Wednesday, February 29, 2012

వేలానికి రానున్న గోల్కొండ వజ్రం

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గోల్కొండ వజ్రాల గనుల  నుంచి వచ్చిన 'బ్యూ-శాన్సి' వజ్రం మే నెలలో జెనీవాలోని సోధ్బీ లో వేలానికి రానుంది.  1610 లో ఈ వజ్రాన్ని  ఫ్రెంచ్ చక్రవర్తి హెన్రీ-VI భార్య రాణీ మారీ డి మెడిసి పట్టాభిషేక సమయంలో కిరీటంలో అలంకరించుకుంది.  ఈ వజ్రం 34.98 కారెట్ల బరువు కలిగియుంది.  2 మిలియన్ డాలర్ల నుంచి 4 మిలియన్ డాలర్ల వరకు పలక వచ్చునని అంచనా.  16 వ శతాబ్ది మధ్యలో ఈ వజ్రాన్ని పొందిన లార్డ్ ఆఫ్ శాన్సీ నికోలస్ డి హర్లే  పేరు మీద నామకరణం చేయబడి వంశ పారంపర్యంగా ఫాన్స్, ఇంగ్లాండ్, పర్షియా మరియు నెదర్లాండు యెక్క ఆరెంజ్-నాసా దేశ రాజ వంశస్తుల చేతులు మారింది.  గోల్కొండ వజ్రాల గనులు నుంచి వచ్చిన వజ్రాలు పారదర్శకత, స్వచ్ఛత మరియు తెలుపు దనానికి పెట్టింది పేరు.  ఈ లక్షణాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అరుదుగా లభించే టైవు-2 వజ్రాలలో మాత్రమే ఉంటాయి. 
    గోల్కొండ నుంచి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మరికొన్ని వజ్రాలు కోహినూర్, రీజెంట్ మరియు హోప్.  కోహినూర్ వజ్రం 186 కారెట్ల బరుమ కలిగి ప్రస్తుతం బ్రిటీషు రాణి కిరీట సంపదలో వుంది. అతిపెద్ద గోల్కొండ వజ్రం రీజెంట్.  దీని బరువు 410 కారెట్లు.  ఇది ప్రస్తుతం పారీస్ లోని లారే మ్యూజియం లో వుంది.  మరొక వజ్రం హోప్, ఇది ౪0 కారెట్ల బరువు కలిగి ప్రస్తుతం వాషింగ్టన్ లోని స్మిత్సోనియన్ మ్యూజియం లో వుంది. 

సచిన్ కి ఇంకా ఆడాలని వుందా?

ఈ రోజు ఆసియ కప్ కి సెలక్షన్స్ జరుగనున్నాయి.  అయితే సచిన్ కి విశ్రాంతిని ఇస్తారా? లేదా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది.  25 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్ లో సచిన్ అందుకోని మైలు రాయి లేదు.  ప్రపంచ కప్ ని కూడా ఆశ్వాదించాడు.  ఇంకా సచిన్ ఏం కోరుకుంటున్నాడు.  ఏం ఆశించి ఇంకా అన్ని ఫార్మాట్ల లో ను ఆడాలనుకుంటున్నాడు.  100 సెంచరీల కోసమైతే టెస్టు లలో కొనసాగవచ్చు. తన కోరిక నెరవేర్చుకోవచ్చు.  దేశం లో అనేక మంది యువ  క్రికెటర్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.  సెలక్షన్ కమిటీ సాగనంపే వరకు వేచి చూడడం సచిన్ లాంటి వ్యక్తికి ఇచ్చే గౌరవం కాదు. సచిన్ తనకు తానుగా నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమయింది అనిపిస్తోంది. కాదంటారా?

Tuesday, February 28, 2012

మహిళా డ్రైవర్లు జర భద్రం

హైదరాబాదు నగర పోలీసు లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా మహిళా డ్రైవర్లను కూడా శోధించ నున్నారు. ఇందు కోసం మహిళా ఎస్సై ల సేవలను వినియోగించు కోనున్నారు.   వీకెండ్ మహిళా పార్టీల కు వెళ్లేవారు మరియు మహిళా రాత్రులయిన బుధ, గురు మరియు శుక్ర వారము లలో కూడా  శోధన చేయడానికి ఎర్పాట్లు చేశారు.  గత వారం 40 మంది మహిళలను శోధించగా ఒక కేశు కూడా నమోదు అయిందిట.  కాగా హైదరాబాదు ట్రాఫిక్ విభాగాము యొక్క చర్య ను మహిళలు స్వాగతిస్తున్నారు.  ఎదో ఒకటి రెండు రోజులు కు పరిమితం కాకుండా శోథన దీర్ఝకాలం కొనసాగించాలని కోరుకుటున్నారు.  సో.. మహిళలు బహుపరాక్.

