసులు ముగ్గురిని డిసెంబరు 28 అరెస్టు చేసారు. వీరిలో ఇద్దరు అసహజ లైంగిక చర్యకు పాలుపడుతుండగా మరొకరు గది బయట వేచియున్నాడుట. జనవరి నెలలో ఇటువంటి దే మరో కేసు ఓంగోలులోనే నమోదు కావడం విశేషం. ఐ.పి.సి. సెక్షను 377 కింద నిందితులకు 6 నెలల నుంచి 10 సంవత్సరములు జైలు శిక్ష పడే అవకాశం వుంది. కాగా స్వలింగ సంపర్కం జరిగినట్లు డాక్టరు నిర్ధారిస్తే తప్ప పోలీసులు ఆరెస్టు చేయకూడదని గే కమ్యూనిటీ సభ్యులు తమ సభ్యులను జాగ్రుత పరుస్తున్నారుట.
Tuesday, March 6, 2012
టాలిపుడ్ నుంచి రానున్న తెలుగు ఛానల్ "చిత్రసీమ"
తెలుగు చిత్రపరిశ్రమ త్వరలో తన సొంత ఛానల్ "చిత్రసీమ" ను ప్రారంభిస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చేనెలలో "చిత్రసీమ" ప్రసారాలను మనంచూడవచ్చు. "చిత్రసీమ" ఛానల్ యెక్క ప్రత్యేకత ఏమిటంటే ఇ ఛానల్ ఏ ఒక్కరికో చెందినది కాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమ యెక్క కోపరేటివ్ వెంచర్ గా పుండబోతోంది. అంటే ఇది ప్రతిఒక్కరి ఛానల్. చిత్రపరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామే. కోపరేటివ్ ఛానల్ అనేది ఒక దేశంలోనే ఒక కొత్త ఐడియా, ఇంతవరకూ ఏచిత్ర పరిశ్రమ ఇటువంటి ఆలోచన చేయలేదు. అమూల్ కోపరేటివ్ ఛానల్ యెక్క సక్సస్ ఈ ఛానల్ రూపకల్పనకు ప్రేరణ అని ఏ.పి ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ దగ్గుబాటి సురేష్ తెలియచేసారు.
ఓటర్లను ఆకట్టుకోలేకపోయాము - ఉత్తర్ ప్రదే్శ్ లో ఒటమిపై రాహుల్ వాఖ్య:
ఉత్తర ప్రదేశ్ లో ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు గా మరియు ఓటర్లను ఆకట్టుకో లేకపోయామని రాహుల్
వ్యాఖ్యానించాడు. టి.వి. లలో ఉదయంనుంచి అనేక విశ్లేషణలు చూస్తున్నాము. కాని సగటు మాగపుడు తన కేం కావాలో మరోసారి విస్పష్టంగా ప్రకటించాడు. అదే అవినీతి రహిత పాలన. జాతీయ పార్టీ అయిన కాంగ్రెసు అసమర్ధపాలన లో సామాన్యుడి పరిస్తితి నానాటికి దిగజారి పోతోంది. 2జి కుంభకోణం, కామన్వెల్త్ క్రీడ ల నిర్వహణ, ధరల అదుపులో వైఫల్యం, పాలనా యంత్రాంగం/అలయన్స్ మీద ప్రధానికి అదుపు లేకపోవడం, సమర్ధమైన లోక్ పాల్ బిల్ తేలేకపోవడం, నానాటికి పెరుగుతున్న పెట్రోలు ధర మొదలైనవి ఎన్నో పున్నాయి. ఇకనైనా వీటి పైన శ్రద్ధ చూపకపోతే 2014 లో జరగబోయే ఎన్నికల ఫలితాలు తరువాత కూడా రాహుల్ ఇదే వాఖ్యలు మరోమారు చేయవలిసి ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.
