Wednesday, October 29, 2014

మీకీ విషయం తెలుసా?



ఈ రోజు నాకొక కొత్త విషయం తెలిసింది.  అదేమిటంటే "వెండి తెర నవలలు" అంటే సినిమా నవలలు.  నవలల ను సినిమాలు గా తీయడం మనందరికి సుపరిచితమే.  కాని ముందే తీసిన సినిమాలను నవలా రూపంలో అచ్చువేయించేవారుట. అంటే రివర్స్ అన్నమాట, ముందు సినిమా ఆ తరువాత నవల.  ఇది విన్నప్పుడు నిజంగా గమ్మత్తుగా అనిపించింది. కాని ఇది నిజం.  తెలుగు సినిమా తొలి నాళ్లలో సినిమాలను ప్రజలకు చేరువయ్యేందుకు నవలా రూపంలో అచ్చువేయించేవారుట.  ఒక పెద్ద కధను మూడు గంటలలో సినిమాగా చూపించాలి.  అందువలన దర్శకునికి అది పెద్ద సవాలు.  దర్శకుడు సినిమాలో తీసింది అంటే దర్శకుని కోణం (దర్శకుని మనస్సులో ఉన్నది)  ప్రజలకు  తెలియాలనే ఉద్దేశ్యంతో నవలలను అచ్చువేయించేవారుట.    పాతాళభైరవి, మాయా బజారు, కన్యాశుల్కం ఇత్యాది సినిమాలు నవలలు గా వచ్చి ప్రజల మన్ననలు పొందడమే గాక పునః ముద్రణ కూడా గావింప బడినవిట.

Monday, October 27, 2014

ఎందుకిలా?

ఈ మధ్య ఫేస్ బుక్ లో చాలా మంది దేవుడి ఫొటోలు పోస్ట్ చేసి 5 సెకన్లలో షేర్ చేయండి మీకు మంచి జరుగుతుంది లేదా మంచి వార్త వింటారు అని రకరకాలుగా మెసేజ్ లు పెడుతున్నారు. వాటిని చాలా మంది షేర్ చేస్తున్నారు.   మా చిన్న తనంలో కూడా ఇలా పామ్ ప్లేట్ లు పంచి పెట్టే వారు.  వాటిలో దేముడి మహిమలు లేక  దేవుడు కలలో కనిపించాడు, అది చేయమన్నాడు ఇది చేయమన్నాడు అంటూ వ్రాసి చివరకు మీరు కూడా కొన్ని పామ్ ప్లేట్లు పంచండి లేక పోతే మీకు కీడు జరుగుతుంది అంటూ వ్రాసేవారు.  అసలు ఇలా ఎవరు మొదలు పెట్టేరో తెలీదు కాని వారికి ఎం ఒరుగుతుందో నిజంగా నాకు అర్ధం కాలేదు. వీళ్లకి మినిమం కామన్ సెన్స్ ఉండదా అని పిస్తుంది.   బలహీనుల జీవితాలతో ఆడుకుంటున్నారు.  ఆ పామ్ ప్లేట్ లను పడయలేక వేరే వాళ్లకి ఇవ్వ లేక (పామ్ ప్ల్టేట్ ఇచ్చే వాళ్లని చాలా అనుమానంగా చూసేవారు) వాళ్లు పడే యాతన పగవాడికి కూడా వద్దురా బాబు అని పిస్తుంది.     ఇలాంటి బలవంతపు షేర్ ల వలన కలిగే లాభం ఎమిటో ఎంతకీ అంతుపట్టదు.  వాళ్లకి మంచి జరగడం దెవుడెరుగు, మరొకళ్లని ఇబ్బందుల పాలు చేసినందుకు మాత్రం తప్పక దండించ బడతారనిపిస్తుంది.

Sunday, October 26, 2014

సప్త వర్ణ రంజిత మైన గులాబీలు.


పైగులాబీను చూశారు కదా.  ఇది నిజమైన గులాబీనే, పెయింటింగ్ కాదు మరియు ఫోటోషాప్ లో డిజైన్ చేసింది కూడా కాదు. నిజంగా నిజమైందే.  కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా.  గులాబీలంటే పింక్ రంగు గులాబీలే మనకు తెలుసు.  ఆతరువాత హైబ్రీడ్ రకం వచ్చాక గులాబీలు కొత్త కొత్త రంగులు తెచ్చుకున్నాయి.  తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు ఇలా వేలాది రంగులలో గులాబీలను మనం  చూశాము.  ఇప్పుడు ఇంద్రధనస్సు రంగులులో గులాబీలు తయారు చేస్తున్నారు నెదర్లాండు కు చెందిన పీటర్ డె వెర్కన్.  పీటర్ ఒక ఫ్లోరిస్ట్ తన వ్యాపార అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నంలో పుట్టుకొచ్చినవే ఈ హరివిల్లు గులాబీలు. రంగుల పూలు ఆకులు నుంచి రంగులను సేకరించి ఆయా రంగులను నీటిలో కలిపి ఆ నీటిని గులాబీ మొక్కలు పీల్చుకునేలా చేసి ఈ ఇంద్రధనస్సు రంగులలో గులాబీలు పూయిస్తున్నారు.  గులాబీలు పుష్ప జాతులలో మహరాణీ వంటివి.  మనం ఎవరినైనా ఎటువంటి సందర్భంలోనైనా  అభినందించాలంటే మనకి ఠక్కున గుర్తుకు వచ్చేవి  గులాబీలు.  ప్రేమలో ఉన్న వారైతే చెప్పనక్కరలేదు  వారు తమ మనసు దోచిన చెలికత్తెకు ప్రొపోజ్ చేసే సంబర్బంలో  గులాబీ కంటే ఇవ్వదగిన బహమతి మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.  మీకు కూడా వీటిని బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా? మరెందుకాలస్యం వెంటనే rainbowedroses.com కి వెళ్లండి.

