Tuesday, August 19, 2008

అభినవ్ ... ఒలింపిక్స్ ...

మన దేశ పరువు నిలిపిన అభినవ్ కు అభినందనలు .... అభినవ్ స్వర్ణ పతకం సాదించిన వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వము కూడా అనేక నజరానాలు ప్రకటించాయి. చాలాసంతోషం .. వాటికీ అతనుఅన్ని విధాల అర్హుడు, అందులో ఎటు వంటి సందేహం లేదు. అయితే ఎ క్రీడలోనైనా పతాకం సాధించిన తరువాత నజరానాలు ప్రకటించడం షరామామూలై పోయింది. అయితే ఆ యా మొత్తాలను క్రీడభి వ్రుదికి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తే మరెంతో మంది మరెన్నో పతకాలు తెచ్చే అవకాశంవుంటుంది కదా .. షూటింగ్ లో ఢిల్లీ లో మాత్రమేగల షూటింగ్ రేంజ్ గురించి వింటే వేలకోట్ల రూపాయల నిధులు ఏమవుతున్నాయో తెలీడం లేదు. వంద కోట్ల మంది భారతీయులలో ఒక్కపతకం మాత్రమే అది కూడా అతని స్వ శక్తి తో తెచ్చు కుంటే అదేదో మన ప్రభుత్వాలు సాధించిన ఘనత గా చెప్పుకోవటం ఎంత సిగ్గు చేటు. నాయకులారా దయచేసి మారండి. ఆ లోచించండి ..

1 comment:

  1. మీరు చెప్పింది నిజ్జంగా నిజం. గెలిచిన వారికి అంతంత నజరానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక దుర్వినియోగం అంటారా... గతం లో ఒకసారి మనవాళ్ళు olympics కి వెళ్ళినప్పుడు ఏమి జరిందో చెప్పమంటారా.. ఆటగాళ్ళు 18 ఉద్యోగులు 36. ఈ ఉద్యోగులు చేసిన ఘన కర్యమేమిటంటే.. వాళ్ళ వాళ్ల పెళ్ళాలని, బావమర్డుల్ని ప్రభుత్వ ఖర్చు తో తీసికెళ్ళి sight seeing, shopping చేయడం. event జరిగే దగ్గిర ఒక్కడుంటే ఒట్టు. ఇదీ మన క్రీడల దుస్తుతి. ఆట పరికరాలలో, బోజన ఖర్చుల్లో, ఇంకా అనేక వాటిల్లో commission కొట్టడం, అనర్హులకి certificates ఇవ్వడం లో వేలకి వేలు చేతులు మారుతుంటై. ఆ దొంగ certificates తో ఉద్యోగాలు, సీట్లు, రిజర్వేషన్స్..

    ReplyDelete