వ్యాఖ్యానించాడు. టి.వి. లలో ఉదయంనుంచి అనేక విశ్లేషణలు చూస్తున్నాము. కాని సగటు మాగపుడు తన కేం కావాలో మరోసారి విస్పష్టంగా ప్రకటించాడు. అదే అవినీతి రహిత పాలన. జాతీయ పార్టీ అయిన కాంగ్రెసు అసమర్ధపాలన లో సామాన్యుడి పరిస్తితి నానాటికి దిగజారి పోతోంది. 2జి కుంభకోణం, కామన్వెల్త్ క్రీడ ల నిర్వహణ, ధరల అదుపులో వైఫల్యం, పాలనా యంత్రాంగం/అలయన్స్ మీద ప్రధానికి అదుపు లేకపోవడం, సమర్ధమైన లోక్ పాల్ బిల్ తేలేకపోవడం, నానాటికి పెరుగుతున్న పెట్రోలు ధర మొదలైనవి ఎన్నో పున్నాయి. ఇకనైనా వీటి పైన శ్రద్ధ చూపకపోతే 2014 లో జరగబోయే ఎన్నికల ఫలితాలు తరువాత కూడా రాహుల్ ఇదే వాఖ్యలు మరోమారు చేయవలిసి ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.
త్వరలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి
ఈ రోజు వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తు దేశంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం వుందని బిజెపి పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ ఎన్ డి టీ వి కిచ్చిన ఇంటర్వ్యూ లో తెలియచేశారు. ఉత్తరప్రదేశ్ లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచగల సమాజ్ వాది పార్టీ ఇక కాంగ్రెస్ మీద ఆధారపడనవసరం లేదు, పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బిల్లులకు మద్దతు ఇవ్వకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు.
రెండవ ఫైనల్ లో శ్రీలంక విజయం
ఆస్ట్రేలియా లో జరునుతున్న ముక్కోణపు సీరీస్ లో భాగంగా ఈ రోజు జరిగిన రెండవ ఫైనల్ మాచ్ లో శ్రీలంక ఆస్ట్రేలియ పై 8 వికెట్ల ఘనవిజయం సాధించి బెస్ట్ ఆఫ్ త్రీ ని సమం చేసింది. కాగా, మొదట పైనల్ లో ఆస్ట్రేలియా గెలుపొందింది. అడిలైడ్ లో 8 వ తేదీన జరగబోయే మూడవ ఫైనల్ ఫలితాన్ని తేల్చనుంది. ఆస్ట్రేలియా నించి డేవిడ్ వార్న్ ర్ మరియు మైఖేల్ క్లర్క్ సెంచిరీ లు సాధించగా శ్రీలంక నుంచి తిలక్ రత్నే సెంచరీ సాధించాడు.
Sunday, March 4, 2012
రోడ్ల మీదకు రానున్న చోదకరహత కార్లు
అతిత్వరలో చోదక రహిత కార్లు రోడ్ల మీద షికార్లు చేయనున్నాయి. మానవ ప్రమేయం లేకుండా నే ఈ కార్లు ఎర్ర దీపముల వద్ద ఆగుతాయి, పాదచారులకు రోడ్డు దాటడానికి దారినిస్తాయి, తమ డ్రైవింగ్ లైన్ లో ప్రయాణం చేస్తాయి, ఇతర వాహనములకు దారినిస్తాయి మరియు తమంట తాముగా ఇతర వాహనములను అధిగమిస్తాయి. తనంతట తానుగా చోదన చేయగల కార్లు ను తయారు చేయడం లో ముందంజలో గల ఈ కంపెనీ కి గతంలో ఎటువంటి కార్లు తయారు చేసిన అనుభవం లేదు. అదే గూగుల్. ఈ కార్ల సృష్టి కర్త సెబాష్టియన్ త్రూన్. ఇతను ౧8 సంవత్సరముల వయస్సులో తన స్నేహితుడును రోడ్డు ప్రమాదంలో కోల్సోయాడు. అప్పటి నుండి తన జీవితాన్ని ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో ప్రాణం కోల్పోతున్న ఒక మిలియన్ ప్రజల కు అంకితం చేయాడానికి నిశ్చయించుకున్నాడు. అతని ఆశయం చోదక రహిత కార్లు తయారు చేసేలా అతనిని ప్రేరేపించింది. 