Sunday, February 26, 2012

లవ్ హార్మొన్

మీ సంబంధం ఎంత కాలం నిలుస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ రక్తం లో 'ఆక్సిటోన్' లెవెల్ ఎంత వుందో తెలుసుకో మంటున్నారు శాస్త్రవేత్తలు.  ఇజ్రాయెల్ లోని బార్-ఇలాన్ యూనివర్సిటీ వారి పరిశోధన లో ఎక్కువ స్థాయి లో 'ఆక్సిటోన్' కలిగిన జంటలు తక్కువ స్థాయిలో 'ఆక్శిటోన్' కలిగిన జంటలు కన్న ఎక్కువ రోజులు కలసి ఉంటున్నారుట.  వీరి పరిశోధన కోసం కొత్తగా జీవితం ప్రారంభించిన వారిని ఎంపిక చేసుకున్నారు.  ఆరు మాసముల వ్యవధి తరువాత, ఎక్కువ స్థాయి లో 'ఆక్సిటోన్' కలిగిన జంటలు వారి సంబంధాన్ని ఇంకా కొనసగిస్తున్నారు లేదా కొనసాగించడానికి ఆసక్తిని కనవరిచారు కాగా తక్కువ స్థాయి లో 'ఆక్సిటోన్' కలిగిన జంటలు విడిపోవడం జరిగిందిట.  ఈ ఆక్సిటోన్ హార్మోన్ తల్లి శిశువుల బంధం లో కూడా కీలక పాత్ర వహిస్తుందిట.  ఇంతకు ముందు జరిగిన పరిసోధన లో నాశికా రంధ్రాల వద్ద ఆక్సిటోన్ పిచికారి వలన జంటల మధ్య ఆకర్షణ పెరిగినట్లుగా నిర్ధారణ జరిగింది.

Saturday, February 25, 2012

రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమణ లో 36 కాదు 60 ఎకరాల ప్రభుత్వ భూమి

రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమణలో 60 ఎకరములు ప్రభుత్వ భూమి ఉన్నట్లు గా రంగారెడ్డి జిల్లా జేసి ఎలక్ట్రానిక్ టోటల్ సర్వే ఆధారంగా నిర్ధారించారు. కాగా ఈ రోజు ఈనాడు దినపత్రికలో రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రభుత్వ భూములు ఏవి లేవని వార్త వచింది.

ప్రపంచ శాంతి

When there is righteousness in the heart
There is beauty in the character
When there is beauty in the Character
There is harmony in the home
When there is harmony in the home
There is order in the Nation
When there is Order in the Nation
There is peace in the World.

Friday, February 24, 2012

భారత దేశ అమ్ముల పొదిలో మరొక అస్త్రం

అగ్ని క్షిపణి - V ప్రయోగానికి సిద్ధం. మార్చి/ఎప్రిల్ నెల లో ఓరిస్సా నుంచి పరీక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  5000 వేల కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి చైనా మరియు రష్యా లొ కొంత భాగము లోని లక్ష్యాలను కూడా చేదించగలదు.  ఇప్పటి వరకు ఇటువంటి సామర్ధ్యం us,uk, france, Russia మరియు chaina లకు మాత్రమే వుంది.  కాని మనం చైనా కు చాలా దూరం లో ఉన్నాము.  china ఇప్పటికే 11200 కి.మీ. లక్ష్యాలను చేదించగల సామర్ధ్యాన్ని కలిగిన క్షిపణులను కలిగి ఉంది.  భారత్ కూడా త్వరలొ నే ఇటు వంటి పరిజ్నానాన్ని సొంతం చేసుకుంటుందని ఆశిద్దాం.

Thursday, February 23, 2012

భగత్ సింగ్ బొమ్మ తో 5 రూపాయల నాణెం విడుదల

భగత్ సింగ్ బొమ్మ తో 5 రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు గా రిజర్వు బ్యాంకు ఒక ప్రకటన విడుదల చేసింది.  ఇనుము మరియు క్రోమియం ల మిశ్రమము లతో తయారు చేయబడే నాణెము నకు ఒక వైపు భగత్ సింగ్ బొమ్మ మరియు షాహిద్ భగత్ సింగ్ జన్మ శతాబ్ది 1997-2007  అను అక్షరములు పొందుపొరచ బడి వుంటాయి.  మరొక వైపు నాలుగు సింహాల ముద్ర 5 అనే అంకె ముద్రించబడి వుంటాయి.