జగన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించి ఈ రోజు విడుదల కాబోతున్నాడు. నిన్న బెయిలు ప్రకటన వెలువడిన నాటి నుండి మీడియ, జగన్ అనుచరుల హడావిడికి అంతు లేదు. అసలు జగన్ అంటే ఎందుకంత క్రేజ్, జగన్ ఒక ప్రముఖ నాయకుడి కుమారుడు మరియు ఒక రాజకీయ పార్టీ స్థాపకుడు మాత్రమే. అంతకు మించి అతను సాధించింది ఏమి లేదు. తండ్రి పరపతి నుపయోగించుకుని తన కంపెనీలకు అక్రమ పద్ధతిలో పెట్టుబడులు సంపాదించుకున్నాడనే (తీవ్ర ఆర్ధిక నేరాలకు పల్పడినాడనే) అభియొగంతో జైలు పాలయ్యడు. అసలు నాయకుడంటే సత్ప్రవర్తన కలిగి మంచి పనులు చేస్తు నలుగురి ఆదర్సంగా వుండేవాడు. మరి జగన్ కు ఎందుకంత ఫాలొయింగ్ ఎందుకంత క్రేజ్. మీ అభిప్రాయాలను పంచుకోండి.