Wednesday, August 20, 2008
బి సి ల ప్రైవేటు బకాయిలు రద్దు చేస్తాం...చంద్రబాబు
పరిస్తుతులు ఎటు వంటి వారి నయినాప్రభావితం చేస్తాయి అనడానికి ఒక మంచి ఉదాహరణే చంద్రబాబు నాయుడు నేటి వాగ్దానం. రైతులకు ఉచిత కరెంటు వాగ్దానం పై నాడు చంద్రబాబు ప్రతి స్పందన చూసి చాల గర్వించాను. ఎందు కంటే నిజం గా ఆలోచిస్తే ఈ ఉచిత ప్రయోగాలు భవిష్యత్తులోఎంతటి అనర్ధాలు తెస్తాయో ఉహిస్తే భయమేస్తోంది. ఉచితంగా ఇచ్చే బదులు ఆ నిధులను విద్యుత్ రంగ పరిపుష్టికి వినియోగించి .. కరెంటు ను ప్రతి వినియోగదారు నాకు మేలు చేకూర్చే లాగా తక్కువ ఖరీదుకు నాణ్యమైన విద్యుత్ ఇస్తే ఆనందించని సగటు వినియోగదారుడుండదు అంటే అతిసెయోక్తి లేదు... అంటే కాదు ఉచిత కరంటు వలన ఖర్చయినా మొత్తానికి సరిపడా పన్నుల రూపం లో పరోక్షం గా మనమీద నే పడుతోంది. ఆ విషయం చాల మంది గ్రహించడం లేదు. రాజ కీయ నాయకులూ తమ పబ్బం గడుపుకోవడానికి మొత్తం వ్యవస్తనే అస్తవ్యస్తం చేస్తున్నారు. వారి మాయలో పడి సగటు వినియోగదారుడు బలి అయిపోతున్నాడు. జే పి గారు అన్నట్లు ప్రజలను బిచ్చగాళ్ళ లాగా మార్చేస్తున్నారు.. తమ కళ్ళమీద తాము బ్రతికే అవకాశాన్ని హరిన్చేస్తున్నారు. హే భగవాన్ రక్షించు నా దేశాన్ని ...
తెలుగు బ్లాగులు వర్ధిల్లాలి
నిజంగా తెలుగు లో బ్లాగ్గింగ్ చేయడం చాలా ఆనందంగా వుంది. కమ్యునికేషన్ రంగం లో వచ్చిన విప్లవం పుణ్యమాని స్నేహితులకు బంధువులకు ఉత్తరాలు రాయడం బాగా తగ్గి పోయింది లేదు.. లేదు.. పూర్తి గా పోయింది. ఆఫీస్ లో తెలుగు ఉపయోగించే అవకాశమే లేదు. చాలాకాలం తరువాత మన మాత్రు భాషలో పోస్ట్ లు రాస్తోంటే చాల (తెల్గు లో టైపింగ్ చేయడం కష్టము అయినప్పటికీ) ఆనందం గా వుంది. దేశ భాష లందు తెలుగు లెస్స.. అందుకే తెలుగు బ్లాగులు వర్ధిల్లాలి.....
Tuesday, August 19, 2008
అభినవ్ ... ఒలింపిక్స్ ...
మన దేశ పరువు నిలిపిన అభినవ్ కు అభినందనలు .... అభినవ్ స్వర్ణ పతకం సాదించిన వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వము కూడా అనేక నజరానాలు ప్రకటించాయి. చాలాసంతోషం .. వాటికీ అతనుఅన్ని విధాల అర్హుడు, అందులో ఎటు వంటి సందేహం లేదు. అయితే ఎ క్రీడలోనైనా పతాకం సాధించిన తరువాత నజరానాలు ప్రకటించడం షరామామూలై పోయింది. అయితే ఆ యా మొత్తాలను క్రీడభి వ్రుదికి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తే మరెంతో మంది మరెన్నో పతకాలు తెచ్చే అవకాశంవుంటుంది కదా .. షూటింగ్ లో ఢిల్లీ లో మాత్రమేగల షూటింగ్ రేంజ్ గురించి వింటే వేలకోట్ల రూపాయల నిధులు ఏమవుతున్నాయో తెలీడం లేదు. వంద కోట్ల మంది భారతీయులలో ఒక్కపతకం మాత్రమే అది కూడా అతని స్వ శక్తి తో తెచ్చు కుంటే అదేదో మన ప్రభుత్వాలు సాధించిన ఘనత గా చెప్పుకోవటం ఎంత సిగ్గు చేటు. నాయకులారా దయచేసి మారండి. ఆ లోచించండి ..
Sunday, August 17, 2008
చిరంజీవి రాజకీయం
చిరు రాజకీయ ప్రవేశ ప్రకటన ఆ సించిన దాని కంటే చాల చక్కగా జరిగింది. చాలాప్రశ్న లకు రాజ కీయ వేత్తలగానే చాలాచక్కగా సమాధానాలు చెప్పారు. నేనేమి కొత్త పనులు చేయలేను కాని ఈ పనులనే కొత్తగా చేస్తాను అని చెప్పటం లో తను ఎంత వాస్తవానికి దగ్గరలో వున్నారో తెలియచేస్తోంది. మీకు రాజకీయాలు ఏమి తెలుసు అంటే ఆయన ఇచిన సమాధానం - నాకు తెలీకపోవచు తెలుసు కుంటాను అన్నఅర్ధం తో కూడిన సమాధానం లో ఎంతో నిజాయితీ కనిపించింది. కాని చిరు రాజకీయ ప్రవేశం మన రాష్ట్ర రాజకీయాలలో ఒక ఆరోగ్యకరమైన పోటి ని కలుగ చేయాలనీ ఆశిద్దాము... జై చిరంజీవ...
Subscribe to:
Posts (Atom)