2004 వ సంవత్సరములో అమెరికా అత్యున్నత మిలిటరీ పరిశోధనా సంస్ధ DARPA నిర్వహించిన పోటీలో ఇతను తయారు చేసిన చోదక రహిత కారు 11 మెళ్లు ప్రయాణించి ప్రధమ స్ధానాన్ని పొందింది. తదుపరి సంవత్సరంలో 7 గంటల్లో నే 212 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన లక్ష్యన్ని చేరుకుంది. సరిగ్గా ఇటువంటి ఆలోచన వచ్చిన గూగల్ సంస్ధ సెబాస్టియన్ ని తమ కంపెనీ ముఖ్యాలయం మౌంటెన్ వ్యూ కి చోదక రహిత కార్ల ను అభివృద్ధి చేయడానికి ఆహ్వనించింది. సెబాస్టియన్ మరియు DARPA లో పోటీ పడిన మరో ఇంజనీర్ క్రిస్ అర్మసన్ తో కూడిన గూగుల్ ఇంజనీర్ల సముదాయం యెక్క కృషి ఫలితంగా చోదక రహిత టయోటా ప్రియుస్ కార్లు శాన్ ఫ్రాన్సిస్కో మరియు మౌంటైన్ వ్యూ ప్రాంతాలలో ప్రయాణించాయి. ఈ కార్లు ప్రతీరోజు ట్రాఫిక్ లో తమంతట తాము గా చోదకుల సహయం లేకుండా ఎటువంటి ప్రమాదాకి గురి కాకుండా ప్రయాణించ గాలిగాయి. అయితే ఈ కార్లు మార్కెట్ లోకి రావడానిరి కొన్ని సంవత్సరాలు (దశాబ్దములు కాదు) పట్టే అవకాశం ఉందని గూగల్ సంస్ధ తెలియ చేస్తోంది. అయితే భారతదేశంలో ఈ కార్లు షికారు చేయడానికి మాత్రం దశబ్దాలు పట్టే అవకాశం ఉందిట. ఈ కార్ల వలన ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహంచాలి అనే న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. వీటిని పరిష్కరించవలసి ఉన్నది.
Saturday, March 3, 2012
మెదడు చురుకుగా పనిచేయడానికి పాలు త్రాగండి
మెదడు చురుకుగా పనిచేయడం లో పాలు కీలక పాత్ర పోషిస్తుంది అని మైన్ యూనివర్సిటీ పరిసోధకులు తెలియచేసారు. వీరు 23 నుంచి 90 సంవత్సరముల వయసు గల 900 మంది స్త్రీ మరియు పురుషులకు వివిధ రకాల మెదడు సంబంధిత పరీక్షలు పెట్టి పరీక్షించి చూశారు. వీరిలో రోజు పాలు త్రాగేవారు, అసలు పాలు త్రాగనివారు లేదా అసలు త్రాగనివారి కంటే ఎక్కువ మార్కులను పొందారు. రోజూ పాలు త్రాగే వయస్కులు ఎక్కువ మార్కులు పొందారు. పాలు రోజు త్రాగడం వలన శారీరక పెరుగుదలే కాక, మెదడు కూడా చురుకుగా పనిచేస్తుందని "ఇంట్ర్నేషనల్ డైరీ జర్నల్" లో ప్రచురించారు.
Friday, March 2, 2012
శ్రీలంక గెలుపు, భారత్ ఇంటికి
ఈ రోజు జరిగిన కీలక ఆస్ట్రేలియా - శ్రీలంక క్రికెట్ మాచ్ లో శ్రీలంక 10 పరుగుల తేడా తో ఆస్ట్రేలియ పై గెలిచి ఫైనల్ లో అడుగు పెట్టింది. హస్సీ పోరాటం వృధా అయ్యింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో వున్న భారత్ ఇంటి బాట పట్టింది.
Subscribe to:
Posts (Atom)