Wednesday, August 20, 2008

బి సి ల ప్రైవేటు బకాయిలు రద్దు చేస్తాం...చంద్రబాబు

పరిస్తుతులు ఎటు వంటి వారి నయినాప్రభావితం చేస్తాయి అనడానికి ఒక మంచి ఉదాహరణే చంద్రబాబు నాయుడు నేటి వాగ్దానం. రైతులకు ఉచిత కరెంటు వాగ్దానం పై నాడు చంద్రబాబు ప్రతి స్పందన చూసి చాల గర్వించాను. ఎందు కంటే నిజం గా ఆలోచిస్తే ఈ ఉచిత ప్రయోగాలు భవిష్యత్తులోఎంతటి అనర్ధాలు తెస్తాయో ఉహిస్తే భయమేస్తోంది. ఉచితంగా ఇచ్చే బదులు ఆ నిధులను విద్యుత్ రంగ పరిపుష్టికి వినియోగించి .. కరెంటు ను ప్రతి వినియోగదారు నాకు మేలు చేకూర్చే లాగా తక్కువ ఖరీదుకు నాణ్యమైన విద్యుత్ ఇస్తే ఆనందించని సగటు వినియోగదారుడుండదు అంటే అతిసెయోక్తి లేదు... అంటే కాదు ఉచిత కరంటు వలన ఖర్చయినా మొత్తానికి సరిపడా పన్నుల రూపం లో పరోక్షం గా మనమీద నే పడుతోంది. ఆ విషయం చాల మంది గ్రహించడం లేదు. రాజ కీయ నాయకులూ తమ పబ్బం గడుపుకోవడానికి మొత్తం వ్యవస్తనే అస్తవ్యస్తం చేస్తున్నారు. వారి మాయలో పడి సగటు వినియోగదారుడు బలి అయిపోతున్నాడు. జే పి గారు అన్నట్లు ప్రజలను బిచ్చగాళ్ళ లాగా మార్చేస్తున్నారు.. తమ కళ్ళమీద తాము బ్రతికే అవకాశాన్ని హరిన్చేస్తున్నారు. హే భగవాన్ రక్షించు నా దేశాన్ని ...

4 comments:

  1. ఏం చేస్తాడు పాపం. నోటికొచ్చిన వాగ్దానమల్లా చేసి వైఎస్ అందలమెక్కితే బాబేమో ఉన్నదున్నట్లు చెప్పి నెత్తిన చెంగేసుకున్నాడు. అందుకే ఇప్పుడు రూటు మార్చినట్లున్నాడు. తను చెయ్యాలనుకున్నవి చెయ్యాలంటే ముందు ఏదోలా అధికారం సంపాదించుకోవాలి కదా. దానికి బిసీలేం ఖర్మ, కావాలంటే రాష్ట్రంలో అందరి బకాయిలూ మాఫీ చేస్తానన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. గద్దెనెక్కాక చెప్పిన వాటిలో నిజంగా చేసినవెన్నో చూడొచ్చేదెవరు?

    ReplyDelete
  2. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు, చంద్రబాబునాయుడు ఓడిపోవటానికి కూడా ఎన్నో కారణాలు. కానీ అయన ఓటమికి ఆయన సంస్కరణలు మాత్రమే కారణమని కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల మీద చర్య తీసుకోవాలన్నా, ఏ విధమైన మార్పు తేవాలన్నా భయపడుతున్నారు. ప్రస్తుతం బాబు కూడా అది నిజమని నమ్ముతున్నారని, ఆయన చేస్తున్న వాగ్ధానాలే చెప్తున్నాయి. ఒకవేళ ఈసారి అధికారంలోకి వచ్చినా, ఇంతక ముందులా ఏదైనా మార్చటానికి ప్రయత్నిస్తారని అనుకోను. పైగా ప్రభుత్వ ఆస్తులు అయినకాడికి తెగనమ్మేసి, వచ్చిన డబ్బు వాటాలు పంచేసుకుని, మిగిలిందాంతో జనాకర్షక పధకాలు ప్రవేశపెట్టి, ఇటు ఆస్తులు పెంచుకోటం, అటు జనాన్ని ఆకట్టుకోటం, రెండూ చెయ్యొచ్చని కాంగ్రెస్ వాళ్ళు నిరూపిస్తుంటే, బుద్దున్న రాజకీయనాయకుడెవడైనా వేరే దారి తొక్కుతాడా.

    ReplyDelete
  3. రాబొయె 7 నెలలు ఇట్లాంటి "ఓట్ల కొసం మాత్రమే" పథకాలు చాల వింటాము.

    ReplyDelete
  4. మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

    SRRao
    శిరాకదంబం

    ReplyDelete