Tuesday, June 17, 2014

ఫిఫా - ప్రపంచ పుట్ బాల్ కప్ పోటీలు - 2014 - ఇండియా స్ధానం

బ్రెజిల్ లో ప్రపంచ పుట్ బాల్ టోర్నమెంట్ 2014 పోటీలు  ఈ నెల 13 ప్రారంభమయ్యాయి.  మ్యాచ లన్నీ రసవత్తరంగా జరుగుతూ నేత్రానందన్ని కలుగజేస్తున్నాయి.   ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాలు 8 జట్లుగా విడిపోయి ప్రపంచ కప్ కోసం  పోటీ పడుతున్నాయి.  ప్రపంచ పటంలో ఎన్నో చిన్న దేశాలు సయితం పోటీ పడుతున్నాయి కొన్ని దేశాల పేర్లు మనం (నేను) వినికూడా ఉండలేదు.  ఆ 32 దేశాలని ప్రపంచ పటంలో గుర్తించమని మా పాప కు ఎసైన్ మెంట్ ఇచ్చాను. వెంటనే మాపాప అడిగింది ఇందులో మనదేశం లేదేమిటి అని?. అవును కదా!  మరి మన దేశం సంగతి ఎమిటీ అన్న ఆలోచన వచ్చింది.  మన దేశం పోటలకు అర్హత  సాధించలేదు అని తెలుసు కాని అసలు ఎప్పుడైనా ప్రపంచ పుట్ బాల్ టోర్నీలో పోటీ పడిందాఅన్న సందేహం వచ్చింది.  వెంటనే నెట్ లో వెతికాను.  షాకింగ్, 1948 లో ఫిఫా గుర్తింపు పొందినప్పటి నుండి ఇంతవరకు ఇండియా ఫిఫా ప్రపంచ పుట్ బాల్ కప్ టోర్నీలలో అడలేదు. 1950వ సంవత్సరంలో ఒకసారి అవకాశం వచ్చినా పోటీలకు సన్నద్ధత లేకపోవడం. బ్రెజిల్ వెళ్లి పోటీలలో పాల్గొనడానికి ప్రయాణ ఖర్చులు లేకపోవడం వంటి కారణాలతో ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది.   అప్పటినుండి 1982 వరకు కూడా మనదేశం ప్రపంచ కప్ పోటీలలో ఆడేందుకు కూడా ప్రయత్నించ లేదు.  1986 నుండి  క్వాలిఫయింగ్ పోటీలలో పాల్లొంటోంది కాని అసలు పోటీలకు అర్హత సాధించలేదు.  ఈ సారి 147 వ స్ధానంలో నిలిచింది.  2011 వరకు కనీసం ఫిఫా ప్రమాణాలకు తగ్గట్లుగా ఒక స్టేడియం కూడా లేని మన దేశం ప్రపంచ కప్ పోటీలలో ఎప్పుడు ఆడుతుందో మరి?

Saturday, June 14, 2014

అత్త తిట్టినందుకు కాదు తోడికోడల నవ్వినందుకు అన్నట్లు....


తెలంగాణా ఎమ్మెల్యే ల ప్రమాణ స్వీకారం మీద టివిల లో వచ్చిన ప్రసారాలమీద కెసిఆర్ ఫైర్ అవ్వడం చూస్తే అత్త తిట్టినందుకు కాదు తోడికోడల నవ్వినందుకు అన్నట్లుంది.  కనీసం తమ మాతృ భాష తెలుగు కూడా సరిగా చదువ లేక పోయారు వీరు రేపు ముఖ్యమైన దస్త్రాల మీద సంతకాలు చేయవలసి ఉంటుంది.  మరి అవి చదివి అర్ధం చేసు కుని పెడతారా లేక గత దేవుడి  పాలనలో లాగా ముఖ్యమంత్రి చెప్పారని లేక ఆధికారులు చెప్పారని అంటారా అన్నది దేవుడి కెరుక.      ప్రజా ప్రతినిధులు  గా ఎన్నిక కాబడడానికి కనీస విద్యార్హత ఉంటే బాగుంటుంది.