Wednesday, August 20, 2008

బి సి ల ప్రైవేటు బకాయిలు రద్దు చేస్తాం...చంద్రబాబు

పరిస్తుతులు ఎటు వంటి వారి నయినాప్రభావితం చేస్తాయి అనడానికి ఒక మంచి ఉదాహరణే చంద్రబాబు నాయుడు నేటి వాగ్దానం. రైతులకు ఉచిత కరెంటు వాగ్దానం పై నాడు చంద్రబాబు ప్రతి స్పందన చూసి చాల గర్వించాను. ఎందు కంటే నిజం గా ఆలోచిస్తే ఈ ఉచిత ప్రయోగాలు భవిష్యత్తులోఎంతటి అనర్ధాలు తెస్తాయో ఉహిస్తే భయమేస్తోంది. ఉచితంగా ఇచ్చే బదులు ఆ నిధులను విద్యుత్ రంగ పరిపుష్టికి వినియోగించి .. కరెంటు ను ప్రతి వినియోగదారు నాకు మేలు చేకూర్చే లాగా తక్కువ ఖరీదుకు నాణ్యమైన విద్యుత్ ఇస్తే ఆనందించని సగటు వినియోగదారుడుండదు అంటే అతిసెయోక్తి లేదు... అంటే కాదు ఉచిత కరంటు వలన ఖర్చయినా మొత్తానికి సరిపడా పన్నుల రూపం లో పరోక్షం గా మనమీద నే పడుతోంది. ఆ విషయం చాల మంది గ్రహించడం లేదు. రాజ కీయ నాయకులూ తమ పబ్బం గడుపుకోవడానికి మొత్తం వ్యవస్తనే అస్తవ్యస్తం చేస్తున్నారు. వారి మాయలో పడి సగటు వినియోగదారుడు బలి అయిపోతున్నాడు. జే పి గారు అన్నట్లు ప్రజలను బిచ్చగాళ్ళ లాగా మార్చేస్తున్నారు.. తమ కళ్ళమీద తాము బ్రతికే అవకాశాన్ని హరిన్చేస్తున్నారు. హే భగవాన్ రక్షించు నా దేశాన్ని ...