Tuesday, July 10, 2012

దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ....



అవినీతి నిందారోపణలు ఎదుర్కుంటున్న మంత్రులకు న్యాయ సహాయం ప్రజా ధనం తో అందించడం సిగ్గు మాలిన పని.  ప్రజా ధనం దుర్వినియోగం చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు కు ప్రజా ధనం తో న్యాయ సహాయం అందిస్తూ మళ్లీ ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరుస్తున్నారు.  మంత్రులకు న్యాయ సహాయం ప్రభుత్వ పరంగా అందించాలని తీసుకున్న నిర్ణయమే చెబుతోంది ప్రభుత్వం కూడా ముద్దయే నని. ఇక ఈ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు వుందా?  ప్రజా ప్రతినిదులేమైన ప్రజా సమస్యల మీద పోరాడి ఆరోపణలు ఎదుర్కున్ టున్నారా? లేక వారేమైనా కాదు నిరుపేదల?  అందరు అ తానులో ముక్కలే అందుకే ప్రధాన ప్రతిపక్షం నుంచి కూడా పెద్ద వ్యతిరేకత కనపడడం లేదు.  కనీసం కోర్టులైన జ్యోక్యం చేసుకుని ఈ అక్రమాన్ని అరికట్టాలని ఆసిస్తూ...