సిగ్గు సిగ్గు ...
భారత టెన్నిస్ సమాఖ్య లండన్ లో జరిగే ఒలింపిక్స్ కు రెండు జట్లు మహేష్ మరియు బోపన్న, పేస్ మరియు విష్ణు వర్ధన్ లను ఎంపిక చేసి తమ చేత కానీ తనాన్ని బయట పెట్టుకుంది. పేస్ తో జతకట్టేది లేదని మొండికేసిన మహేష్ మరియు బోపన్న ల మీద క్రమశిక్షణ చర్య కూడా తీసుకోలేని స్థితి లో వున్నాము అని బహిరంగంగానే ఒప్పుకున్నారు. అలా ప్రకటించి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చారు. దేశ ప్రయోజనాలు గాలికి వదిలేసారు. బోర్డులను క్రీడాకారులు శాసించే స్థితిలో వున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు మన వ్యవస్థలు ఎంత దిగజరిపోయయో. దేశ ప్రయోజనాలకన్న తన ఈగో నే ముఖ్యమనుకుని తను చెడింది కాకా వర్ధమాన క్రీడ కరుడిని సహితం చెడగొట్టిన మహేష్ క్షమార్హుడు కాదు మరియు చరిత్ర హినుడిగా మిగిలి పోతాడు. తన స్వ ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మహేష్ అసలు క్రీడ కారుడే కాదు. డర్టీ ......