Saturday, October 25, 2014

రెడ్ ఎమ్ ఐ ఫోన్ కొంటున్నారా? ఒక్క సారి ఆలోచించండి.

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్ లో రెడ్ ఎమ్ ఐ ఎస్ 1 ఫోను మంచి ఫీచర్లతో సరసమయిన ధరలో (రు. 5999 మాత్రమే) లబిస్తోంది.  ఈ ఫోనును సొంతం చేసుకోవడానికి ముందుగా మీరు మీ ఫ్లిప్ కార్ట్ అక్కౌంటు ద్వారా నమోదు చేసుకోవలసి ఉంటుంది.  తరువాత ఫ్లిప్ కార్ట్ సూచించిన తేదీ మరియు సమయానికి అమ్మకాలు ప్రారంభమవుతాయి.  సరిగ్గా అదేసమయానికి మనం బై అనే బటన్ క్ల్దిక్ చేయడం ద్వారా మనం కొనుక్కోవచ్చు.   కాని లక్షలాది మంది నమోదు చేసుకుంటుండడం వలన సెకన్ల వ్యవధిలో నే అమ్మకాలు పూర్తి ఆయిపోతున్నాయి. చాలా మంది నిరాశకు గురవుతున్నారు.  అంత ప్రజాదరణ పొందింది ఈ  స్మార్ట్ ఫోను.  అయితే  ఈ  ఫోన్ బుక్ లోని కాంటాక్ట్స్ మరియు మెసెజెలు బీజింగ్ లోని సర్వర్లలో నిక్షిప్తమవుతున్నాయట. ఆందుకే తమ ఉద్యోగులు మరియు వారి పరివారాన్ని  ఈ ఫోను వినియోగించ వద్దని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిబంధన విధించింది.  సో మీరు కూడా రెడ్ ఎమ్ ఐ ఫోన్ కొందామనుకుంటున్నారా? అయితే ఒక్క సారి ఆలోచించండి.  


Friday, October 24, 2014

FACEBOOKలో షేర్ బడిన ఈ మెసేజ్ చుడండి. దీనిని రాసిన వారిని మీరు ఖచ్చితంగా అభినందిస్తారు.

FACEBOOKలో షేర్ బడిన ఈ క్రింది మెసేజ్ చుడండి.  దీనిని కంపోజ్ చేసిన వాడికి హాట్సాఫ్ . 



1. DILIP VENGSARKAR
When you rearrange the letters:
A SPARKLING DRIVE


2. PRINCESS DIANA
When you rearrange the letters:
END IS A CAR SPIN


3. MONICA LEWINSKY
When you rearrange the letters:
NICE SILKY WOMAN


4. DORMITORY
When you rearrange the letters:
DIRTY ROOM


5. ASTRONOMER
When you rearrange the letters:
MOON STARER


6. DESPERATION
When you rearrange the letters:
A ROPE ENDS IT


7. THE EYES
When you rearrange
THEY SEE


8. A DECIMAL POINT
When you rearrange the letters:
I M A DOT IN PLACE


AND FOR THE GRAND FINALE
MOTHER-IN-LAW
When you rearrange the letters:
WOMAN HITLER...

Thursday, October 2, 2014

ఎంత తేడా?

ఈ రోజు పేపరులో వచ్చిన రెండు వార్తలు చూడండి తేడా ఎంతో మీకు కుడా తెలుస్తుంది.  ఒకరు పర్యావరణానికి హనికరమని తన ప్లెక్సీలు తొలగిస్తే మరో పక్క మన  దొరవారి ప్లెక్సీ కాలిందని దాని మీద ఎంతో విలువయిన ప్రజా వనరులను పణంగా పెట్టి ఎంక్వయిరీ.  మరో విషయం నిన్న మన ప్రధాని నరేంద్ర మోది గారు పిలుపు మేరకు దేశ ప్రజలందరూ స్వచ్ఛ భారత్ కు ప్రమాణం చేసి తమవంతు శుద్ధి కార్యక్రమాన్ని చేపడితే మన సియం గారు మాత్రం ఎక్కడా కనపడలేదు.  మీరేమైనా చూశారా?